India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. గురువారం రూ.7,020 పలికిన క్వింటా పత్తి.. ఈరోజు రూ.7100 ధర పలికినట్లు అధికారులు తెలిపారు. ఎండాకాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులను మార్కెట్‌కు తీసుకొని రావాలని అధికారులు సూచించారు. మార్కెట్లో క్రయవిక్రయాల ప్రక్రియ కొనసాగుతోంది.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, కోర్సుల్లో 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి, నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 24, 27వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7, 9, 15, 17, 20, 22, 25, 28వ తేదీల్లో ఉదయం9 నుంచి 12 వరకు జరగనున్నాయి.
SHARE
సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో గురువారం జరిగిన రోడ్డు <<13120144>>ప్రమాదంలో <<>>తల్లిదండ్రులతో పాటు, నాయనమ్మ, తాతయ్యని కోల్పోయి కార్తీక్, కౌశిక్‌లు అనాథలుగా మారారు. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోగా, ఇద్దరు అన్నదమ్ములు స్వల్ప గాయాలతో మృత్యుంజయులుగా బయటపడ్డారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ ఘట్టం ముగియడంతో పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టిసారించి గెలుపుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మెదక్ లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది. ద్విచక్ర వాహన ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమిత్ షా, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ప్రచారం చేశారు.
ఆర్మూర్ పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఎల్లెందుల ఆర్యన్ జేఈఈ మెయిన్స్ లో 99.275 పర్సంటైల్ సాధించాడని వారి తల్లిదండ్రులు తెలిపారు. ఆర్యన్ హైదరాబాదులో ఇంటర్ పూర్తి చేశారు. ఆర్యన్ జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు పలువురు వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆర్యన్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తాను ఐఐటీలో చేరుతానని ఆర్యన్ తెలిపారు.
జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న స్వామి దేవాలయంలోని దొనలో రెండు రోజుల క్రితం గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొనలోని శివలింగాన్ని వదిలిపెట్టి పక్కన తవ్వకాలు చేపట్టారని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ విషయంపై ఎస్సై శ్రీధర్ ను వివరణ కోరగా ఆలయ కమిటీ సభ్యుల ద్వారా ఫిర్యాదు అందిందని, విచారణ జరిపి తవ్వకాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈనెల 30వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో ఉందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. 30న సాయంత్రం ఐదు గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు పరిధిలోని పార్టీ శ్రేణులు పాల్గొనాలని సూచించారు.
HYDలో సెల్‌ఫోన్లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్లను దొంగిలించి ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐదుగురు సూడాన్ దేశస్థులతో సహా 17 మంది ముఠాను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.75 కోట్ల విలువైన 703 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలను HYD CP శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం వెల్లడించనున్నారు.
ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు, సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులను సంప్రదించాలని జిల్లా రిటర్నింగ్ అధికారి రవి నాయక్ కోరారు. ఎన్నికల అక్రమాలపై సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా ఫోన్ నంబర్ 90597 97275/generalobserv-er011@gmail.com, ఎన్నికల వ్యయంపై ఎన్నికల వ్యయ పరిశీలకుడు వరుణ్ రంగ స్వామికి 8522875617 లేదా vrswamyexpobr11pc.mbnr@gmail. ఫిర్యాదు చేయవచ్చన్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఈనెల 30న మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల గ్రామ శివారులో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నట్లు జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ తెలిపారు. సుమారు వంద ఎకరాల్లో సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.