Telangana

News April 26, 2024

జనగామ: బాలికపై అత్యాచారం

image

రఘునాథపల్లి మండలంలోని ఓ కామాంధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. SI డి.నరేశ్ ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న బాలిక(14)ను అదే గ్రామానికి చెందిన రమేశ్(30) మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక ఎవరికీ చెప్పుకోలేక ఇంట్లో ముభావంగా ఉంటోంది. గమనించిన తల్లి మందలించడంతో విషయం చెప్పింది. దీంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 26, 2024

 NRPT: ఓపెన్ పరీక్షలు.. SSCలో 88, ఇంటర్‌లో 122 గైర్హాజరు

image

సార్వత్రిక పది, ఇంటర్ పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 593 మంది విద్యార్థులకు 505 మంది హాజరు కాగా 88 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలకు 856 మందికి 734 మంది విద్యార్థులు హాజరుకాగా 122 మంది హాజరు కాలేదు. మధ్యాహ్నం నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు వంద శాతం విద్యార్థులు హాజరయ్యారు అని అన్నారు.

News April 26, 2024

KMMకు 45 మంది, మహబూబాబాద్‌కు 30

image

ఎంపీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఖమ్మం లోక్‌సభ స్థానానికి 45 మంది 72 సెట్లు, మహబూబాబాద్‌ స్థానానికి 30 మంది 56 సెట్ల నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ప్రధాన పార్టీల నుంచి KMMలో రఘురాంరెడ్డి(కాంగ్రెస్‌), నామా నాగేశ్వరరావు(BRS), తాండ్ర వినోద్‌రావు(BJP), MHBDకు బలరాంనాయక్‌(కాంగ్రెస్‌), కవిత(BRS), సీతారాంనాయక్‌(BJP) నామపత్రాలు సమర్పించారు.

News April 26, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} పలు శాఖలపై ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} దమ్మపేటలో కాంగ్రెస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరు పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 26, 2024

MDK: నేడు సీఎం రేవంత్‌ రెడ్డి సభ

image

మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో శుక్రవారం నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌షెట్కార్‌కు మద్దతుగా నిర్వహించే సభలో ఆయన పాల్గొననున్నారు. పెద్దశంకరంపేటలోని పద్మయ్య ఫంక్షన్‌హాల్‌ సమీపంలోని ఖాళీ ప్రదేశాన్ని ఎంపిక చేశారు.

News April 26, 2024

నల్గొండ: నిడమనూరు@ 45 డిగ్రీల ఉష్ణోగ్రత

image

నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే బెంబేలెత్తిపోతున్నారు. వడగాడ్పులు వీస్తుండడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గురువారం జిల్లాలోనే అత్యధికంగా నిడమనూరులో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా అత్యల్పంగా చింతపల్లి మండలం గుడికొండ గ్రామంలో 34.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News April 26, 2024

NZB: ప్రశాంతంగా ప్రారంభమైన ఓపెన్ పరీక్షలు

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. పదో తరగతి పరీక్షకు 1017 మందికిగాను 910 మంది హాజరుకాగా, 107 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్లో 1490 మందికిగాను 1340 మంది హాజరుకాగా, 150 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షల్లో ఇంటర్ అరబిక్ పరీక్షకు గాను 23 మంది పరీక్షకు హాజరయ్యారు. పలు పరీక్షాకేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తనిఖీ చేశారు

News April 26, 2024

HYD: పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం!

image

HYD, RR, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అనేక చోట్ల రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ కార్డుదారుల నుంచి అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనిపై నిఘా పెట్టిన అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. 3 జిల్లాల్లో అధికారిక లెక్కల ప్రకారం పట్టుబడిన వారిపై శాఖాపరంగా ఏటా 250 కేసులు, క్రిమినల్ కేసులు 1800కి పైగా నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.

News April 26, 2024

మెదక్‌కు 90.. జహీరాబాద్‌కు 69 నామినేషన్లు

image

ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు కలిపి మొత్తం 94 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మెదక్‌ పార్లమెంట్‌‌కు 54 మంది 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. జహీరాబాద్‌ లోక్ సభకు 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు సమర్పించారు. చివరి రోజు భారీగా నామపత్రాలను సమర్పించారు. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంది.

News April 26, 2024

RR: పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం!

image

HYD, RR, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అనేక చోట్ల రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ కార్డుదారుల నుంచి అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనిపై నిఘా పెట్టిన అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. 3 జిల్లాల్లో అధికారిక లెక్కల ప్రకారం పట్టుబడిన వారిపై శాఖాపరంగా ఏటా 250 కేసులు, క్రిమినల్ కేసులు 1800కి పైగా నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.