Telangana

News April 26, 2024

ఎంపీ ఎన్నికలు.. TGలోనే మల్కాజిగిరి‌ టాప్

image

మల్కాజిగిరి MP స్థానానికి TGలోనే అత్యధికంగా 114 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజు ఏకంగా 61 మంది 91 సెట్‌లు అందజేశారని ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. APR 18 నుంచి 25 వరకు నిర్వహించిన నామినేషన్ల స్వీకరణలో భాగంగా 114 మంది అభ్యర్థులకుగాను 177 నామినేషన్ల పత్రాలు దాఖలు చేసినట్లు వివరించారు. దేశంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన మల్కాజిగిరి(మినీ ఇండియా)లో అదే స్థాయిలో నామినేషన్లు వచ్చాయి.

GHMC సమ్మర్ క్యాంప్ కోచింగ్.. JUST రూ.10

image

HYDలో ఉన్న పిల్లలకు GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ గుడ్ న్యూస్ తెలిపారు. కేవలం రూ.10తో సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు sports.ghmc.gov.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. 37 రోజుల పాటు 44 క్రీడలపై శిక్షణ అందించనున్నారు.

News April 26, 2024

BRS, BJP హయాంలో అభివృద్ధి శూన్యం: వంశీచంద్ రెడ్డి

image

పాలమూరు జిల్లాను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయకుండా ఆగం చేశారని, పాలమూరు జిల్లా ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టకుండా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని వివిధ గ్రామాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు.

News April 26, 2024

GHMC సమ్మర్ క్యాంప్ కోచింగ్.. JUST రూ.10

image

HYDలో ఉన్న పిల్లలకు GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ గుడ్ న్యూస్ తెలిపారు. కేవలం రూ.10తో సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు sports.ghmc.gov.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. 37 రోజుల పాటు 44 క్రీడలపై శిక్షణ అందించనున్నారు.

News April 26, 2024

HYD: మరో 10 రోజులు జాగ్రత్త!

image

ఉప్పల్ మల్లాపూర్ వార్డు కార్యాలయం వద్ద గురువారం 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నేటి నుంచి మరో 10 నుంచి 15 రోజులు విపరీతమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో HYD నగరంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరమైతే కానీ, బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని TSDPS తెలియజేసింది.

News April 26, 2024

గ్రాడ్యుయేట్ MLC ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్

image

వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ గురువారం రిలీజ్ అయింది. మే 2న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ, 10న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మే 13 గడువు కాగా పోలింగ్ మే 27న జరగనుంది. ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

News April 26, 2024

KU డిగ్రీ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం

image

KU డిగ్రీ (BA/B.Com/BBA/B.Sc/BCA/B.Voc/BHM & CT) రెండవ, నాల్గవ, అరవ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ తిరుమలా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.kakatiya.ac.inలో చూడవచ్చని అన్నారు.

News April 26, 2024

KMR: సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి: DSP

image

సైబర్ నేరాల పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని KMR DSP నాగేశ్వర రావు తెలిపారు. బస్వాపూర్‌లో సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని సూచించారు. గ్రామ రక్షక దళాలు అద్భుతంగా పనిచేయడం వల్ల నేరాలు నియంత్రణలో ఉన్నాయన్నారు. అందుకు సహకరిస్తున్న యువతను ఆయన అభినందించారు. బిక్కనూరు CI సంపత్ కుమార్, SI సాయికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

News April 26, 2024

MNCL: ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి: కలెక్టర్

image

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మే 13న జరిగే ఎన్నికల్లో అర్హత గల ప్రతి ఒక్కరు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్‌లో ఓటరు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దేశాభివృద్ధికి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారా మాత్రమే ఉంటుందని తెలిపారు.