Telangana

News April 25, 2024

NGKL: మల్లు రవి ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే..

image

NGKL పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు వెల్లడించారు. కుటుంబ ఆస్తుల విలువ రూ.52.32 కోట్లు, ఆయనకు 4.5 తులాల బంగారం, సతీమణికి 87.5 తులాల బంగారు ఆభరణాలు, 10 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఏపీలో మొత్తం 52.33 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్టు వెల్లడించారు. రూ.4.42 కోట్ల అప్పులు, 5 క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

News April 25, 2024

అతివేగంతోనే రోడ్డు ప్రమాదాలు: ఎస్పీ చందనా దీప్తి

image

అతి వేగం కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ చందనా దీప్తి అన్నారు. తమ ప్రాణాలే కాకుండా తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను, ఎదుటివారిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు. మద్యం తాగి, సెల్ ఫోన్ మాట్లాడుతూ, హెల్మెట్ లేకుండా, సీటు బెల్టు ధరించకుండా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.

News April 25, 2024

కరీంనగర్: బి ఫారం అందుకున్న వెలిచాల రాజేందర్ రావు

image

కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావుని అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ బి ఫారం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ప్రణవ్ బాబు పాల్గొన్నారు.

News April 25, 2024

మహబూబ్‌నగర్: ప్రతి పేపర్‌కు రూ.600

image

మహబూబ్‌నగర్: రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కోరుకునే ఇంటర్ విద్యార్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఇంటర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. మే 2 వరకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి పేపర్‌కు రూ.600 రుసుము చెల్లించాలని పేర్కొన్నారు.

News April 25, 2024

KMM: BRSఅభ్యర్థి నామా ఆస్తులు రూ.155 కోట్లు

image

ఖమ్మం BRS అభ్యర్థి నామానాగేశ్వరరావు కుటుంబానికి రూ.155.90కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తం ఆస్తిలో నామా పేరిట రూ.71.68 కోట్లు, భార్యచిన్నమ్మ పేరిట రూ.78.25కోట్లు, కుటుంబానికి రూ.5.96కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఇందులో నామా పేరిట 45.42 ఎకరాలు ఆయన సతీమణి పేరు మీద 25.04 ఎకరాలు కుటుంబ ఆస్తిలో 27.35 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. నామా పై 2 కేసులు ఉన్నాయి.

News April 25, 2024

మాచారెడ్డి: మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్య

image

ఉరేసుకొని ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… అంజయ్య (58) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. తన కొడుకు ఇటీవల హనుమాన్ మాల ధరించాడు. అతను కూడా మాల ధరిస్తానని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు నిరాకరించడంతో మనస్తాపం చెంది తన వ్యవసాయం క్షేత్రంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

News April 25, 2024

ఆదిలాబాద్: బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆస్తులు ఇవే

image

ADB బీజేపి అభ్యర్థి గోడం నగేశ్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇందులో ఆయన ఆస్తి వివరాలు ఇలా ఉన్నాయి. కుటుంబ ఆస్తుల విలువ రూ. 3.09 కోట్లుగా ఉంది. ఆయన పేరిట స్విఫ్ట్ కారు, కుటుంబానికి 33 తులాల బంగారు ఆభరణాలు, ADBలో 32.08 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సికింద్రాబాద్, ఆదిలాబాద్, జాతరాల్లో నివాస గృహాలతో కలిపి స్థిరాస్తుల విలువ రూ.2.58 కోట్లుగా ఉంది. రూ. 29.01 లక్షల అప్పులున్నాయి.

News April 25, 2024

HYD: వర్షాకాలం కోసం 166 అత్యవసర బృందాలు

image

HYD నగరంలో వర్షాకాలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు 166 అత్యవసర బృందాలను రంగంలోకి దింపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో 64 మొబైల్, 104 మినీ మొబైల్ బృందాలు ఉండగా, 160 స్టాటిక్ లేబర్స్ టీమ్స్ ఉంటాయి.మొబైల్, మినీ మొబైల్ ఎమర్జెన్సీ టీముల్లో షిఫ్టుల వారీగా ప్రతి టీంలో నలుగురు కార్మికులు ఉంటారు. వివిధ సాధనాలతో నీటిని తొలగించడం లాంటి పనులు నిర్వహిస్తారు.

News April 25, 2024

కరీంనగర్: పెళ్లైన మరుసటి రోజు రోడ్డు ప్రమాదం.. నవ వధువు మృతి

image

రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి చెందిన ఘటన కరీంనగర్‌‌లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన స్వాతికి ఆదివారం వివాహం జరిగింది. సోమవారం వేములవాడకు వెళ్తున్న క్రమంలో కరీంనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తలకి బలమైన గాయం కావడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 25, 2024

ఉమ్మడి జిల్లాలో వరంగల్ లాస్ట్

image

ఇంటర్ ఫలితాల్లో వరంగల్ జిల్లా వెనకబడింది. ఫస్టియర్ ఫలితాల్లో 24వ స్థానం సాధించగా.. సెకండియర్ ఫలితాల్లో 26వ స్థానంలో నిలిచింది. సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా 82.95 శాతంతో తొలి స్థానంలో, ఫస్టియర్ ఫలితాల్లో 70.01శాతంతో 3వ స్థానంలో నిలిచింది. కాగా, WGL 2021-22లో రాష్ట్రంలో ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో 25వ స్థానంలో నిలవగా.. 2022-23లో ఫస్టియర్‌లో 27వ స్థానం, సెకండియర్ ఫలితాల్లో 33వ స్థానంలో నిలిచింది.