Telangana

News September 6, 2024

మట్టి విగ్రహాల వాడకంతో కుల వృత్తులకు మేలు: మంత్రి పొన్నం

image

హైదరాబాద్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘మట్టి విగ్రహం మహా విగ్రహం మట్టి వినాయక పంపిణీ’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అందరి జీవితాల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా శుభం కలిగేలా ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని అన్నారు. మట్టి విగ్రహాలు వాడడం వల్ల కుల వృత్తులు బాగుపడతాయని అన్నారు.

News September 6, 2024

జిట్టా బాలకృష్ణారెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..

image

జిట్టా బాలకృష్ణారెడ్డి టీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2009లో భువనగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత జగన్ నాయకత్వంలో వైసీపీలో చేరారు. కొంతకాలానికి సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఇటీవలే దాన్ని బీజేపీలో విలీనం చేశారు. కొన్ని రోజులకు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

News September 6, 2024

HYD: వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి

image

గణేష్ ఉత్సవాల్లో భాగంగా మండపాలు ఏర్పాటు చేయాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. https://policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మండపం ఏర్పాటు, విగ్రహం ఎత్తు, ప్రాంతం, ఊరేగింపు, నిమజ్జనం తదితర వివరాలన్నీ నమోదు చేయాలని సూచించారు.

News September 6, 2024

పాలమూరు ప్రాజెక్టును పడవ పెడతారా: నిరంజన్ రెడ్డి

image

అధికారం దక్కిన వెంటనే పాత టెండర్లను రద్దు చేసి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొని CM రేవంత్ రెడ్డి 9నెలల పాలనలో ప్రాజెక్టును కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. పెండింగ్ పనులను వెంటనే చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

News September 6, 2024

జగిత్యాలలో అంగన్వాడీ కేంద్రాల వివరాలు

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జగిత్యాల, ధర్మపురి, మెట్‌పల్లి, మల్యాలలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1,065 అంగన్వాడీ కేంద్రాలుండగా ఇందులో 1,037 మెయిన్ కేంద్రాలు, 28 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో సుమారు 14,086 మంది గర్భిణులు, బాలింతలు, 34,897 మంది 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సులోపు చిన్నారులు, 15,907 మంది 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులు ఉన్నారు.

News September 6, 2024

జిట్టా కోరిక ఇదే..

image

తన ఫామ్ హౌస్‌లోనే కన్నుమూయాలనేదే జిట్టా బాలకృష్ణారెడ్డి చివరి కోరిక అని ఆయన సన్నిహితులు తెలిపారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి వెంటిలేటర్ మీద ఉంచి భువనగిరికి తరలిస్తున్నట్లు సమాచారం. కాగా జిట్టా మృతికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిట్టా అంత్యక్రియలు జరగనున్నాయి.

News September 6, 2024

కాళోజీ కళాక్షేత్రం అద్భుతంగా నిర్మించుకున్నాం: కేటీఆర్

image

HNK: పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి నారాయణరావు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. KCR ప్రభుత్వంలో ఆయన జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించుకున్నాం అని, హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రం అద్భుతంగా నిర్మించుకున్నామని, సెప్టెంబర్ 9న ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నామని పలు ఫోటోలను కేటీఆర్ ట్వీట్ చేశారు.

News September 6, 2024

HYD: ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురు

image

కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల కుదింపు, పెంపు వ్యవహారంలో ఇంజినీరింగ్ కాలేజీలకు గురువారం హైకోర్టులో చుక్కెదురైంది. ఇప్పటికే అడ్మిషన్ల షెడ్యూలు పూర్తైనందువల్ల.. జేఎన్టీయూ, ఏఐసీటీఈ అనుమతించిన సీట్లకు కౌన్సెలింగ్‌కు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అనుబంధ పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 6, 2024

పాలమూరు: NH-44పై పెరుగుతున్న ప్రమాదాలు !

image

ఉమ్మడి పాలమూరులో గుండా వెళ్తున్న 44వ జాతీయ రహదారి దేశంలోనే ప్రత్యేకమైంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్‌లో ప్రారంభమై.. తమిళనాడులోని కన్యాకుమారిలో ముగిస్తుంది. అయితే ఉమ్మడి జిల్లాలో బాలనగర్ నుంచి అలంపూర్ చౌరస్తా ఉన్న జాతీయ రహదారిలో ప్రతి ఏడాది ప్రమాదాలు పెరుగుతున్నాయి. గత ఏడాది 85 ప్రమాదాలు జరిగ్గా.. 35 మంది చనిపోయారు. 463 మంది తీవ్రంగా గాయాలయ్యాయి. ఏడాది ఇప్పటికే 10 మందిపైగా చనిపోయారు.

News September 6, 2024

MDK: విషాదం.. బ్యాంకు స్లిప్పే సూసైడ్ లెటర్..!

image

HYD మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలో ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామ <<14033756>>రైతు సురేందర్ రెడ్డి<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆత్మహత్యకు గల కారణాలను ఆయన SBI బ్యాంకుకు సంబంధించిన స్లిప్పుపై రాశాడు. ‘చిట్టాపూర్ బ్యాంకులో రుణమాఫీ కాలేదు, నా చావుకు కారణం మా అమ్మ.. చిట్టాపూర్ బ్యాంకు’ అని రాసి ఉరేసుకుని చనిపోయాడు.