India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎడపల్లి సాటాపూర్ గేటు సమీపంలోని ఆడి చెరువులో సోమవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు వెల్లడించారు. మృతుడి వయసు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండవచ్చన్నారు. తెల్లటి చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించినట్లు పేర్కొన్నారు. అతడిని గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
చేవెళ్ల BRS అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అఫిడవిట్‌లో పొందుపరిచిన ఆస్తుల వివరాలు.. జ్ఞానేశ్వర్ కుటుంబానికి రూ.228.47 కోట్ల ఆస్తులున్నాయి. బ్యాంకు డిపాజిట్లతో పాటు పలు సంస్థల్లో షేర్లు ఉన్నాయి. సొంతంగా వాహనాలు లేకపోగా.. ఆయన భార్యకు 4 కార్లు ఉన్నాయి. వీరి చరాస్తుల విలువ రూ.15.12 కోట్లు ఉండగా.. స్థిరాస్తులు రూ.213.35 కోట్లు ఉన్నాయి. రూ.30 లక్షల అప్పు ఉంది.
చేవెళ్ల BRS అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అఫిడవిట్‌లో పొందుపరిచిన ఆస్తుల వివరాలు.. జ్ఞానేశ్వర్ కుటుంబానికి రూ.228.47 కోట్ల ఆస్తులున్నాయి. బ్యాంకు డిపాజిట్లతో పాటు పలు సంస్థల్లో షేర్లు ఉన్నాయి. సొంతంగా వాహనాలు లేకపోగా.. ఆయన భార్యకు 4 కార్లు ఉన్నాయి. వీరి చరాస్తుల విలువ రూ.15.12 కోట్లు ఉండగా.. స్థిరాస్తులు రూ.213.35 కోట్లు ఉన్నాయి. రూ.30 లక్షల అప్పు ఉంది.
నల్లమలలో జరిగే సలేశ్వరం జాతరలో భక్తులను వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాల్లో లీటర్ మంచినీళ్ల బాటిల్ రూ.50, ఒక కొబ్బరికాయ రూ.100కు విక్రయిస్తున్నట్లు భక్తులు తెలిపారు. లింగమయ్య ప్రసాదంగా భావించే 3 లడ్డూలను రూ.100కు విక్రయించారు. దీంతో భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అటూ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులు పల్లాయిపల్లి వరకే వెళ్తున్నాయి.
తెలంగాణ అమరనాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం లింగమయ్య జాతరకు తొలిరోజు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. రాత్రి సమయంలో భక్తులను అనుమతి లేకపోవడంతో లింగమయ్యను దర్శించుకొనేందుకు పగలే బారులు తీరారు. ఎండ తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడ్డారు. చెంచు పూజారులు లింగమయ్యకు గిరిజన సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. ఇరుకైన కొండ, కోనల్లో నడక సాగిస్తూ సలేశ్వరం జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు.
ఖమ్మం రాజకీయాలు తనకు స్పష్టంగా తెలుసని.. హైకమాండ్ ఆదేశిస్తే తప్పకుండా బరిలో ఉంటానని ఎంపీ రేణుకా చౌదరి స్పష్టం చేశారు. సోమవారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. తాను ఖమ్మంలో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నానని తెలిపారు. రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ లోక్ సభకు పోటీ చేయమంటే చేస్తానని క్లారిటీ ఇచ్చారు.
NLG బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన కుటుంబ ఆస్తులు రూ.31,33,55,479గా ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో చూపించారు. అదేవిధంగా రూ.6,10,9131 అప్పులు.. తన చేతిలో రూ.45వేల నగదు ఉన్నట్లు చెప్పారు. HYD బంజారాహిల్స్ DCCBలో రూ.7,97,650, యూనియన్ బ్యాంకులో రూ.3,60,940, SBIలో రూ.18,17,072, ICICIలో రూ.10లక్షల డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే కెనడాలో రెండు ఇళ్లు ఉన్నాయని తెలిపారు.
వనపర్తి: పాలీసెట్-2024 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే తేదీ పొడిగించబడిందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈనెల 28 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని అన్నారు. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు రూ.300 అపరాధ రుసుముతో వచ్చే నెల 20 వరకు ఫీజు చెల్లించవచ్చని అన్నారు. ప్రవేశ పరీక్ష వచ్చే నెల 24వ తేదీన ఉంటుందని తెలిపారు.
బుధవారం నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించినట్లు నల్లగొండ డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలవు రోజుల్లో జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా తరగతులు నిర్వహిస్తే ఆయా పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు.. మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన శివకుమార్(23) గ్రూప్, ఇతర పోటీ పరీక్షలు రాశాడు. ఈ క్రమంలో తోటివారికి ఉద్యోగాలు వచ్చి తనకు రాకపోవడంతో మనస్తాపం చెందాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తల్లి వరలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు.
Sorry, no posts matched your criteria.