India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో అనేక సమస్యలపై తమ వంతుగా కృషి చేశానని వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. కొన్ని రాజకీయ పరిణామాలతో తనకు గుర్తింపు లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు. సోమవారం వైరాలో ఆయన సంబంధించిన వర్గీయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని అనేకమంది నాయకులు ప్రజాప్రతినిధులు రాములు నాయక్ మద్దతుగా నిలిచారు.
పిడుగుపాటులో మహిళ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మాసాన్‌పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్వ రేణుక(32) ఊరి శివారులో మేకలు మేపుతుంది. సాయంత్రం ఉరుములు,మెరుపులతో వర్షం పడటంతో రేణుక మరో ఇద్దరు ఓ చెట్టుకుందికి వెళ్లారు. ఈ క్రమంలో పిడుగుపాటు పడి రేణుక అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాల్యయి. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
√NGKL,NRPT జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. అలంపూర్లో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలు.
√NGKL:నేడు అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశం.
√MBNR: నేడు కవి సమ్మేళనం.
√ కోస్గి: నేడు వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం.
√ ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో నేడు కేంద్ర బలగాల కవాతు.
√ ఐజ: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం.
√ ధరూర్: నేడు కమ్యూనిటీ అవేర్నెస్ కార్యక్రమం.
✓పలు శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓మణుగూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
✓నేలకొండపల్లిలో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
✓భద్రాద్రి జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
✓కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకొని గర్భవతిని చేసిన యువకుడిపై పోలీసులు సోమవారం పోక్సో కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన మణికంఠ (21) ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యాక పెళ్లికి నిరాకరించాడు. బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మణికంఠను అదుపులోకి తీసుకున్నారు.
బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకొని గర్భవతిని చేసిన యువకుడిపై పోలీసులు సోమవారం పోక్సో కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన మణికంఠ (21) ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యాక పెళ్లికి నిరాకరించాడు. బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మణికంఠను అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతిచెందాడు. బాధితుల ప్రకారం.. కోరుట్ల మున్సిపల్ పరిధిలోని ఏఖీన్‌పూర్‌కు చెందిన మనీశ్(25) HYDలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 6 రోజుల క్రితం కంపెనీ ప్రాజెక్టు పనిమీద పుదుచ్చేరి వెళ్లొస్తుండగా.. మార్గమధ్యలో డిండివనం వద్ద ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మనీశ్‌తో పాటు HYDకి చెందిన మరో మహిళా ఉద్యోగి మృతి చెందింది.
వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య సోమవారం నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అఫిడవిట్‌లో పొందుపర్చిన ఆస్తుల వివరాలు.. కావ్యకు రూ.1.55 కోట్ల ఆస్తులు ఉండగా.. సొంతంగా ఇళ్లు, వ్యవసాయ భూములు లేవు. ఆమెతో పాటు తన భర్త మహ్మద్ నజీరుల్లా షేక్ వద్ద రూ.1.15 లక్షల నగదు ఉంది. ఇన్నోవా క్రిస్టా, రాయల్ ఎన్‌ఫీల్డ్, హోండా యాక్టివా ఉన్నాయి. ఇరువురి వద్ద 27 తులాలు, పిల్లల నేరిట 8 తులాల బంగారం ఉంది.
సూర్యాపేట జిల్లా మునగాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పశువులు అడ్డురావడంతో అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. ప్రమాద సమయంలో 30 ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిన్న కూడా మునగాల వద్ద కారు కంటైనర్ కిందకి దూసుకెళ్లిన విషయం తెలీసిందే.
‘జీవవైవిధ్య పరిరక్షణలో ఇటీవలి పురోగతులు, స్థిరత్వం’ అనే అంశంపై ఈ నెల 23న ఉదయం 10గంటలకు పీయూ వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అకాడమిక్ భవనంలో ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు జాతీయ సదస్సు కన్వీనర్, బాటనీ విభాగాధిపతి పుష్పలత తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఉప కులపతి లక్ష్మీకాంత్ రాథోడ్, విశిష్ట అతిథిగా ఇన్ ఛార్జి రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి తదితరులు హాజరవుతారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.