Telangana

News April 24, 2024

MBNR: నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగనుందిలా

image

CM రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి జిల్లా పర్యటన ఖరారయింది. ఉదయం 11 గంటలకు నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లురవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నారాయణపేట జిల్లా మద్దూరులో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, మధ్యాహ్నం 1 గంటలకు తిమ్మారెడ్డిపల్లి బావోజీ జాతరకు హాజరవుతారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు బిజినేపల్లిలో నిర్వహించే బహిరంగసభ కార్యక్రమంలో పాల్గొంటారు.

News April 24, 2024

HYD: NIMSలో రోబో సహాయంతో ట్రీట్మెంట్

image

పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో రోబో సహాయంతో ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోబో చికిత్సల కోసం రూ.2-6 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ, నిమ్స్ ఆసుపత్రిలో 40 శాతం తక్కువకే ఈ సేవలు అందిస్తున్నారు. ఇక ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT

News April 24, 2024

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేయాలి:కలెక్టర్‌

image

వేసవి సెలవులు ముగిసేలోగా జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా ఎన్నికైన అన్ని పాఠశాలల్లో మరమ్మతు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల విధానంపై సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 643 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మంజూరైన పనులను మే నెల ఆఖరుకల్లా పూర్తి చేయాలని సూచించారు.

News April 24, 2024

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

√NGKL:సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు.
√ దామరగిద్ద: పేదలకు సంక్షేమ ఫలాలు అందాలంటే బిజెపిని గెలిపించాలి: డీకే అరుణ.
√ మద్దూర్: నేడు అట్టహాసంగా ప్రారంభమైన బావోజీ జాతర.. రేపు సీఎం రాక.
√ గద్వాల్:రూ. 7,65,600 నగదు పట్టివేత:ఎస్పీ.
√MBNR,NGKL పరిధిలో కొనసాగుతున్న ఎంపీ అభ్యర్థుల ప్రచారం.
√NRPT:పోలీసు ప్రజావాణికి 8 ఫిర్యాదులు.
√ ఉమ్మడి జిల్లాలో నేడు రికార్డు స్థాయిలో ఎండలు.

News April 24, 2024

నేడు నిజామాబాద్ పార్లమెంట్‌కు 12 నామినేషన్లు

image

నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో సోమవారం 12 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు మళ్లీ ఒకటి, రెండు సెట్‌ల చొప్పున నామినేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. కాగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం 28 నామినేషన్లు దాఖలు అయినట్లు వెల్లడించారు.

News April 24, 2024

కరీంనగర్ పార్లమెంటుకు నేడు 13 మంది నామినేషన్లు

image

కరీంనగర్ పార్లమెంటుకు సోమవారం13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరపున వెలిచాల రాజేందర్ రావు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అనిల్ కుమార్, ఇండిపెండెంట్లుగా జింక శ్రీనివాస్, గట్టయ్య, శ్రీనివాస్, రాజు, లక్ష్మి, బుచ్చిరెడ్డి, జిశాన్, ఆధార్ పార్టీ తరపున అరుణ, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున రానా ప్రతాప్, ధర్మ సమాజ్ పార్టీ తరపున శ్రీకాంత్, సిపిఐ తరపున శ్రీనివాస్ రెడ్డి నామినేషన్లు వేశారు.

News April 24, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

➤వీర్నపల్లి: గొంతు కోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం
➤పెద్దపల్లి: ఈత చెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి గాయాలు
➤ మెట్ పల్లిలో వైభవంగా వీర హనుమాన్ విజయ యాత్ర
➤కొండగట్టులో ఏర్పాట్లను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్
➤కోరుట్లలో వృద్ధురాలి మెడలో చైన్ లాక్కెళ్ళిన దుండగులు
➤మెట్పల్లిలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్
➤జమ్మికుంటలో 15 లక్షల నగదు సీజ్

News April 24, 2024

వరంగల్: ఎన్నికల కోడ్.. తప్పుడు పోస్ట్‌లు పెడితే జైలుకే

image

పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సోషల్ మీడియాపై నిఘా పెంచారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సోషల్ మీడియా వేదికగా జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు గుర్తించి, సుమోటోగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు పెడితే చర్యలు తీసుకుంటామని పోలిసులు హెచ్చరిస్తున్నారు.

News April 24, 2024

దౌల్తాబాద్: పోక్సో కేసులో పదేళ్ల జైలు

image

బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సిద్దిపేట 2వ సెషన్స్ జడ్జీ తీర్పును ఇచ్చారని సీపీ అనురాధ తెలిపారు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లికి చెందిన టి.శ్రీకాంత్(20) అక్టోబర్ 19, 2021న ఓ పౌల్ట్రీఫాంలో పనిచేస్తున్న బాలిక(15)ను కిడ్నాప్ చేసి మానభంగానికి పాల్పడ్డారు. ఈ విషయమై విచారణ జరిపిన జడ్జీ నిందితుడికి జైలుశిక్ష విధించారు.

News April 24, 2024

కోరుట్ల: వాకింగ్‌కు వెళ్తే గోల్డ్ చైన్ లాగేశారు

image

కోరుట్ల పట్టణంలో గొలుసు దొంగలు బరితెగించారు. ముఖానికి ముసుగు వేసుకున్న దుండగులు పట్టణంలోని వెంకట సాయి నగర్ కాలనీకి చెందిన ఓ వృద్ధురాలు కాలనీలో సోమవారం సాయంత్రం వాకింగ్ చేస్తుండగా మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. వృద్ధురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.