India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరం వేగంగా విస్తరిస్తున్నట్లుగానే ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి ప్రస్తుతం జరగనున్న ఎన్నికల వరకు సుమారు 15 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం గ్రేటర్ HYD, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఓటర్ల సంఖ్య 1.05 కోట్లు దాటింది. మొత్తం తెలంగాణ ఓటర్లలో ఇది 30% ఉంటుందని అధికారుల అంచనా.
BRS హయాంలో పాలమూరు నేలకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బిజినేపల్లి కాంగ్రెస్ సభలో రేవంత్ మాట్లాడుతూ.. ‘దేశానికే ఆదర్శవంతమైన నేతలను ఇచ్చిన గడ్డ మన పాలమూరు. 70ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇక్కడి బిడ్డకు దక్కింది. గతంలో కరీంనగర్‌లో ఓటమి భయంతోనే KCR పాలమూరు MPగా పోటీ చేశారు. KCRకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే RS ప్రవీణ్ కాంగ్రెస్‌లోకి వస్తే ప్రభుత్వం డీజీపీగా నియమించేది’ అని అన్నారు.
HYD నగరం వేగంగా విస్తరిస్తున్నట్లుగానే ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి ప్రస్తుతం జరగనున్న ఎన్నికల వరకు సుమారు 15 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం గ్రేటర్ HYD, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఓటర్ల సంఖ్య 1.05 కోట్లు దాటింది. మొత్తం తెలంగాణ ఓటర్లలో ఇది 30% ఉంటుందని అధికారుల అంచనా.
జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ నేడు నామినేషన్ వేయనున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి.. జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారి వల్లూరి క్రాంతికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నట్లు ఆయన వివరించారు.
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మార్పుపై మాజీ సీఎం KCR తొలిసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కడియం శ్రీహరి వెళ్లడం వల్ల మాకు లాభం జరిగిందని, వరంగల్‌లో కడియం శ్రీహరి చచ్చి, బీఆర్ఎస్ పార్టీని బతికించాడని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూడండి.. ఫలితాలు కనిపిస్తాయని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఆత్రం సుగుణక్క ‘బి’ ఫామ్‌ను తనయుడు ఆత్రం సాయుధ మంగళవారం గాంధీభవన్ లో అందుకున్నారు. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పార్టీ టికెట్టును ఆత్రం సాయుధకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు సత్తు మల్లేష్, నరేందర్ తదితరులున్నారు.
నర్వ మండలం కొత్తపల్లికి చెందిన మేకల రాజు తన భార్య సురేఖను హత్య చేసిన కేసులో జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ మంగళవారం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. భార్యపై అనుమానంతో 2015 మార్చి 12న భార్యకు నిప్పంటించి హత్య చేసేందుకు యత్నించగా, కాలిన గాయాలతో చికిత్స పొందుతూ 45 రోజుల తరువాత మృతి చెందిందని, నేరం నిరూపణ కావడంతో 10 ఏళ్ల జైలు 20 వేలు జరిమానా విధించారని చెప్పారు.
GHMC పరిధి ప్రజలకు ముఖ్య గమనిక. ప్రతి ఇళ్లు, అపార్ట్‌మెంట్ ముందు పైపుతో కడగొద్దు. బకెట్‌తో నీరు తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఎవరి ఇంటి ముందు నుంచి నీరు వరద మాదిరిగా బయటకి రావొద్దు. ఆ విధంగా వచ్చినా, నీటి వృథా చేసినా GHMC/మున్సిపల్ వారు ఆ ఇంటికి రూ.5వేల జరిమానా వేస్తారు. ఎవరికి తెలియకుండానే ఉదయం ఫొటో తీయడం జరుగుతుందని హెచ్చరించారు. నీటిని ఆదా చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

మెదక్ పార్లమెంట్ అభ్యర్థి బీఫారాన్ని ఎఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి చేతుల మీదుగా నీలం మధు అందుకున్నారు. ఎంపిగా గెలిచి రావాలని ఈ సందర్బంగా వారు ఆయనకు సూచించారు. వారితో ఈ కార్యక్రమంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు, మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ప్రధాన సలహాదారులు హరగోపాల్ ఉన్నారు.
Sorry, no posts matched your criteria.