India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్ తెలిపారు. స్వీప్ కార్యాచరణలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల సమాఖ్య సమావేశాలు ఏర్పాటు చేసి, మహిళా సభ్యులకు ఓటు హక్కు వినియోగం, నైతిక ఓటింగ్ పై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు పాల్గొన్నారు.
విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎవరైనా మానసిక ఆందోళనలు లేదా మానసిక ఒత్తిడికి గురి అయినప్పుడు మానసిక వైద్యుడిని సంప్రదించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత సూచించారు. చిరాకు పడడం, ఆసక్తిని కోల్పోవడం, నిద్రలేమి వంటి సమస్యలతో మానసిక ఒత్తిడికి గురి అయినట్లు భావిస్తే టెలి మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 ఫోన్ చేసి మానసిక వైద్యుడు సలహాలను సూచనలను ఉచితంగా పొందవచ్చునని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీ పథకాలలో భాగంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంలో ఇప్పటి వరకు 35 కోట్ల మంది ఆడబిడ్డలు లబ్ధి పొందాలని, సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల సమస్యలు పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు. 6 గ్యారంటీ పథకాలలో ఐదు గ్యారంటీ పథకాలు 100 రోజుల్లోనే పూర్తి చేశామని అన్నారు.
ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండలం బోడ్మట్ పల్లి గ్రామంలో జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌తో కలిసి గాలి అనిల్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా కోరారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సిర్పూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేట(ఖమ్మం)సెగ్మెంట్లలో ఉ.7 గంటల నుంచి సా.4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది.
నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ స్థానానికి మంగళవారం 16 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. వివిధ పార్టీల తరఫున అభ్యర్థులు, స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్‌లు వేసినట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు 26 మంది అభ్యర్థులు మొత్తం 44 నామినేషన్లు దాఖలు చేశారని కలెక్టర్ వెల్లడించారు.
ఎంటైర్ హైదరాబాద్ మాతో ఉందని మాజీ CM KCR అన్నారు. ఓ ఛానెల్ డిబేట్‌లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మిన పల్లె ప్రజలు ఆ పార్టీకి ఓటేశారని పేర్కొన్నారు. HYD మేథావులు BRS వైపే ఉన్నారని.. లోక్‌సభ ఎన్నికల్లో తాము గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. ఇప్పటికే సికింద్రాబాద్‌లో గెలిచేశామని, ఎందుకంటే అక్కడ నిలబడ్డది టి.పద్మారావు అని భరోసా వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డికి ఓటమి తప్పదన్నారు.
ఎంటైర్ హైదరాబాద్ మాతో ఉందని మాజీ CM KCR అన్నారు. ఓ ఛానెల్ డిబేట్‌లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మిన పల్లె ప్రజలు ఆ పార్టీకి ఓటేశారని పేర్కొన్నారు. HYD మేథావులు BRS వైపే ఉన్నారని.. లోక్‌సభ ఎన్నికల్లో తాము గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. ఇప్పటికే సికింద్రాబాద్‌లో గెలిచేశామని, ఎందుకంటే అక్కడ నిలబడ్డది టి.పద్మారావు అని భరోసా వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డికి ఓటమి తప్పదన్నారు.
> బంజారాహిల్స్ నందినగర్‌లో శిశువు మృతదేహం లభ్యం
> నగరంలో వైభవంగా సాగిన హనుమాన్ శోభాయాత్ర
> బహదూర్ పల్లిలో మెకానిక్ షెడ్‌లో అగ్నిప్రమాదం
> మెడికల్ షాప్స్‌పై ఔషధ నియంత్రణ సంస్థ అధికారుల దాడి
> ఉప్పల్ చెరువు కట్టపై రోడ్డు ప్రమాదం.. ఓ వ్యక్తి మృతి
> నగరంలో జోరుగా ఎన్నికల ప్రచారం
> బాలికను గర్భవతిని చేసిన యువకుడు అరెస్టు
15 ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థానానికి మొత్తం మంగళవారం ఏడుగురు నామినేషన్ వేశారని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మొత్తం 9 సెట్ల నామినేషన్ దాఖలు అయ్యాయని అన్నారు. వీరిలో పోగుల అశోక్ (IND) ఒక సెట్ నామినేషన్, మచ్చ దేవేందర్ (VCKP) 2 సెట్ల నామినేషన్, కుమ్మరి కన్నయ్య (IND) ఒక సెట్ నామినేషన్, కొంగర అనిల్ కుమార్ (IND) ఒక సెట్ నామినేషన్, చిలుముళ్ళ సుజాత (IND) ఒక సెట్ నామినేషన్ వేసారన్నారు.
Sorry, no posts matched your criteria.