Telangana

News April 25, 2024

ఉట్నూర్: బైక్‌పై నుంచి పడి మహిళ మృతి 

image

బైక్‌పై నుంచి కిందపడి మహిళ మృతి చెందిన ఘటన ఉట్నూర్‌లోని పులిమడుగులో చోటుచేసుకుంది. బైక్‌పై ఇంద్రవెల్లి వైపు వెళ్తుండగా ఆందోలి క్రాస్ వద్ద బైక్ అదుపు తప్పి పడిపోయింది. దీంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన మరో వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News April 25, 2024

మే 4న నారాయణపేటకు ప్రధాని మోదీ

image

నారాయణపేట: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 30, మే 3, 4 తేదీల్లో ఆయన పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మే 4న నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల్లో నిర్వహించే సభల్లో ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నాగర్ కర్నూల్ రాగా, 2వ సారి నారాయణపేటకు రానున్నారు.

News April 25, 2024

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రాయల నామినేషన్

image

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను రాయల తరఫున కాంగ్రెస్ నాయకులు రిటర్నింగ్ అధికారికి అందించారు. కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు పాల్గొన్నారు.

News April 25, 2024

ఇంటర్ ఫలితాలు.. మెదక్ విద్యార్థికి 470కి 468 మార్కులు

image

మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామానికి చెందిన గౌడిచర్ల ప్రియాన్ష్ కుమార్ రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాడు. తాజాగా విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ పరీక్ష ఫలితాల్లో ప్రియాన్ష్ ఎంపీసీలో 470కి గానూ 468 మార్కులు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువుల నుంచి అభినందనలు తెలిపారు.

News April 25, 2024

ఇంటర్ ఫలితాల్లో అచ్చంపేట GOVT కాలేజ్ విద్యార్థిని సత్తా

image

అచ్చంపేట మండల కేంద్రానికి చెందిన పిట్టల స్నేహిత ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో ఎంపీసీ చేసిన స్నేహిత ఫస్టియర్‌లో 470 మార్కులకు 466 సాధించింది. రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థినిని అధ్యాపకులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

News April 25, 2024

HYD: గృహ జ్యోతి పథకంపై BIG UPDATE

image

HYD నగరం సహా అనేక చోట్ల 30 రోజుల తర్వాత కరెంటు బిల్లు జనరేట్ చేయడం ద్వారా 200 యూనిట్లకు ఎక్కువగా వచ్చి గృహజ్యోతి పథకాన్ని పొందలేకపోతున్నామని పలువురు వాపోయారు. దీని పై స్పందించిన TSSPDCL అధికారులు, గృహ జ్యోతి పథకానికి కరెంటు బిల్లింగ్ తేదీతో సంబంధం లేదని, నెలసరి సగటు యూనిట్లకే (RED BOX) పథకం లెక్కించబడుతుందని తెలిపింది.కాగా ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్న సంగతి తెలిసిందే.

News April 25, 2024

HYD: గృహ జ్యోతి పథకంపై BIG UPDATE

image

HYD నగరం సహా అనేక చోట్ల 30 రోజుల తర్వాత కరెంటు బిల్లు జనరేట్ చేయడం ద్వారా 200 యూనిట్లకు ఎక్కువగా వచ్చి గృహజ్యోతి పథకాన్ని పొందలేకపోతున్నామని పలువురు వాపోయారు. దీని పై స్పందించిన TSSPDCL అధికారులు, గృహ జ్యోతి పథకానికి కరెంటు బిల్లింగ్ తేదీతో సంబంధం లేదని, నెలసరి సగటు యూనిట్లకే (RED BOX) పథకం లెక్కించబడుతుందని తెలిపింది.కాగా ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్న సంగతి తెలిసిందే.

News April 25, 2024

రాజారాం గ్రామంలో యువకుడి మృతదేహం కలకలం

image

యువకుడిని తీవ్రంగా కొట్టి హత్య చేసి నిప్పు పెట్టిన ఘటనా మల్యాల మండలం రాజారాంలో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం రాజారాం శివారులో సగం కాలిన యువకుడి మృతదేహం ఉన్నట్లు గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో భార్య జమున మృతదేహాన్ని గుర్తించి తన భర్త మహిపాల్‌దేనని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2024

ఎల్లారెడ్డిపేట: మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి పై కేసు నమోదు

image

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అమాయక ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడటంతో అతనిపై కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గ్రామానికి చెందిన దీకొండ సునీల్ అనే వ్యక్తి యూనిక్ ఎస్ఎంసిఎస్ అనే సంస్థ పేరుతో 800 మంది వద్ద డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు. బాధితులు ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని తెలిపారు.

News April 25, 2024

కొండగట్టు కాషాయమయం.. భారీగా చేరుకున్న భక్తజనం

image

కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి కొండగట్టుకు దీక్షాపరులు, సాధారణ భక్తులు భారీగా చేరుకుంటున్నారు. మంగళవారం రాత్రి కొండపై ఇసుక వేస్తే రాలనంత రద్దీ నెలకొంది. రద్దీని కంట్రోల్ చేయడం కష్టమైంది. స్వామివారి దర్శనం, మాలవిరమణ, కళ్యాణకట్ట వద్ద గంటల సమయం పడుతోంది. ఇప్పటికి రెండు లక్షల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా.