India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్
సి.నారాయణరెడ్డి అన్నారు.
విధులలో సమయపాలన పాటించాలని, పనిలో నాణ్యత ఉండాలని అన్నారు. రెగ్యులర్ పనులతో పాటు, ప్రభుత్వ ప్రాధామ్య పథకాల అమలులో జాప్యం చేయవద్దని అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
కడెం ప్రాజెక్టు నుంచి 3380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా సోమవారం సా. 5 గంటలకు ప్రాజెక్టులో 691.22 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ప్రాజెక్టులోకి 4855 క్యూసెక్కుల నీరు వస్తోందని, దీంతో ఒక గేటు ఎత్తి ఎడమ కాలువకు 298, కుడి కాల్వకు 8, గోదావరిలోకి 2,997 క్యూసెక్కులు మొత్తం 3,380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణ విశ్వ విద్యాలయ పరిధిలో బీ.ఎడ్. నాల్గవ సెమిస్టరు, రెగ్యులర్ 1వ, 2వ, 3వ, 4వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు ఆగస్టు 1వ తేదీ లోపు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య.ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రూ.100 అపరాధ రుసుముతో 02-8-2024 వరకు చెల్లించవచ్చన్నారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్ సైట్‌లో పొందుపర్చినట్లు వివరించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్‌లో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు కల్కి సినిమా విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్, కల్కిలో ముఖ్యపాత్ర పోషించిన బుజ్జి కార్ రాబోతోందని తెలిపారు. గత నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి సినిమా భారీ విజయం సాధించిందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరారు.
మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 136 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. భూములకు సంబంధించి 36, పెన్షన్లకు సంబంధించి 8, డబుల్ బెడ్ రూమ్‌లకు సంబంధించి 18, రుణమాఫీకి సంబంధించి 7, ఇతర సమస్యలకు సంబంధించి 67 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరిని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కలిశారు. తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు.
జాతీయ రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. RRR నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా కంప్లీట్ చేసేందుకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి పెద్దవాగు ప్రాజెక్టు నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెగిపోయిన ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు. అధిక మొత్తంలో వరద రావడంతోనే ప్రాజెక్టు తెగిపోయిందని అన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ ఉన్నారు.
బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీ వాసులు వర్షాకాలం వచ్చిందంటే భయపడే పరిస్థితి నెలకొంది. సోమవారం ఓ మహిళకు విపరీతమైన జ్వరం రావడంతో స్థానికులు సుమారు 3 కిలోమీటర్ల మేర కాలినడకన తీసుకువెళ్లి ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాలు మారుతున్న సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆరోపించారు. కాగా సదరు మహిళను 108 వాహనంలో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.