India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో నిర్వహణలో HYDలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉందని ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. మూడు కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, మూడు బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. భద్రాద్రి కొత్తగూడెం, జక్రాన్ పల్లి నిజామాబాద్ జిల్లా, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్మించాల్సి ఉందని పేర్కొన్నారు.
పసుపులోడుతో పాటు లారీని దొంగిలించిన కేసులో నిందితుడైన నవీపేట్‌కు చెందిన షేక్ తోఫిక్ అలీ అలియాస్ షరీఫ్ (37) ను సోమవారం అరెస్టు చేసినట్లు నిజామాబాద్ వన్ టౌన్ SHO డి.విజయ్ బాబు తెలిపారు. నిందితుడి నుంచి రూ. 30 లక్షలపసుపును, రూ.40 లక్షల లారీని స్వాధీన పరుచుకుని మిగతా నేరస్థుల కోసం గాలిస్తున్నామని విజయ్ బాబు చెప్పారు.
HYD పాతబస్తీలోని హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయంలో నిర్వహించే బోనాల జాతర ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ సోమవారం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణను ఆలయ కమిటీ ప్రతినిధులు దత్తాత్రేయ, సతీశ్, రాజారత్నం కలిసి ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈనెల 18వ తేదీన ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభించామని తెలిపారు.

జైనథ్ మండలం డొల్లార వద్ద పెనుగంగా నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం గాలింపు చర్యలను చేపట్టారు. యువకుడి ఆచూకీ కోసం డీడీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. పెనుగంగా నది వద్ద విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన యువకుడు చాంద (టీ) కు చెందిన శివగా గుర్తించారు. గాలింపు చర్యలను ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. సీఐ సాయినాథ్ ఎస్సై పురుషోత్తం ఉన్నారు.
వర్షాలు, వరదల ప్రభావంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. మరో మూడు రోజులు వర్షాలు ఉన్నందున్న అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాద్రి జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాలని అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
గోదావరి వరదలపై సోమవారం భద్రాచలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండడంతో అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గోదావరి వద్ద ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని పేర్కొన్నారు.
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో ఓబీసీల సంక్షేమానికి రూ.లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం ఆయన లేఖ రాశారు. పది సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కేంద్రంలో ఓబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా, బడ్జెట్ కేటాయించకుండా అన్యాయం చేసిందన్నారు.

నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి సెప్టెంబర్ 15 వరకు ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. పనులన్నీ ఎప్పటికప్పుడు వేగవంతం చేయాలని సూచించారు. పనులపై నిర్లక్ష్యం చేయవద్దని పేర్కొన్నారు. కరీంనగర్‌లోని నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Sorry, no posts matched your criteria.