Telangana

News April 25, 2024

యాదాద్రి: బ్యాంక్ డబ్బు కాజేసి బెట్టింగ్

image

వలిగొండ SBIలో క్యాషియర్‌గా పని చేస్తున్న కాలేరు అనిల్ కుమార్‌పై ఆ బ్రాంచ్ మేనేజర్ జి.మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో ఉండాల్సిన రూ.15.50 లక్షలు లావాదేవీల్లో తక్కువగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సై మహేందర్ దర్యాప్తు చేపట్టి నిందితుడు అనిల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడు రూ.37.63 లక్షలను ఆన్లైన్ బెట్టింగ్ పెట్టినట్లు తెలిపారు.

News April 25, 2024

HYD: బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి

image

బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన బషీరాబాద్‌ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన బాలిక(16)పై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరేశ్(24) కన్నేశాడు. రోజూ బాలిక చదువుతున్న పాఠశాల వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వచ్చి మాటలు కలిపి ప్రేమ పేరుతో నమ్మించాడు. పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News April 25, 2024

సలేశ్వరం జాతర.. వెళ్లొస్తాం లింగమయ్యా… 

image

సలేశ్వరం ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. 3 రోజుల్లో సుమారు 2 లక్షల మంది భక్తులు లింగమయ్యను దర్శించుకున్నట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి రోజు వస్తున్నాం లింగమయ్యా.. వెళ్లొస్తాం లింగమయ్యా.. భక్తి పారవశ్యంతో తరలివచ్చారు. శివమామస్మరణాలతో నల్లమల మార్మోగింది. ఈ ఏడాది ఎండల తీవ్రతో భక్తుల రద్దీ తగ్గింది. ఉత్సవాలకు పోలీస్ శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. వర్షాలు లేకపోవడంతో ఊపీరి పీల్చుకున్నారు.

News April 25, 2024

జైనథ్: రూ. లక్ష నగదు పట్టివేత

image

జైనథ్ మండలంలోని పిప్పర్‌వాడ టోల్ ప్లాజా వద్ద అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద రూ. లక్ష నగదును పట్టుకున్నట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. వాహనాల తనిఖీ చేపడుతుండగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్న మహ్మద్ అస్లాం ఎలాంటి ఆధారాలు లేకుండా నగదును తీసుకువెళుతున్నాడు. అతడి నుంచి రూ. లక్ష నగదును సీజ్ చేసి జిల్లా గ్రీవెన్స్ టీంకు అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. 

News April 25, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

> కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి నామినేషన్
> పాల్వంచలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు > కుసుమంచిలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పర్యటన
> పార్లమెంటు ఎన్నికలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ రివ్యూ మీటింగ్
> నేటితో ముగియనున్న నామినేషన్ల దరఖాస్తు స్వీకరణ గడువు
> మధిరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాక

News April 25, 2024

భద్రాచలంలో అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. బుధవారం భద్రాచలంలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు. అలాగే దమ్మపేటలో అత్యల్పంగా 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలకు ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావోద్దని అధికారులు చెబుతున్నారు.

News April 25, 2024

ADB: రాష్ట్ర స్థాయిలో రాణించిన జిల్లా విద్యార్థిని

image

జిల్లా విద్యార్థి రాష్ట్రస్థాయిలో సత్తాచాటింది. ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన కొత్తూరి అరుణ ప్రసన్న కుమార్ దంపతుల కుమార్తె కొత్తూరి రేచల్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. దింతో పలువురు ఆమెను అభినందించారు. ఇదే స్పూర్తితో మున్ముందు మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.

News April 25, 2024

NZB: ఎన్నికల కోడ్.. భారీగా నగదు పట్టివేత!

image

ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో అక్రమ నగదు సరఫరాను అధికారులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో అధిక మొత్తంలో తరలిస్తున్న డబ్బును, మద్యం, ఇతర విలువైన వస్తువులను పట్టుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 53,42,830 నగదును పోలీసులు పట్టుకున్నారు.

News April 25, 2024

శంషాబాద్ విమానాశ్రయానికి నేరుగా ఆర్టీసీ బస్సులు

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ బస్సులు నేటి నుంచి రూట్ మారనున్నాయి. ప్రస్తుతం మెహిదీపట్నం నుంచి PVNR ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళ్లే బస్సులు ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్డు నుంచి రాకపోకలు సాగిస్తాయని మెహదీపట్నం డిపో మేనేజర్ మూర్తి తెలిపారు. ఈ పుష్పక్ బస్సు సౌకర్యం నేటి అర్ధరాత్రి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

News April 25, 2024

రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన బండలింగాపూర్ వాసి

image

మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన కూకట్ల వేణుగోపాల్, స్రవంతిల కూతురు కూకట్ల వైష్ణవి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి సత్తా చాటింది. 440 మార్కులకు గానూ ఆమె 438 మార్కులు సాధించింది. అలాగే మెట్‌పల్లికి చెందిన ముక్క మృత్యుంజయ్, సంధ్యారాణిల కూతురు ముక్క హర్షిని ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి సత్తా చాటింది. వారిని పలువురు అభినందించారు.