India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేధింపులకు గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన GDKలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. సీతానగర్‌కు చెందిన చందా ప్రసాద్ తన మిత్రుడు సతీశ్‌కు సింగరేణి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.3 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం లేక, డబ్బులు ఇవ్వకపోవడంతో సతీశ్ కుటుంబ సభ్యులు ప్రసాద్ పై వేధింపులకు గురి చేశారు. దీంతో మనస్తాపం చెందిన ప్రసాద్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనే మనస్తాపంతో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా రెడ్యాలకు చెందిన యశస్విని ఫస్టియర్ ఎకనామిక్స్ ఫెయిల్ కావడంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా, డోర్నకల్ మండలానికి చెందిన భార్గవి ఫస్టియర్ బోటనీలో ఫెయిల్ కావడంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
కోదాడలో జరిగిన <<13118139>>యాక్సిడెంట్‌లో<<>> ఆరుగురు చనిపోయన విషయం తెలిసిందే. కోదాడ మం. చిమ్మిరాల వాసి శ్రీకాంత్ HYDలో కార్ డ్రైవర్. విజయవాడలో కూతురు లాస్య చెవులు కుట్టించేందుకు బంధువులతో కలిసి కారులో వెళ్తుండగా కోదాడ శివారులో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.. దీంతో శ్రీకాంత్, కుమార్తె లాస్య, బంధువులు మాణిక్యమ్మ, చందర్రావు, కృష్ణరాజు, స్వర్ణ చనిపోగా భార్య నాగమణి, మరో కుమార్తె లావణ్య, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు.
ఇంటర్మీడియట్ సాధారణ ఫలితాల్లో దిగువ నుంచి రెండో స్థానంలో ఉన్న నారాయణపేట జిల్లా వృత్తి విద్య ఫలితాల్లో మాత్రం రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దామరగిద్ద, ఉట్కూరు మండలాల్లోని కేజీబీవీల్లోని వృత్తి విద్యా కోర్సులు పరీక్షలు రాసిన విద్యార్థులు అందరూ పాసయ్యారు. ఈ విజయంపై జీసీడీవో పద్మనళిని తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.
బెల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాలలో విద్యుత్ షాక్ తో బొమ్మగోని అనిల్ గౌడ్ (28) మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు ఇంట్లో కూలర్ ప్లగ్‌ను జంక్షన్ బాక్స్‌కు అమరుస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అనిల్ గౌడ్ మంచిర్యాలలోని ఎస్ఐ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. తాళ్లగురిజాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో, ఎల్లారెడ్డి ఆదర్శ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్స్ పి. సాయిబాబా తెలిపారు. ఆదర్శ జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థినీలు ఎస్. హర్షిత 945 (ఎంపీసీ), హాబీ మదిహ 922 (బైపీసీ), అశ్మిత 816 (సీఈసీ)లో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.
బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన గిరిజన బిడ్డ బాణోతు అంజలి సత్తాచాటారు. రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించాలని లక్ష్యం పెట్టుకున్న అంజలి ప్రథమ సంవత్సరంలో 466 మార్కులు సాధించింది. ద్వితీయ సంవత్సరంలో మరింత పట్టుదలతో చదివి 993 మార్కులు సాధించింది. దీంతో అంజలికి అభినందనలు వెల్లువెత్తాయి.
చిన్న జయంతి ఉత్సవాల సందర్బంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి రూ.1,54,13,395 ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. దీక్ష విరమణ ద్వారా రూ.36,60,600, కేశఖండనము టికెట్స్ ద్వారా రూ.12,01,550, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.16,52,300 లడ్డు విక్రయాల ద్వారా రూ.74,12,825, పులిహోర ద్వారా రూ.14,86,120 వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఆదాయం పెరిందన్నారు.
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు సాధించినట్లు ఆ సొసైటీ నల్గొండ రీజనల్ కోఆర్డినేటర్ కె.లక్ష్మయ్య తెలిపారు. రెండు జిల్లాల్లోని 12 గురుకులాల నుంచి 711 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 630 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
జిల్లాలో నామినేషన్ల ఘట్టం నేడు ముగియనుంది. నల్గొండ, భువనగిరి లోక్ సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. నల్గొండ స్థానానికి 22 మంది నామినేషన్లు వేయగా ఆరుగురు మరో సెట్టు వేశారు. కొత్తగా 16 మంది తమ నామపత్రలను రిటర్నింగ్ అధికారి హరిచందనకు సమర్పించారు. ఇవాళ నామినేషన్ల గడువు ముగియనుండడంతో భారీగానే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.