Telangana

News April 25, 2024

ఎల్లారెడ్డి: ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన ఆదర్శ, గురుకుల విద్యార్థులు

image

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో, ఎల్లారెడ్డి ఆదర్శ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్స్ పి. సాయిబాబా తెలిపారు. ఆదర్శ జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థినీలు ఎస్. హర్షిత 945 (ఎంపీసీ), హాబీ మదిహ 922 (బైపీసీ), అశ్మిత 816 (సీఈసీ)లో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.

News April 25, 2024

భద్రాద్రి: కూలీ బిడ్డకు 993 మార్కులు

image

బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన గిరిజన బిడ్డ బాణోతు అంజలి సత్తాచాటారు. రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించాలని లక్ష్యం పెట్టుకున్న అంజలి ప్రథమ సంవత్సరంలో 466 మార్కులు సాధించింది. ద్వితీయ సంవత్సరంలో మరింత పట్టుదలతో చదివి 993 మార్కులు సాధించింది. దీంతో అంజలికి అభినందనలు వెల్లువెత్తాయి.

News April 25, 2024

కొండగట్టు: చిన్న జయంతి ఆదాయం 1.54 కోట్లు

image

చిన్న జయంతి ఉత్సవాల సందర్బంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి రూ.1,54,13,395 ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. దీక్ష విరమణ ద్వారా రూ.36,60,600, కేశఖండనము టికెట్స్ ద్వారా రూ.12,01,550, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.16,52,300 లడ్డు విక్రయాల ద్వారా రూ.74,12,825, పులిహోర ద్వారా రూ.14,86,120 వచ్చినట్లు ఈఓ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఆదాయం పెరిందన్నారు.

News April 25, 2024

NLG: ఇంటర్ ఫలితాలు.. గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత

image

ఇంటర్‌ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు సాధించినట్లు ఆ సొసైటీ నల్గొండ రీజనల్‌ కోఆర్డినేటర్‌ కె.లక్ష్మయ్య తెలిపారు. రెండు జిల్లాల్లోని 12 గురుకులాల నుంచి 711 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 630 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.

News April 25, 2024

NLG: 45 మంది నామినేషన్లు

image

జిల్లాలో నామినేషన్ల ఘట్టం నేడు ముగియనుంది. నల్గొండ, భువనగిరి లోక్ సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. నల్గొండ స్థానానికి 22 మంది నామినేషన్లు వేయగా ఆరుగురు మరో సెట్టు వేశారు. కొత్తగా 16 మంది తమ నామపత్రలను రిటర్నింగ్ అధికారి హరిచందనకు సమర్పించారు. ఇవాళ నామినేషన్ల గడువు ముగియనుండడంతో భారీగానే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.

News April 25, 2024

HNK: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా!

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో రాష్ట్రంలో HNK జిల్లా 6వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 18,533 మంది పరీక్ష రాయగా.. 11,578 మంది పాసయ్యారు. ఈ క్రమంలోనే HNKకు చెందిన తొగర సాత్విక MPCలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించారు. దీంతో అందరి అభినందనలు పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 8,905 మంది బాలికలకు గానూ 6,224 మంది పాసయ్యారు. బాలికలు 69.79 శాతం, బాలురు 55.49 శాతం ఉత్తీర్ణత సాధించారు.

News April 25, 2024

సర్వం సిద్ధం.. నేటి నుంచి ఓపెన్ పరీక్షలు ప్రారంభం

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ఓపెన్ SSC,ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో ఎస్సెస్సీ పరీక్షకు 12 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,864 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అలాగే ఇంటర్ పరీక్షకు 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా 4,013 మంది విద్యార్థులు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.

News April 25, 2024

పుస్తకావిష్కరణ చేసిన ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి

image

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో రిజర్వ్‌ బ్యాంకు మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తన ఉద్యోగానుభవాలతో రాసిన పుస్తకాన్ని కౌటిల్య విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. పటాన్‌చెరు మండలం రుద్రారంలో గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీలో డా. దువ్వూరి సుబ్బారావు జస్ట్‌ ఏ మెర్సెనరీ.? నోట్స్‌ ఫ్రమ్‌ మై లైఫ్‌ అండ్‌ కెరీర్‌ పేరుతో ప్రచురించిన ఆంగ్ల పుస్తకావిష్కరణ నిర్వహించారు.

News April 25, 2024

ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సాధారణ సెలవుల అనంతరం నేడు మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. కావున ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలని మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్‌కు తరలించే సమయంలో పలు సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే మంచి ధర పలుకుతుందని అధికారులు తెలిపారు.

News April 25, 2024

జూన్ 6 తర్వాత పేదలకు ఇళ్లు: మంత్రి శ్రీధర్‌బాబు

image

ఇళ్లు లేని పేదలకు జూన్ 6 తర్వాత ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోతే బీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతారహితంగా మాట్లాడుతూ.. కూలుతూనే ఉంటాయి.. నడుస్తూనే ఉంటాయని అనడం ఏంటని మండిపడ్డారు. కమీషన్లు తీసుకొని నిసిరకంగా నిర్మించిన కారణంగానే కూలుతున్నాయని ఆరోపించారు.