Telangana

News April 25, 2024

సర్వం సిద్ధం.. నేటి నుంచి ఓపెన్ పరీక్షలు ప్రారంభం

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ఓపెన్ SSC,ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో ఎస్సెస్సీ పరీక్షకు 12 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,864 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అలాగే ఇంటర్ పరీక్షకు 19 కేంద్రాలు ఏర్పాటు చేయగా 4,013 మంది విద్యార్థులు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.

News April 25, 2024

పుస్తకావిష్కరణ చేసిన ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి

image

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో రిజర్వ్‌ బ్యాంకు మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తన ఉద్యోగానుభవాలతో రాసిన పుస్తకాన్ని కౌటిల్య విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. పటాన్‌చెరు మండలం రుద్రారంలో గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీలో డా. దువ్వూరి సుబ్బారావు జస్ట్‌ ఏ మెర్సెనరీ.? నోట్స్‌ ఫ్రమ్‌ మై లైఫ్‌ అండ్‌ కెరీర్‌ పేరుతో ప్రచురించిన ఆంగ్ల పుస్తకావిష్కరణ నిర్వహించారు.

News April 25, 2024

ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సాధారణ సెలవుల అనంతరం నేడు మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. కావున ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలని మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ సరుకులు మార్కెట్‌కు తరలించే సమయంలో పలు సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే మంచి ధర పలుకుతుందని అధికారులు తెలిపారు.

News April 25, 2024

జూన్ 6 తర్వాత పేదలకు ఇళ్లు: మంత్రి శ్రీధర్‌బాబు

image

ఇళ్లు లేని పేదలకు జూన్ 6 తర్వాత ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోతే బీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతారహితంగా మాట్లాడుతూ.. కూలుతూనే ఉంటాయి.. నడుస్తూనే ఉంటాయని అనడం ఏంటని మండిపడ్డారు. కమీషన్లు తీసుకొని నిసిరకంగా నిర్మించిన కారణంగానే కూలుతున్నాయని ఆరోపించారు.

News April 25, 2024

పెద్దకొడప్గల్: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అన్నా చెల్లెలు

image

పెద్దకొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామానికి చెందిన అన్న చెల్లెలు జ్ఞానేశ్వర్, హారిక నేడు వెలువడిన ఇంటర్ ఫలితాలలో సత్తా చాటారు. జ్ఞానేశ్వర్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 952/1000, హారిక ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 465/470 మార్కులు సాధించారు. అన్నా చెల్లెలు ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించడంతో గ్రామస్థులు వారిని అభినందించారు.

News April 25, 2024

HYD: బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి

image

బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన బషీరాబాద్‌ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన బాలిక(16)పై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరేశ్(24) కన్నేశాడు. రోజూ బాలిక చదువుతున్న పాఠశాల వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వచ్చి మాటలు కలిపి ప్రేమ పేరుతో నమ్మించాడు. పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News April 25, 2024

సిద్దిపేట: డిప్లొమాలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

టెక్స్ టైల్స్ డిప్లమా కోర్సుల్లో శిక్షణ పొందడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు సతీష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రానికి 9 సీట్లు కేటాయించగా అందులో ఒక్క స్థానం ఈ డబ్ల్యూ ఎస్ కేటగిరి వారికి రిజర్వ్ చేశారన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్ లోని జిల్లా చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News April 25, 2024

దమ్మపేట: రూ. 4.51లక్షలు పట్టివేత

image

ఎలాంటి ఆధారాలు లేకుండా ఆంధ్రాకు తరలిస్తున్న రూ. 4.51 లక్షలు నగదును ఆళ్లపల్లి అంతర్ రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు బుధవారం పట్టుకున్నారు. దమ్మపేటకు చెందిన ఇద్దరు రైతులు ద్విచక్రవాహనంలో రూ.4 లక్షల51 వేల నగదు తీసుకొని ఏపీకి వెళ్తున్నారు, ఈ క్రమంలో ఆళ్లపల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా ఈ నగదు పట్టుబడింది. ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసినట్లు ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.

News April 25, 2024

యాదాద్రి: బ్యాంక్ డబ్బు కాజేసి బెట్టింగ్

image

వలిగొండ SBIలో క్యాషియర్‌గా పని చేస్తున్న కాలేరు అనిల్ కుమార్‌పై ఆ బ్రాంచ్ మేనేజర్ జి.మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో ఉండాల్సిన రూ.15.50 లక్షలు లావాదేవీల్లో తక్కువగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సై మహేందర్ దర్యాప్తు చేపట్టి నిందితుడు అనిల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. నిందితుడు రూ.37.63 లక్షలను ఆన్లైన్ బెట్టింగ్ పెట్టినట్లు తెలిపారు.

News April 25, 2024

HYD: బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి

image

బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన బషీరాబాద్‌ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన బాలిక(16)పై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరేశ్(24) కన్నేశాడు. రోజూ బాలిక చదువుతున్న పాఠశాల వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వచ్చి మాటలు కలిపి ప్రేమ పేరుతో నమ్మించాడు. పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.