India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరలో భాగంగా ఫలహార బండ్ల ఊరేగింపు కోలాహలంగా సాగింది. సోమవారం రాత్రి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి సాగిన ఫలహార బండ్ల ఊరేగింపు ఆద్యంతం ఆకట్టుకుంది. బోనాల జాతరలో బోనం, రంగం తర్వాత అత్యంత ముఖ్యమైన ఘట్టం ఫలహార బండి ఊరేగింపు, రెజిమెంటల్ బజార్, మోండా మార్కెట్, టకారాబస్తీ, రాంగోపాల్‌పేట్, పాన్‌బజార్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఫలహార బండ్లను ఊరేగిస్తున్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరలో భాగంగా ఫలహార బండ్ల ఊరేగింపు కోలాహలంగా సాగింది. సోమవారం రాత్రి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి సాగిన ఫలహార బండ్ల ఊరేగింపు ఆద్యంతం ఆకట్టుకుంది. బోనాల జాతరలో బోనం, రంగం తర్వాత అత్యంత ముఖ్యమైన ఘట్టం ఫలహార బండి ఊరేగింపు, రెజిమెంటల్ బజార్, మోండా మార్కెట్, టకారాబస్తీ, రాంగోపాల్‌పేట్, పాన్‌బజార్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఫలహార బండ్లను ఊరేగిస్తున్నారు.
నకిరేకల్ మున్సిపాలిటీ ఛైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌పై నల్గొండ కలెక్టర్‌కు 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్‌కి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి 12 మంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు నుంచి ఆరుగురు, కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీనీ కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,69,325 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.45,466, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.13,575, అన్నదానం రూ.1,10,283 వచ్చినట్లు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ లెక్కలపై స్పష్టత లేక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో డీసీసీబీ పరిధిలో రూ. లక్ష లోపు పంట రుణం పొందిన రైతులు 35,560 మంది ఉండగా మాఫీ సొమ్ము రూ.183.21 కోట్లుగా ఉంది. 12,477 మందికి రూ.63.25 కోట్లు మాత్రమే మాఫీ సొమ్ముజమైంది. సంఘాల వారీగా అనేక మంది పేర్లు జాబితాల్లో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, అదనపు డీసీపీలు, ఎసీపీలు, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులతో కమిషనర్ సుధీర్ బాబు నేరేడ్‌మెట్‌లోని కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో జరిగే నేరాలను అరికట్టాలని, నేరస్థులను పట్టుకోవడానికి నేరపరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని, సీసీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, అదనపు డీసీపీలు, ఎసీపీలు, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులతో కమిషనర్ సుధీర్ బాబు నేరేడ్‌మెట్‌లోని కమీషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో జరిగే నేరాలను అరికట్టాలని, నేరస్థులను పట్టుకోవడానికి నేరపరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని, సీసీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు.
నార్కెట్‌పల్లి- చిట్యాల స్టేషన్ల మధ్య కిలోమీటర్ నం.55/13 వద్ద ట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. రైలు నుంచి పడి చనిపోయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదైంది.
∆} భద్రాచలం రెండో ప్రమాద హెచ్చరిక జారీ
∆} పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించిన మంత్రి పొంగులేటి
∆} టేకులపల్లిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య చెక్కుల పంపిణీ
∆} పంచాయతీరాజ్ అధికారులతో సత్తుపల్లి ఎమ్మెల్యే భేటీ
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన వర్షాలు
∆} వరదలపై సమీక్ష నిర్వహించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్
రాష్ట్రంలో నిర్వహణలో HYDలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉందని ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. మూడు కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, మూడు బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. భద్రాద్రి కొత్తగూడెం, జక్రాన్ పల్లి నిజామాబాద్ జిల్లా, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్మించాల్సి ఉందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.