India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. బుధవారం భద్రాచలంలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు. అలాగే దమ్మపేటలో అత్యల్పంగా 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలకు ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావోద్దని అధికారులు చెబుతున్నారు.
జిల్లా విద్యార్థి రాష్ట్రస్థాయిలో సత్తాచాటింది. ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన కొత్తూరి అరుణ ప్రసన్న కుమార్ దంపతుల కుమార్తె కొత్తూరి రేచల్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. దింతో పలువురు ఆమెను అభినందించారు. ఇదే స్పూర్తితో మున్ముందు మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.
ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో అక్రమ నగదు సరఫరాను అధికారులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో అధిక మొత్తంలో తరలిస్తున్న డబ్బును, మద్యం, ఇతర విలువైన వస్తువులను పట్టుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 53,42,830 నగదును పోలీసులు పట్టుకున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ బస్సులు నేటి నుంచి రూట్ మారనున్నాయి. ప్రస్తుతం మెహిదీపట్నం నుంచి PVNR ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళ్లే బస్సులు ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్డు నుంచి రాకపోకలు సాగిస్తాయని మెహదీపట్నం డిపో మేనేజర్ మూర్తి తెలిపారు. ఈ పుష్పక్ బస్సు సౌకర్యం నేటి అర్ధరాత్రి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన కూకట్ల వేణుగోపాల్, స్రవంతిల కూతురు కూకట్ల వైష్ణవి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి సత్తా చాటింది. 440 మార్కులకు గానూ ఆమె 438 మార్కులు సాధించింది. అలాగే మెట్‌పల్లికి చెందిన ముక్క మృత్యుంజయ్, సంధ్యారాణిల కూతురు ముక్క హర్షిని ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి సత్తా చాటింది. వారిని పలువురు అభినందించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ బస్సులు నేటి నుంచి రూట్ మారనున్నాయి. ప్రస్తుతం మెహిదీపట్నం నుంచి PVNR ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళ్లే బస్సులు ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్డు నుంచి రాకపోకలు సాగిస్తాయని మెహదీపట్నం డిపో మేనేజర్ మూర్తి తెలిపారు. ఈ పుష్పక్ బస్సు సౌకర్యం ఈ రోజు అర్ధరాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
అతి వేగం అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కాకూడదని,
రహదారుల మీద వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. వాహనదారులు అతివేగం అజాగ్రత్తగా వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు గురి అవుతున్నారని, వాహనాలు నడిపే సమయంలో తమ ప్రాణాలనే కాకుండా తమపై ఆధారపడి కుటుంబ సభ్యులను దృష్టిలో వుంచుకొని వాహనాలను నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలని సూచించారు.
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామ సహాయం రఘురాం రెడ్డి గురువారం ఉదయం 10:30కు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని కాల్వఒడ్డు నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని కూసుమంచి మండల కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ హఫీజుద్దీన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
నల్గొండ జిల్లాలో ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆసరా పింఛన్లు (వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళ పెన్షన్లు) పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పెన్షన్దారులు పింఛను మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందాలని.. మధ్య దళారులను నమ్మ వద్దని సూచించారు.
ఓ మహిళ మెడలోంచి చైన్ దొంగలించిన ఘటన నిజామాబాద్‌లోని వినాయక్ నగర్‌లో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన నాగమణి బుధవారం సాయంత్రం స్థానిక హనుమాన్ మందిరం వద్దకు వెళ్లింది. అక్కడికి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాకెళ్లారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.