India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై సంగారెడ్డి పట్టణ పోలీసులు ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘునందన్ రావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐ భాస్కర్ తెలిపారు.
ఓ ప్రేమజంట ఆత్మహత్య ఘటన RR జిల్లా కొందుర్గులో జరిగింది. SI తెలిపిన వివరాలు.. ఉత్తరాశిపల్లి వాసి శ్రీకాంత్, కిస్మత్‌పురకు చెందిన బాలిక ప్రేమించుకుంటున్నారు. మార్చి 27న వారు పెళ్లి చేసుకున్నారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో తమ పెళ్లిని పెద్దలు ఒప్పుకోరని భయపడిన వారు 30న రాత్రి పురుగు మందు తాగారు. అదే రోజు బాలిక చనిపోగా ఈరోజు శ్రీకాంత్ ఆస్పత్రిలో చనిపోయాడు. అబ్బాయి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

గద్వాల జిల్లా ధరూర్ మండలం గార్లపాడులో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ బాలిక మృతి చెందింది. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన మమత(11) నేడు గ్రామ శివారులోని బావిలో ఈతకు స్నేహితులతో కలిసి వెళ్లింది. ఈత కొడుతున్న మమత ఎంతకీ బయటకు రాకపోవడంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. వారు వచ్చి బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 154 అగ్ని ప్రమాద కేసులు విచారణ ప్రారంభం కాగా.. 71 కేసుల్లో జరిమానాలు, 56 కేసుల్లో న్యాయస్థానం మార్పులు చేసి సమర్పించాలని సూచించింది. 18 కేసులు వేర్వేరు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా..9 కేసులను ఉపసంహరించుకున్నారు. HYD పరిధిలో 36 మందికి ఉల్లంఘన నోటీసులు, 31 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు వెబ్ సైట్‌లో పేర్కొన్నారు.

మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి SRS గార్డెన్లో BRS కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. MP అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ… అరవింద్, జీవన్ రెడ్డి దొందూ దొందే అని విమర్శించారు. వారిద్దరు నిజామాబాద్ జిల్లాకు చేసింది శూన్యమన్నారు. కాంగ్రెస్ నుంచి MLCగా ఉన్న జీవన్‌రెడ్డి ఒక్కరోజైనా మోపాల్ మండల ప్రజల మంచి, చెడు అడిగారా అని ప్రశ్నించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే అందుబాటులో ఉంటానన్నారు.
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అదృశ్యమయ్యాడు. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగరాజు 3 రోజులుగా కనిపించడం లేదు. చేగుంటలో నివాసం ఉంటూ రోజూ పాఠశాలకు వెళ్లి వస్తుంటాడు. 3 రోజులుగా పాఠశాలకు రాకపోవడంతో విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులు అతడి కుమారుడు వంశీధర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లోనే ఫోన్లు, బైక్ వదిలి వెళ్లాడు. కేసు నమోదైంది.
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యాధికారులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. నేడు ఆత్మకూర్ పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎండ తీవ్రతతో వడదెబ్బకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పిహెచ్సీ పరిధిలోని గ్రామ ప్రజలకు వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,205 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. దాదాపుగా 70 శాతం పాఠశాలల్లో వాచ్మెన్లు లేరు. గతంలో ఉన్న వారు పదవీ విరమణ పొందగా, వీరి స్థానంలో కొత్త వారిని గత ప్రభుత్వం నియమించలేదు. కొద్ది రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రభుత్వ బడుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నింటి నేపథ్యంలో కొన్ని చోట్ల పాఠశాలల పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.
Sorry, no posts matched your criteria.