Telangana

News July 22, 2024

గోదావరిఖనిలో దారుణం.. అన్న చేతిలో తమ్ముడి హతం 

image

గోదావరిఖనిలో దారుణం జరిగింది. పోలీసుల ప్రకారం.. కృష్ణానగర్‌లో ఆత్మకూరి అనిల్ అనే వ్యక్తి అతడి తమ్ముడు సునీల్, తండ్రి ఓదెలతో ఘర్షణకు దిగి వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సునీల్ మృతి చెందగా.. తండ్రి ఓదెలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా వీరిమధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News July 22, 2024

సికింద్రాబాద్‌లో కోలాహలంగా ఫలహార బండ్ల ఊరేగింపు

image

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరలో భాగంగా ఫలహార బండ్ల ఊరేగింపు కోలాహలంగా సాగింది. సోమవారం రాత్రి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి సాగిన ఫలహార బండ్ల ఊరేగింపు ఆద్యంతం ఆకట్టుకుంది. బోనాల జాతరలో బోనం, రంగం తర్వాత అత్యంత ముఖ్యమైన ఘట్టం ఫలహార బండి ఊరేగింపు, రెజిమెంటల్ బజార్, మోండా మార్కెట్, టకారాబస్తీ, రాంగోపాల్‌పేట్, పాన్‌బజార్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఫలహార బండ్లను ఊరేగిస్తున్నారు. 

News July 22, 2024

సికింద్రాబాద్‌లో కోలాహలంగా ఫలహార బండ్ల ఊరేగింపు

image

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరలో భాగంగా ఫలహార బండ్ల ఊరేగింపు కోలాహలంగా సాగింది. సోమవారం రాత్రి సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి సాగిన ఫలహార బండ్ల ఊరేగింపు ఆద్యంతం ఆకట్టుకుంది. బోనాల జాతరలో బోనం, రంగం తర్వాత అత్యంత ముఖ్యమైన ఘట్టం ఫలహార బండి ఊరేగింపు, రెజిమెంటల్ బజార్, మోండా మార్కెట్, టకారాబస్తీ, రాంగోపాల్‌పేట్, పాన్‌బజార్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఫలహార బండ్లను ఊరేగిస్తున్నారు.

News July 22, 2024

మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం

image

నకిరేకల్ మున్సిపాలిటీ ఛైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌పై నల్గొండ కలెక్టర్‌కు 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్‌కి నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి 12 మంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు నుంచి ఆరుగురు, కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీనీ కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

News July 22, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,69,325 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.45,466, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.13,575, అన్నదానం రూ.1,10,283 వచ్చినట్లు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News July 22, 2024

ఆదిలాబాద్: రుణమాఫీపై పరేషాన్‌లో రైతులు..!

image

ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ లెక్కలపై స్పష్టత లేక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో డీసీసీబీ పరిధిలో రూ. లక్ష లోపు పంట రుణం పొందిన రైతులు 35,560 మంది ఉండగా మాఫీ సొమ్ము రూ.183.21 కోట్లుగా ఉంది. 12,477 మందికి రూ.63.25 కోట్లు మాత్రమే మాఫీ సొమ్ముజమైంది. సంఘాల వారీగా అనేక మంది పేర్లు జాబితాల్లో లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News July 22, 2024

HYD: రాచకొండలో జరిగే నేరాలను అరికట్టాలి..

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, అదనపు డీసీపీలు, ఎసీపీలు, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులతో కమిషనర్ సుధీర్ బాబు నేరేడ్‌మెట్‌లోని కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో జరిగే నేరాలను అరికట్టాలని, నేరస్థులను పట్టుకోవడానికి నేరపరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని, సీసీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు.

News July 22, 2024

HYD: రాచకొండలో జరిగే నేరాలను అరికట్టాలి

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, అదనపు డీసీపీలు, ఎసీపీలు, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులతో కమిషనర్ సుధీర్ బాబు నేరేడ్‌మెట్‌లోని కమీషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో జరిగే నేరాలను అరికట్టాలని, నేరస్థులను పట్టుకోవడానికి నేరపరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని, సీసీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు.

News July 22, 2024

నార్కెట్‌పల్లి వద్ద రైలు నుంచి పడి వ్యక్తి మృతి

image

నార్కెట్‌పల్లి- చిట్యాల స్టేషన్ల మధ్య కిలోమీటర్ నం.55/13 వద్ద ట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. రైలు నుంచి పడి చనిపోయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదైంది. 

News July 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} భద్రాచలం రెండో ప్రమాద హెచ్చరిక జారీ
∆} పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించిన మంత్రి పొంగులేటి
∆} టేకులపల్లిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య చెక్కుల పంపిణీ
∆} పంచాయతీరాజ్ అధికారులతో సత్తుపల్లి ఎమ్మెల్యే భేటీ
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన వర్షాలు
∆} వరదలపై సమీక్ష నిర్వహించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్