Telangana

News September 6, 2024

ఎల్లారెడ్డి హాస్టల్‌లో రాళ్లతో దాడి చేసుకున్న విద్యార్థులు

image

ఎల్లారెడ్డి గురుకుల హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొంతకాలంగా విద్యార్థుల మధ్య జరుగుతున్న గొడవ గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 6, 2024

ఫామ్‌‌‌ హౌస్‌లో జిట్టా అంత్యక్రియలు

image

తెలంగాణ మలిదశ ఉద్యమకారులు జిట్టా బాలకృష్ణా రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. భువనగిరి శివారులోని మగ్దుంపల్లి రోడ్డులోని ఆయన ఫామ్ హౌస్‌లో నాలుగు గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కాసేపట్లో HYD నుంచి మృతదేహాన్ని ఫామ్ హౌస్‌కు తీసుకురానున్నారు. మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన మృతదేహాన్ని చూడడానికి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ముఖ్యులు రానున్నారు.

News September 6, 2024

HYD: ఉస్మానియాలో 2 భవనాలకు శంకుస్థాపన

image

ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం నిర్మించిన 2 కొత్త హాస్టల్ భవనాల నిర్మాణ పనులను నేడు మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేయనున్నారు. 10,286 చదరపు అడుగుల విస్తీర్ణంలో డెంటల్ హాస్టల్ నిర్మించనున్నారు. వీటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఏడాదిలో బిల్డింగుల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తుంది.

News September 6, 2024

WGL: ‘మావో’ల ఎన్ కౌంటర్‌కు టోర్నడో ఎఫెక్ట్!

image

మావోయిస్టుల ఎన్కౌంటర్ వెనుక తాడ్వాయి అడవుల్లో ఇటీవలే సంభవించిన టోర్నడో ఎఫెక్ట్ కారణంగా వినిపిస్తోంది. 2 నెలల క్రితమే భద్రాద్రి జిల్లాలోకి లచ్చన్న దళం ప్రవేశించింది. అయితే తాడ్వాయి మండలంలో టోర్నడో తరహాలో భారీ వృక్షాలు నేలకూలడంతో లచ్చన్న దళం కదలికలకు అంతరాయం ఏర్పడింది. దీంతో భద్రాద్రి జిల్లా అడవులకు దళం పరిమితమైంది. పోలీసులకు సమాచారం తెలియడంతో ఎన్కౌంటర్లో మృత్యువాత పడాల్సి వచ్చింది.

News September 6, 2024

HYD: వీధుల్లోకి మళ్లీ చెత్త డబ్బాలు

image

చెత్త డబ్బాల్లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని జీహెచ్ఎంసీ అటకెక్కించింది. వీధుల్లో మళ్లీ చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య విభాగం నిర్ణయించింది. జోనల్ కార్యాలయాలకు చెత్త డబ్బాల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్యాలయం ఆదేశాలిచ్చింది. అదనంగా.. ప్రధాన రహదారులకు ఇరువైపులా 20కేజీల బరువును తట్టుకునే మూడు రకాల చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

News September 6, 2024

HYD: నిర్మాణ ప్రదేశాల్లో ఇవి తప్పని సరి

image

ఇల్లు లేదా వాణిజ్య సముదాయాల నిర్మాణ ప్రదేశాల్లో చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయని జీహెచ్ఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలను నివారించేందుకు నిర్మాణ ప్రదేశాల్లో పిల్లల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్టు కమిషనర్ ఆమ్రపాలి గురువారం తెలిపారు. ఇకపై జారీ అయ్యే నిర్మాణ అనుమతుల్లో ఈ నిబంధనను చేర్చాలని సూచించారు.

News September 6, 2024

గ్రేటర్‌లో కుంగిపోతున్న తాగునీటి పైపులు

image

గ్రేటర్‌లో వరద దెబ్బకు తాగునీటి పైపులు కుంగిపోతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు రహదారుల కింద ఉన్న సరఫరా లైన్లు దెబ్బతింటున్నాయి. ప్రధాన పైపులైన్ల నుంచి ఇళ్లకు వెళ్లే సబ్ మెయిన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌లో చాలావరకు పాతబడిన లైన్లు ఉన్నాయి. వాటి మరమ్మతులకే ఏటా రూ.100 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ప్రధాన నగరంలోని 169 చ.కి.మీ. పరిధిలో ఇప్పటికీ 50 ఏళ్ల నాటి వ్యవస్థ ఇప్పటికీ ఉంది.

News September 6, 2024

HYD: వీధుల్లోకి మళ్లీ చెత్త డబ్బాలు

image

చెత్త డబ్బాల్లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని జీహెచ్ఎంసీ అటకెక్కించింది. వీధుల్లో మళ్లీ చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య విభాగం నిర్ణయించింది. జోనల్ కార్యాలయాలకు చెత్త డబ్బాల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్యాలయం ఆదేశాలిచ్చింది. అదనంగా.. ప్రధాన రహదారులకు ఇరువైపులా 20కేజీల బరువును తట్టుకునే మూడు రకాల చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

News September 6, 2024

HYD: 8 నెలల్లో.. 200 కేసులు

image

నగర సీసీఎస్ ఠాణాలో ఈ ఏడాది 8 నెలల వ్యవధిలో 200కు పైగా కేసులు నమోదయ్యాయి. రూ.250-300 కోట్ల వరకూ నష్టపోయినట్టు ప్రాథమిక అంచనా. 30 ఏళ్లపాటు దాచిన సంపాదనను 3 రోజుల్లో పోగొట్టుకున్న వయోధికులున్నారు . ప్రీ లాంచింగ్ పేరిట స్థిరాస్తి సంస్థల ప్రకటనలతో ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఓవైపు ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నా డబ్బు మీద ఉన్న ఆశతో చాలామంది మోసపోతున్నారు.

News September 6, 2024

బిచ్కుంద: డెంగ్యూతో 9వ తరగతి విద్యార్థిని మృతి

image

డెంగ్యూతో 9వ తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన బిచ్కుందలో చోటుచేసుకుంది. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సిద్దేశ్వరి ఐదు రోజుల క్రితం డెంగ్యూ జ్వరం వచ్చింది. దీంతో ఆమెను కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్పించారు. జ్వర తీవ్రత పెరగడంతో సిద్దేశ్వరి గురువారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.