India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జాతీయ రహదార- 44పై అలంపూర్ చౌరస్తాలో ఫ్లై ఓవర్ పై వెళ్తున్న బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానాన్ని పరిశీలించారు. కాగా ఈ ప్రమాదం, మృతుడికి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని పొడగించినట్లు KU అధికారులు పేర్కొన్నారు. ఫీజు గడువును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 4 వరకు పొడిగించారు. రూ.50 అపరాధ రుసుంతో ఏప్రిల్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్, 2014లో TDP, 2019లో కాంగ్రెస్ గెలిచాయి. 2014, 2019లో రెండో స్థానానికి BRS పరిమితమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో BRS క్లీన్ స్వీప్ చేసింది. క్యాడర్ కూడా బలంగా ఉంది. గతంలో 2 సార్లు పార్టీ ఓడిపోయిందని, ఈసారి తప్పకుండా BRS గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమాగా ఉన్నారు. మీ కామెంట్?
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్, 2014లో TDP, 2019లో కాంగ్రెస్ గెలిచాయి. 2014, 2019లో రెండో స్థానానికి BRS పరిమితమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో BRS క్లీన్ స్వీప్ చేసింది. క్యాడర్ కూడా బలంగా ఉంది. గతంలో 2 సార్లు పార్టీ ఓడిపోయిందని, ఈసారి తప్పకుండా BRS గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమాగా ఉన్నారు. మీ కామెంట్?
నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన సులోచన అనే మహిళ రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వీరంతా ఒక కారులో మంగళవారం మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు కారంపొడి కోసం వెళ్లి తిరిగి వస్తుండగా నవీపేట్ మండలం జగ్గారావు ఫారం వద్ద వీరి కారు ప్రమాదవశాత్తు చెట్టును బలంగా ఢీ కొంది. సులోచన స్పాట్ లోనే మృతిచెందగా అనిత, సునీత, కవితకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని, తెలంగాణ విభజనను వ్యతిరేకించిన ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర దీక్ష చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకోవాలని మోదీ దగ్గర దీక్ష చేయాలన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తాను జాతీయహోదా తీసుకురాలేదని కాంగ్రెస్ నాయకులు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. నారాయణపేటలో ఆమె మాట్లాడుతూ.. పాలమూరు పార్లమెంటులోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే తాను మంత్రిగా ఉన్నప్పుడే పాలమూరు ప్రాజెక్టు సర్వే పనులు ప్రారంభానికి కృషిచేశానని అన్నారు. కాంగ్రెస్ నేతలు అవగాహన లేని మాటలు మానుకోవాలన్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హత్యలు, దందాలు, బెదిరింపులు, అక్రమ వ్యాపారాలు ఇతర నేరాలకు పాల్పడే వారిపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,936 మంది పాత నేరస్థులను పోలీసులు గుర్తించారు. రౌడీ షీటర్లుగా ఉన్న వారు, గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారి వివరాలు సేకరించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సాయి సమావేశంలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్‌రామ్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న వారికి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తానని, అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తానని, పేద కుటుంబాలకు ఒక రూపాయి ఖర్చుతో పేరు నమోదు చేసేలా ఫంక్షన్ హాల్‌ను అందుబాటులోకి తీసుకొస్తానన్నారు.
ఖమ్మం జిల్లాలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రత్యేకంగా 24 గంటల పాటు పని చేసేలా హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎవరైనా వడదెబ్బకు గురైనా, ఎండకు అపస్మారక స్థితికి చేరుకున్నా సమాచారాన్ని జిల్లా కేంద్రంలోని 8501003838, 8639522447 నంబరుకు తెలియజేస్తే తక్షణమే అందుబాటులో ఉన్న అంబులెన్సుతో పాటు వైద్య చికిత్సలకు దగ్గరలోని పీహెచ్సీకి తరలించి చికిత్సలు అందిస్తామని జిల్లా వైద్యాధికారులు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.