India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
WGL జిల్లాలో దివ్యాంగుల కోసం ఈనెలలో సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు DRDO కౌసల్యాదేవి తెలిపారు. మూగ, చెవిటి వారికి 12న, శారీరక (ఆర్థో) విభాగానికి 18, 19, 20 తేదీలు, మానసిక దివ్యాంగులకు 22న ఎంజీఎం ఆస్పత్రి, రీజినల్ కంటి ఆస్పత్రిలో కంటి సమస్యలకు సంబంధించిన క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వికలాంగత్వం ఉన్న వారు మీ సేవ కేంద్రాల్లో నేడు ఉదయం 11 నుంచి స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.
కాళేశ్వరం దేవస్థానం ఆలయ వేళల్లో మంగళవారం నుంచి మార్పులు చేసినట్లు ఈఓ ఎస్.మహేష్ తెలిపారు. వేసవికాలం సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4గంటల వరకు ద్వారా బంధనం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ద్వారం మూసేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు భక్తులకు ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
చుంచుపల్లి: వేసవికాలం ఆరంభంలోనే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. సోమవారం సూర్యుడు భగ్గుమన్నాడు. కొత్తగూడెం పరిధిలోని గరిమెళ్లపాడు, భద్రాచలం సబ్ కలెక్టరేట్ ఏరియాల్లో 41.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాత కొత్తగూడెంలో 40.5, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌లో 40.4, సీతారాంపట్నం, యానంబైలులో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు
బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్‌రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు మిస్ టీన్ గెలాక్సీ పేజెంట్ యూకే టైటిల్ కైవసం చేసుకుంది. యూకేలోని వారింగ్‌టన్ పార్ హాల్‌లో యునైటెడ్ కింగ్‌డమ్ నలుమూలల నుంచి 25 మంది యువతులతో కలిసి పోటీపడి అన్ని విభాగాల్లో ప్రతిభ కనబర్చి దక్షిణాసియా మొదటి విజేతగా నిలిచింది. వచ్చే ఆగస్టులో యూఎస్‌ఏలో జరిగే పోటీల్లో యూకే తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ స్థానం రోజుకో మలుపు తిరుగుతోంది. BRS సిట్టింగ్ అభ్యర్థి పసునూరి దయాకర్‌కు టికెట్ ఇవ్వకుండా కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీ మారారు. తీరా కావ్య సైతం ఇటీవల BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరగా.. ఆమెకు కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. దీంతో BRS మరో అభ్యర్థిని అన్వేశించాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, BJP టికెట్ ఆరూరి రమేశ్‌కు కేటాయించిన విషయం తెలిసిందే.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పలుచోట్ల వరి కోతలు షురూ కావడంతో సోమవారం మొత్తం 122 కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది. మరో 684 ప్రారంభించాల్సి ఉంది. మహబూబ్ నగర్ 1.11 లక్షలు, నాగర్ కర్నూల్-1.09, నారాయణ పేట-1.15, వనపర్తి-0.91, జోగులాంబ గద్వాల-0.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారుల అంచనాతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావటం ఖాయమని భాజపా MBNR ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. సోమవారం మిడ్జిల్, జడ్చర్ల పట్టణాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాయని, ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి ఈసారి ఎన్నికల్లో భారీ మెజార్టీ వచ్చేలా బూత్ స్థాయి కార్యకర్తలు కృషిచేయాలని కోరారు.
రాష్ట్రంలో, జిల్లాలోని ముస్లీం, మైనార్టీల సంక్షేమానికి కృషి చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. మసీదుల అభివృద్ధితో పాటు దర్గాలో అభివృద్ధికి కూడా అధిక శాతం నిధులు మంజూరు చేశానని గుర్తు చేశారు. మైనార్టీ గురుకులాలు, పాఠశాలలకు సొంత భవనాల నిర్మాణం కోసం 128 కోట్లు కేటాయించానని, 1 కోటి నిధులతో హజ్ హౌస్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
ఓ కార్పొరేటర్, మరో మహిళ వేధింపుల కారణంగా మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. శ్రీనివాసకాలనీలో నివాసం ఉండే బాలవర్ధన్ రెడ్డి తన ఆత్మహత్యకు భాగ్య, BJP కార్పొరేటర్ కారణమని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఓ కార్పొరేటర్, మరో మహిళ వేధింపుల కారణంగా మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. శ్రీనివాసకాలనీలో నివాసం ఉండే బాలవర్ధన్ రెడ్డి తన ఆత్మహత్యకు భాగ్య, BJP కార్పొరేటర్ కారణమని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.