Telangana

News April 2, 2024

మేడారంలో భక్తులకు ఇక్కట్లు

image

జాతర సమయంలో వనదేవతల దర్శనానికి రాని భక్తులు ప్రస్తుతం మేడారానికి తరలివస్తున్నారు. అయితే జాతరకు వస్తున్న భక్తులపై ఎండ ప్రభావం తీవ్రంగా పడుతోంది. దర్శించుకునే క్రమంలో గద్దెల ప్రాంగణంలో నీడ లేకపోవడం, కింద పూర్తిగా నాపరాళ్లు ఉండటంతో.. అవస్థలు తప్పట్లేదు. దీంతో గోవిందరాజు గద్దెవైపు చెట్ల నీడ పడుతుండటంతో దర్శనం తర్వాత అటుగా వెళ్తున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను తీర్చాలని భక్తులు కోరుతున్నారు.

News April 2, 2024

భైంసాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బైంసా మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బోకర్ తాలూకా కాండ్లి గ్రామానికి చెందిన గంప గణేశ్(45) భైంసాకు వస్తున్న క్రమంలో టాక్లి గ్రామ శివారులో బైకు అదుపు తప్పి కిందపడినట్లు తెలిపారు. అతడి తల బలంగా రోడ్డుకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొన్నారు.

News April 2, 2024

HYD‌లో పెరుగుతున్న ఎండలు

image

HYD నగరంలో ఎండలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మల్లాపూర్, కుత్బుల్లాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఏకంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శేరిలింగంపల్లి, కాప్రా, ఖైరతాబాద్, ఉప్పల్, చందానగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది. వడగాలులు వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.

News April 2, 2024

అడ్డాకల్: అప్పుల వేధింపులు తాళలేక వ్యక్తి సూసైడ్

image

అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని నాగోల్‌లో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అడ్డాకల్ మండలానికి చెందిన బాలవర్ధన్ రెడ్డి హైదరాబాదులో ఓ రియల్ ఎస్టేట్ సంస్థను నిర్వహిస్తున్నాడు. భార్య ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అప్పులు ఇచ్చిన వారు తిరిగి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

News April 2, 2024

RGM: ఎన్టిపిసి వార్షిక ఉత్పత్తి వివరాలు

image

రామగుండం NTPC 2023-24 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఉత్పత్తి వివరాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. 1600 మెగావాట్ల తెలంగాణ ప్లాంటులో మార్చి 29 నాటికి 37.12 మి. యూ, 2600 మెగావాట్ల ప్లాంట్‌లో మార్చి 26 నాటికి 16,645 మి.యూ. విద్యుత్ ఉత్పత్తి నమోదయింది. NTPC రిజర్వాయర్‌లోని 100 MV ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌లో 164.21 మి.యూ.కు గాను 196.17మి.యూ.తో 15.58 శాతం అధిక ఉత్పత్తి నమోదు చేసిందని పేర్కొన్నారు.

News April 2, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✏నీటి ఎద్దడి నివారణకు అధికారుల ఫోకస్
✏నేడు పలుచోట్ల వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
✏పెద్ద పెద్దపల్లి: నేడు రైతు వేదికలో శాస్త్రవేత్తల సలహాలు
✏నేటి రంజాన్ వేళలు: ఇఫ్తార్(మంగళ)-6:37,సహార్(బుధ):4:48
✏పలు చోట్ల చలివేంద్రాల ఏర్పాట్లు
✏ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వాహనాల తనిఖీలు
✏జాగ్రత్త..ఉమ్మడి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ
✏నవోదయ ఫలితాలు విడుదల
✏పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న ఎంపీ అభ్యర్థులు

News April 2, 2024

WGL: రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.335 కోట్లు

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2023-24 సంవత్సరానికి రిజిస్ట్రేషన్లు జోరుగా సాగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం కొద్దిగా తగ్గినా రిజిస్ట్రేషన్ దస్తావేజుల సంఖ్య మాత్రం తగ్గలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 1,09,892 దస్తావేజులకు గాను రూ.335.01 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం రూ.350 కోట్లు ఆదాయం సమకూరింది.

News April 2, 2024

మహా గ్రేటర్‌గా హైదరాబాద్‌..!

image

హైదరాబాద్‌ను విస్తరించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత‌ ఇందుకు సంబంధించిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించనున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయనున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లు‌ 210 వరకు పెరుగుతాయని అంచనా. జూన్‌ నాటికి మహా గ్రేటర్‌‌పై ప్రణాళికలు పూర్తి చేసేలా కసరత్తుల చేస్తున్నారు. SHARE IT

News April 2, 2024

మహా గ్రేటర్‌గా హైదరాబాద్‌..!

image

హైదరాబాద్‌ను విస్తరించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత‌ ఇందుకు సంబంధించిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించనున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయనున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లు‌ 210 వరకు పెరుగుతాయని అంచనా. జూన్‌ నాటికి మహా గ్రేటర్‌‌పై ప్రణాళికలు పూర్తి చేసేలా కసరత్తుల చేస్తున్నారు.
SHARE IT

News April 2, 2024

ఉమ్మడి‌ మెదక్‌లో‌ పెరిగిన ఎండలు

image

ఉమ్మడి మెదక్‌‌లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు బయటకురాలేని పరిస్థితి నెలకొంటోంది. సోమవారం తెలంగాణలోనే అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చేర్యాల మండల చిట్యాలో ఏకంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. వడగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
SHARE IT