India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 4లక్షల మెజార్టీతో గెలవబోతున్నారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ, భువనగిరి స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని తెలిపారు. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్ మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బూర నర్సయ్య గౌడ్ కోమటిరెడ్డి బ్రదర్స్ పై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారన్నారు.
జహీరాబాద్ లోక్‌సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లే అధికంగా ఉన్నాయి. మొత్తం 16,31,996 ఓట్లు ఉండగా.. ఇందులో పురుషులు 7,98,220, మహిళలు 8,33,718, ట్రాన్స్‌జెండర్లు 58 మంది ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారి పోలింగ్ శాతమే అధికం. కాగా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది మహిళల ఓటర్లపైనే ఆధారపడి ఉంది.
ఉమ్మడి జిల్లాలో వాతావరణం రోజురోజుకూ పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ నెల 1 నుంచి 5 వరకు ఉమ్మడి పాలమూరులోని వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లా ప్రజలకు వడదెబ్బ ముప్పు పొంచి ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మండిపడ్డ ఆయన.. బీఆర్ఎస్‌ను వీడిన వారు KCRపై బురద చల్లడం సరికాదని మండి పడ్డారు. కడియం దళితులపై లేని పోని కుట్రలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆదేశిస్తే వరంగల్ ఎంపీగా పోటీ చేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం పార్టీ మారడం సరికాదన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతుంది. రాబోయే 5 రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ తెలిపింది. నేటి నుంచి పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
HYDలో తాగునీటి సమస్య తీర్చేందుకు హిమాయత్ సాగర్, గండిపేట జంట జలాశయాల నుంచి నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా, గోదావరి జలాలను మాత్రమే నగరంలో సరఫరా చేశారు. జంట జలాశయాల నుంచి తరలించిన నీటిని శుద్ధి చేసి సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ జలమండలి అధికారులను ఆదేశించారు.
HYDలో తాగునీటి సమస్య తీర్చేందుకు హిమాయత్ సాగర్, గండిపేట జంట జలాశయాల నుంచి నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా, గోదావరి జలాలను మాత్రమే నగరంలో సరఫరా చేశారు. జంట జలాశయాల నుంచి తరలించిన నీటిని శుద్ధి చేసి సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ జలమండలి అధికారులను ఆదేశించారు.
నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఆర్మూర్ డివిజన్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్ పల్లి – అంతర్ జిల్లా చెక్ పోస్ట్, దూద్గాం – అంతర్ జిల్లా చెక్ పోస్ట్, తల్వేదా – అంతర్ జిల్లా చెక్ పోస్ట్, భీంగల్ – SST చెక్ పోస్ట్ పరిధిలో SST& పోలీస్ సిబ్బంది విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో సిబ్బంది పాల్గొన్నారు.
చింతకాని మండలం నందు 25 గ్రామ పంచాయతీలకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లు వివిధ వాహనాలు ఇతరులకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. లబ్ధిదారుని వివరాలను సేకరించి సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌతం సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం సాధించి ఆల్ టైం రికార్డ్ ఆర్థిక సంవత్సరానికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 70.02 మిలియన్ టన్నులు సాధించడంతోపాటు అదే స్థాయిలో 69.86లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సంస్థ C&MD బలరాం నాయక్ ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన అధికారిని నియమించారన్నారు.
Sorry, no posts matched your criteria.