Telangana

News July 22, 2024

సికింద్రాబాద్ జాతరకు వెళ్లేవారికి ALERT

image

సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఆదివారం, సోమవారం 2 రోజుల వ్యవధిలో దాదాపు 25 సెల్‌ఫోన్లు, 15 గ్రాముల బంగారు గొలుసులు చోరీకి గురయ్యాయని బాధితులు మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 1,500 మంది పోలీసుల బందోబస్తు, 100కు పైగా CC కెమెరాలున్నా దొంగలు తమ చేతివాటాన్ని చూపారు.

News July 22, 2024

సమస్యలను పరిష్కరించే విధంగా కృషి: ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 70 మంది ఆర్జీలతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్తి వివరాలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News July 22, 2024

NLG: 29 వరకు ఆసరా పెన్షన్ల పంపిణీ

image

నల్గొండ జిల్లాలో ఈనెల 29వ తేదీ వరకు ఆసరా పింఛన్లు (వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళ పెన్షన్లు) పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి తెలిపారు. పింఛను మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుంచి పొందాలని మధ్య దళారులను నమ్మొద్దని చెప్పారు.

News July 22, 2024

కాళేశ్వరం ప్రాజెక్టు కుట్రలను తట్టుకొని నిలిచింది: కొప్పుల 

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి కొప్పుల స్పందించారు. ‘తెలంగాణ ఎదుగుదలని చూసి ఓర్వలేక ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార.. సజీవ జలధార అని కొనియాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగింది.. కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ విమర్శించిందన్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా.. లక్షల క్యూసెక్కుల నీటిరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తుంది‘ అని అన్నారు.

News July 22, 2024

పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదు: మహేశ్వర్ రెడ్డి

image

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీపై BJP శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు చేశారు. యూరో ఎగ్జిన్‌ బ్యాంక్‌ కుంభకోణంలో రాఘవ కంపెనీ భాగస్వామి అని అన్నారు. పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిన్‌ బ్యాంకు లేదని, ఆ బ్యాంకు గ్యారంటీలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

News July 22, 2024

రేపు MBNR జిల్లాకు కల్కి బుజ్జి కారు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటర్‌లో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు కల్కి సినిమా విజయోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్, కల్కిలో ముఖ్యపాత్ర పోషించిన బుజ్జి కార్ రాబోతోందని తెలిపారు. గత నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి సినిమా భారీ విజయం సాధించిందని పేర్కొన్నారు.

News July 22, 2024

కరీంనగర్‌లో కొనసాగుతున్న ఉచిత గ్రాండ్ టెస్టులు

image

గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్టులు 5వ రోజు ప్రశాంతంగా జరిగినట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.రవి కుమార్ తెలిపారు. మొత్తం 4 గ్రాండ్ టెస్టులు, 16 పరీక్షలు ఉంటాయన్నారు. కరీంనగర్ పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో సోమవారం 50 మంది హాజరైనట్లు వెల్లడించారు. 3వ గ్రాండ్ టెస్టు జులై 23న, 4వ గ్రాండ్ టెస్టు జులై 30, 31 తేదీల్లో ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు టెస్టులు ఉపయోగించుకోవచ్చన్నారు.

News July 22, 2024

అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి: కలెక్టర్

image

అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్
సి.నారాయణరెడ్డి అన్నారు.
విధులలో సమయపాలన పాటించాలని, పనిలో నాణ్యత ఉండాలని అన్నారు. రెగ్యులర్ పనులతో పాటు, ప్రభుత్వ ప్రాధామ్య పథకాల అమలులో జాప్యం చేయవద్దని అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. 

News July 22, 2024

కడెం ప్రాజెక్టు అప్డేట్.. 3380 క్యూసెక్కుల నీటి విడుదల

image

కడెం ప్రాజెక్టు నుంచి 3380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా సోమవారం సా. 5 గంటలకు ప్రాజెక్టులో 691.22 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ప్రాజెక్టులోకి 4855 క్యూసెక్కుల నీరు వస్తోందని, దీంతో ఒక గేటు ఎత్తి ఎడమ కాలువకు 298, కుడి కాల్వకు 8, గోదావరిలోకి 2,997 క్యూసెక్కులు మొత్తం 3,380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు.

News July 22, 2024

బీ.ఎడ్. విద్యార్థులకు సూచన: పరీక్షల ఫీజు తేదీ ప్రకటన

image

తెలంగాణ విశ్వ విద్యాలయ పరిధిలో బీ.ఎడ్. నాల్గవ సెమిస్టరు, రెగ్యులర్ 1వ, 2వ, 3వ, 4వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు ఆగస్టు 1వ తేదీ లోపు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య.ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రూ.100 అపరాధ రుసుముతో 02-8-2024 వరకు చెల్లించవచ్చన్నారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్ సైట్‌లో పొందుపర్చినట్లు వివరించారు.