Telangana

News September 6, 2024

HYD: వీధుల్లోకి మళ్లీ చెత్త డబ్బాలు

image

చెత్త డబ్బాల్లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని జీహెచ్ఎంసీ అటకెక్కించింది. వీధుల్లో మళ్లీ చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య విభాగం నిర్ణయించింది. జోనల్ కార్యాలయాలకు చెత్త డబ్బాల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్యాలయం ఆదేశాలిచ్చింది. అదనంగా.. ప్రధాన రహదారులకు ఇరువైపులా 20కేజీల బరువును తట్టుకునే మూడు రకాల చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

News September 6, 2024

HYD: నిర్మాణ ప్రదేశాల్లో ఇవి తప్పని సరి

image

ఇల్లు లేదా వాణిజ్య సముదాయాల నిర్మాణ ప్రదేశాల్లో చిన్న పిల్లలపై వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయని జీహెచ్ఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలను నివారించేందుకు నిర్మాణ ప్రదేశాల్లో పిల్లల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్టు కమిషనర్ ఆమ్రపాలి గురువారం తెలిపారు. ఇకపై జారీ అయ్యే నిర్మాణ అనుమతుల్లో ఈ నిబంధనను చేర్చాలని సూచించారు.

News September 6, 2024

గ్రేటర్‌లో కుంగిపోతున్న తాగునీటి పైపులు

image

గ్రేటర్‌లో వరద దెబ్బకు తాగునీటి పైపులు కుంగిపోతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు రహదారుల కింద ఉన్న సరఫరా లైన్లు దెబ్బతింటున్నాయి. ప్రధాన పైపులైన్ల నుంచి ఇళ్లకు వెళ్లే సబ్ మెయిన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌లో చాలావరకు పాతబడిన లైన్లు ఉన్నాయి. వాటి మరమ్మతులకే ఏటా రూ.100 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ప్రధాన నగరంలోని 169 చ.కి.మీ. పరిధిలో ఇప్పటికీ 50 ఏళ్ల నాటి వ్యవస్థ ఇప్పటికీ ఉంది.

News September 6, 2024

HYD: వీధుల్లోకి మళ్లీ చెత్త డబ్బాలు

image

చెత్త డబ్బాల్లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని జీహెచ్ఎంసీ అటకెక్కించింది. వీధుల్లో మళ్లీ చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య విభాగం నిర్ణయించింది. జోనల్ కార్యాలయాలకు చెత్త డబ్బాల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్యాలయం ఆదేశాలిచ్చింది. అదనంగా.. ప్రధాన రహదారులకు ఇరువైపులా 20కేజీల బరువును తట్టుకునే మూడు రకాల చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలని సూచించింది.

News September 6, 2024

HYD: 8 నెలల్లో.. 200 కేసులు

image

నగర సీసీఎస్ ఠాణాలో ఈ ఏడాది 8 నెలల వ్యవధిలో 200కు పైగా కేసులు నమోదయ్యాయి. రూ.250-300 కోట్ల వరకూ నష్టపోయినట్టు ప్రాథమిక అంచనా. 30 ఏళ్లపాటు దాచిన సంపాదనను 3 రోజుల్లో పోగొట్టుకున్న వయోధికులున్నారు . ప్రీ లాంచింగ్ పేరిట స్థిరాస్తి సంస్థల ప్రకటనలతో ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఓవైపు ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నా డబ్బు మీద ఉన్న ఆశతో చాలామంది మోసపోతున్నారు.

News September 6, 2024

బిచ్కుంద: డెంగ్యూతో 9వ తరగతి విద్యార్థిని మృతి

image

డెంగ్యూతో 9వ తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన బిచ్కుందలో చోటుచేసుకుంది. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సిద్దేశ్వరి ఐదు రోజుల క్రితం డెంగ్యూ జ్వరం వచ్చింది. దీంతో ఆమెను కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్పించారు. జ్వర తీవ్రత పెరగడంతో సిద్దేశ్వరి గురువారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. 

News September 6, 2024

నల్గొండ: నిషేధం ముగిసింది.. సర్పంచ్ ఎన్నికకు సై  

image

గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయక నిషేధం బారిన పడిన అప్పటి అభ్యర్థులు ఇప్పుడు పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. వారిపై ఎన్నికల సంఘం విధించిన మూడేళ్ల సమయం ముగిసింది. 2019లో జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. 1097 మందిపై ఎన్నికల్లో పోటీచేయకుండా 2021లో నిషేధం పడింది. 2024 జులైతో వారి నిషేధ కాలం ముగిసి ఊరట లభించినట్లేనని అధికారులు తెలిపారు.

News September 6, 2024

వరంగల్‌కు ‘వాడ్రా ‘ వచ్చేస్తోంది..!

image

వరంగల్ నగరంలో చెరువుల పరిరక్షణకు హైద్రాబాద్ హైడ్రా తరహాలో.. ఇక్కడ వాడ్రాను అమలు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. నగర పరిధిలో 170 చెరువులు, కుంటలు ఉండగా అవి 4993 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. తొలి విడత 75 చెరువులపై లైడర్ సర్వే చేయించాలని టెండర్‌ను పిలిచారు. ఈ సర్వే అనంతరం వాడ్రాకు అడుగులు పడనున్నాయి. అదే అమలైతే చెరువులు, కాలువల కబ్జాలకు అడ్డుకట్ట పడనుంది.

News September 6, 2024

BREAKING..HYD: గవర్నమెంట్ ఆఫీసులోనే రైతు ఆత్మహత్య

image

రుణమాఫీ కాలేదని అగ్రికల్చర్ ఆఫీస్‌లోనే రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. రైతు సురేందర్ రెడ్డి (52) ఇవాళ ఉదయం అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలోని చెట్టుకు తాడుతో ఉరేసుకొని మృతి చెందాడు. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.