Telangana

News April 1, 2024

కొల్లాపూర్: అడుగంటుతున్న కృష్ణా జలాలు !

image

కృష్ణానదిలో జలాలు క్రమంగా అడుగంటుతున్నాయి. శ్రీశైలంలో బ్యాక్‌వాటర్‌ రోజురోజుకూ తగ్గుతోంది. జనవరి నెలాఖరులో 829 అడుగులు ఉన్న బ్యాక్‌ వాటర్‌ ప్రస్తుతం 811 అడుగులకు చేరుకుంది. దీంతో సాగునీటి అవసరాలకు ఇప్పటికే నీటి ఎత్తిపోతలు నిలిపివేయగా, కేవలం తాగునీటి కోసమే ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం తాగునీటికి ఇబ్బందులు లేవని అధికారులు అంటున్నారు. మరోవైపు పంటలు ఎండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News April 1, 2024

MBNR: ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ..!

image

మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీల నాయకులలో ఉత్కంఠ నెలకొంది. ఈనెల 28న ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రేపు ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు టెన్షన్‌తో ఉన్నారు. పైకి గెలుపు మీద ధీమాతో ఉన్నప్పటికీ లో లోపల మాత్రం ఆందోళనలో ఉన్నారు.

News April 1, 2024

చర్ల: ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

image

చర్ల సరిహద్దు ప్రాంతమైన సుక్మా జిల్లా తెట్టమడుగు అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. దీన్ని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఆప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లుగా అందిన సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలిస్తుండగా జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, నక్సల్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

News April 1, 2024

తెలంగాణలో రాక్షస పాలన సాగించిన బీఆర్ఎస్: ఎమ్మెల్యే వివేక్

image

తెలంగాణలో రాక్షస పాలన సాగించిన బిఆర్ఎస్‌కు గత ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. పీర్లపల్లిలో శ్రీ మల్లికార్జున ఆలయ ప్రతిష్ఠోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం లోకసభ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్తారని, ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోష్యం చెప్పారు.

News April 1, 2024

HYD: దూకుడు పెంచిన మజ్లిస్‌ పార్టీ

image

పార్లమెంట్‌ ఎన్నికల కోసం మజ్లిస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పాదయాత్రలతో ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టిన మజ్లిస్‌ పార్టీ.. రంజాన్‌ మాసం ఇఫ్తార్‌ విందులను సైతం సద్వినియోగం చేసుకుంటోంది. రోజుకో డివిజన్‌లో ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందులో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరుకావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసారి సైతం పోలింగ్‌ పెంపుపై దృష్టి సారించింది.

ఎల్లారెడ్డిలో బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిలుక సత్యనారాయణ మృతి చెందగా, అతడి కుమారుడు మధు గాయపడినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. బోధన్ వైపు వెళ్తున్న బైక్ అదుపు తప్పి బస్సు ఢీకొన్నట్లు పేర్కన్నారు. ఘటనపై సోమవారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News April 1, 2024

HYD: నోరూరిస్తున్న చీమ చింతకాయలు..!

image

గతంలో చీమచింత కాయలు గ్రామాల్లో విరివిగా దొరికేవి. చెట్టుకున్న చీమచింత కాయలను రాళ్లతో కొట్టి మరీ తినేవాళ్లు. నాటి తీపి జ్ఞాపకాలే వేరు. ఇప్పుడు గ్రామాల్లోనూ కనిపించడం లేదు. కానీ HYDలోని ఉస్మానియా యూనివర్సిటీ రహదారి, ఉప్పల్ చెరువు కట్ట, ఎల్బీనగర్ ప్రధాన రహదారుల్లో తోపుడు బండ్లపై చీమచింత కాయలు చూస్తుంటే నోరూరుతుందని, చీమ చింతకాయలు కొనుక్కొని మరీ పలువురు రుచి చూస్తున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో భానుడి ప్రతాపం

image

ఉమ్మడి జిల్లాలో మార్చి నెలాఖరు నాటికే ఎండలు తీవ్రమయ్యాయి. ఉదయం 9 దాటితే బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా 41.8 డిగ్రీల వరకు ఎండ తీవ్రత రికార్డు అయింది. కాగా ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యశాఖ పేర్కొంది.