Telangana

News July 22, 2024

కేంద్ర మంత్రితో సీఎం రేవంత్, మంత్రులు భట్టి, ఉత్తమ్ భేటీ 

image

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరారు. 

News July 22, 2024

మెదక్: ప్రజావాణికి 136 దరఖాస్తులు

image

మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 136 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. భూములకు సంబంధించి 36, పెన్షన్లకు సంబంధించి 8, డబుల్ బెడ్ రూమ్‌లకు సంబంధించి 18, రుణమాఫీకి సంబంధించి 7, ఇతర సమస్యలకు సంబంధించి 67 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News July 22, 2024

కేంద్ర మంత్రులను కలిసిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి

image

పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరిని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి ఉత్తమ్ కలిశారు. తెలంగాణ‌లో రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ స‌ర‌ఫ‌రా చేస్తున్న విష‌యాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. వినియోగ‌దారుల‌కు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల‌కు (ఓఎంసీ) చెల్లించే అవ‌కాశాన్ని క‌ల్పించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.

News July 22, 2024

జాతీయ రోడ్డు రవాణా శాఖ కార్యదర్శితో మంత్రి కోమటిరెడ్డి

image

జాతీయ రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. RRR నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా కంప్లీట్ చేసేందుకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.

News July 22, 2024

పెద్దవాగు ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకుంటాం: మంత్రి పొంగులేటి

image

అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి పెద్దవాగు ప్రాజెక్టు నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెగిపోయిన ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు. అధిక మొత్తంలో వరద రావడంతోనే ప్రాజెక్టు తెగిపోయిందని అన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ ఉన్నారు.

News July 22, 2024

బూర్గంపాడు: 3 కిలోమీటర్లు నడచి ఆసుపత్రికి తరలింపు

image

బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీ వాసులు వర్షాకాలం వచ్చిందంటే భయపడే పరిస్థితి నెలకొంది. సోమవారం ఓ మహిళకు విపరీతమైన జ్వరం రావడంతో స్థానికులు సుమారు 3 కిలోమీటర్ల మేర కాలినడకన తీసుకువెళ్లి ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వాలు మారుతున్న సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని స్థానికులు ఆరోపించారు. కాగా సదరు మహిళను 108 వాహనంలో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

News July 22, 2024

NZB: పోలీసుల అదుపులో యూనియన్ బ్యాంక్ మేనేజర్?

image

నిజామాబాద్ నగరంలోని పెద్దబజారు యూనియన్ బ్యాంకు స్కాంలో ప్రధాన నిందితుడైన మేనేజర్ అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మేనేజర్ అజయ్ ఖాతాదారుల నుంచి కోట్ల రూపాయలు కొట్టేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. కేసు విచారిస్తున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని నిజామాబాదు తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.

News July 22, 2024

వరంగల్: రికార్డు ధర పలుకుతున్న మొక్కజొన్న

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధర రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. గత శుక్రవారం రూ.2,750 రికార్డు ధర పలికిన క్వింటా మక్కలు.. ఈరోజు సైతం అదే ధర పలికాయి. రెండు నెలలుగా మక్కల ధరలు భారీగా పెరగడంతో మొక్కజొన్న పండించిన రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న లాగా ఇతర సరుకులు ధరలు కూడా పెరగాలని ఆకాంక్షిస్తున్నారు.

News July 22, 2024

కళ్యాణి ప్రాజెక్టు రెండు వరద గేట్లు ఎత్తివేత

image

కళ్యాణి ప్రాజెక్ట్ రెండు వరద గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు నుంచి 450 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి, మరో 200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ఆయకట్టుకు విడుదల చేస్తున్నట్లు ఏఈ శివ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లకు గాను ప్రస్తుతం 408.50 మీటర్లు నీరు నిల్వ ఉందన్నారు. ఎగువ భాగం నుంచి 650 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లోగా వస్తున్నట్లు ఏఈ తెలిపారు.

News July 22, 2024

గోదావరికి 16,780 క్యూసెక్కుల వరద

image

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. గోదావరి, ప్రాణహిత నదులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. అన్నారం బ్యారేజీలో 119 మీటర్ల లెవల్‌కు గోదావరి నదికి 16,870 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. కాళేశ్వరం వద్ద 101.01 మీటర్ల వరద ప్రవాహం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద 6,770 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.