India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో భారీ వర్షాలకు ధ్వంసం అయిన పెద్దవాగు ప్రాజెక్టును ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ పాల్గొన్నారు.
అల్లాదుర్గం మండలంలో విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ గణేశ్(24) మృతి చెందాడు. అల్లాదుర్గం గ్రామానికి చెందిన గణేశ్ రెడ్డిపల్లి, వెంకట్రావుపేటలో లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం అల్లాదుర్గం హెల్పర్ రామకృష్ణతో కలిసి స్థానిక మెట్టుగడ్డ చౌరస్తాలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజు వేసే క్రమంలో షాక్ తగిలి కిందపడిపోయాడు. వెంటనే 108లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగువిస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండంతో రైతులు వరి నాట్ల జోరు పెంచారు. అలాగే ఇప్పటి వరకు 1.55 లక్షల ఎకరాల్లో పత్తిని విత్తుకోగా ఈ నెలాఖరు వరకు 1.90 లక్షల ఎకరాలకు సాగు పెరగనుంది అని అధికారులు అంచన వేస్తున్నారు. పలు రకాల పంటల సాగుకు మరో 10 – 15 రోజులు ఉండటంతో సాగు విస్తీర్ణం పెరగనుంది.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి వేళ జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఓ ఆల్టో కారు గుర్తుతెలియని వ్యక్తిని ఢీ కొట్టి నాలుగు కిలోమీటర్ల మేరకు ఈడ్చుకు వచ్చింది. కంకులు టోల్ ప్లాజా వద్ద కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతితో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జూన్ 28, 2024 నాటికి భూమి పట్టా పొందిన రైతులంతా అర్హులని పేర్కొన్నారు. నామిని మరణించిన, పేరు మార్పు, ఇతర సవరణలు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కరీంనగర్ మండలం నగునూరు గ్రామంలో వృద్ధురాలు కోట లచ్చమ్మకు నలుగురు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కొడుకులెవరూ పట్టించుకోకపోవడంతో అనాథగా మారింది. శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నివాసం ఉంటున్న ఆమె కాలు జారి పడ్డారు. స్థానికులు కుటుంబీకులకు తెలిపినా ఎవరూ రాలేదు. ఈ విషయమై వృద్ధురాలి కుమార్తె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు MRO, పోలీసులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఉమ్మడి జిల్లాలో సోమవారం నమోదైన వివరాలిలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వాత్త్వర్లపల్లి 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా పెబ్బేరు 9.5 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో 6.8 మి.మీ, గద్వాల జిల్లా బీచుపల్లిలో 6.4 మి.మీ, నారాయణపేట జిల్లా ధన్వాడలో 4.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గోదావరిలో వదర ఉధృతి భద్రాచలంలో జిల్లా రెవెన్యూ అధికారుల పలు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోందని అధికారులు చెప్పారు. ఇప్పటికే గోదావరి రెండో ప్రమాద హెచ్చరికకు దగ్గరలో ఉందన్నారు. కాగా, గోదావరి బ్రిడ్జి పై సెసెల్ఫీలు, ఫొటోలు దిగకూడదని అధికారులు నిబంధన పెట్టారు. నిబంధన ఉల్లంఘించి సెల్ఫీలు దిగితే పోలీస్ స్టేషన్‌కు తరలిస్తామని హెచ్చరించారు.
ఉమ్మడి జిల్లాలోని మహిళలు వివిధ వ్యాధులతో సతమతం అవుతున్నట్లు ‘ఆరోగ్య మహిళ’ ప్రత్యేక వైద్య పరీక్షల్లో తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 64 PHCల్లో 340 మంది మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు గుర్తించారు. ముఖ్యంగా అతివల్లో క్యాన్సర్ ముప్పు చాపకింద నీరులా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పని ఒత్తిడితో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని.. అవగాహనతో వ్యాధిని నయం చేసుకోవచ్చని గద్వాల DMHO శశికళ అంటున్నారు.
వరంగల్ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన పాకాల సరస్సు సోమవారం ఉదయానికి 22.7 ఫీట్లకు నీటి మట్టం చేరుకుంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు సరస్సులోకి వచ్చి చేరుతోంది. పాకాల సరస్సు కింద సుమారు 35 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుత నీటిమట్టంతో సాగునీటికి ఎలాంటి డోకా లేదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.