India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని BC సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలలకు 3 రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో 3 రోజులు వానలు పడతాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని హైదరాబాద్ వేదికగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని BC సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలలకు 3 రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో 3 రోజులు వానలు పడతాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని హైదరాబాద్ వేదికగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బల్దియా యంత్రాంగం పారిశుద్ధ్య వాహనాలపై నిఘాపెట్టింది. పట్టణంలో చెత్త సేకరణకు వెళ్లిన ట్రాలీలు, ట్రాక్టర్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో తెలుసుకునేందుకు.. GPS ట్రాకింగ్ విధానం అమలు చేస్తోంది. చోదకులు వాహనాలను దారి మళ్లించడం, వాటిని ఎక్కడ పడితే అక్కడ నిలిపి విశ్రాంతి తీసుకోవడం వంటి పనులకు అడ్డుకట్ట పడనుంది. కార్మికుల పనితీరును అధికారులు తెలుసుకోనున్నారు.
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభం కాగా పత్తి తరలి వచ్చింది. ధర మాత్రం గత వారంతో పోలిస్తే భారీగా పడిపోయింది. మార్కెట్‌లో క్వింటా పత్తి ధర నేడు రూ.7,150 పలికింది. గతవారం రూ.7,400 వరకు పలికిన పత్తి ఈరోజు భారీగా పడిపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 20,023 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1068.20 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 20.518 టీఎంసీ నీరు నిల్వ ఉంది.
భద్రాచలం వద్ద గతంలో నమోదైన టాప్-5 గోదావరి నీటిమట్టం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1) 1986 ఆగస్టు 16న 75.6 అడుగులు, 2) 2022 జులై 16న 71.3 అడుగులు, 3) 1990 ఆగస్టు 24న 70.8 అడుగులు, 4) 2006 ఆగష్టు 6న 66.9 అడుగులు, 5) 1976 జూన్ 22న 63.9 అడుగులుగా గోదావరి నీటిమట్టం నమోదైంది. కాగా ప్రస్తుతం గోదావరి వద్ద 47.3 అడుగులుగా నీటిమట్టం కొనసాగుతోంది.
ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన సింగూర్‌కు స్వల్ప వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో జలాశయానికి 1270 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని ఏఈ మహిపాల్ రెడ్డి సోమవారం తెలిపారు. సింగూరు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 TMCలు కాగా ప్రస్తుతం 13.702 TMCల నీరు ఉంది. ప్రస్తుతం 391 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.
తండ్రి కన్నుమూసినా ఎప్పటికీ తమ కళ్ల ముందే ఉండాలని ఆయన కుమారులు తండ్రి విగ్రహాన్ని చేయించారు. నేలకొండపల్లి మండలం భైరవునిపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గుండపనేని పరాంకుశ రావు ఏడాది క్రితం మృతి చెందాడు. ఆయన కుమారులు రాంచందర్ రావు, లక్ష్మణరావు ఎప్పటికీ తమ కళ్ల ముందే తండ్రి రూపం ఉండాలనే భావనతో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రూ.80 వేలతో ఆయన విగ్రహం చేయించి తమ పొలంలో మందిరం నిర్మించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పార్వతి (సుందిల్ల) బ్యారేజీ కరకట్టకు ప్రమాదం పొంచి ఉంది. మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు పార్వతి బ్యారేజీలోకి వచ్చిన వరదతో కరకట్ట మరమ్మతుకు గురైంది. అప్పటి అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. కాగా ప్రస్తుతం 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కరకట్ట తెగిపోయే అవకాశం ఉండటంతో అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆగస్టు 5 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోని 18 నుంచి 59 ఏండ్ల వయసు గల రైతులు ఏఈవోలకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించింది. ఈనెల 28 వరకు పట్టాదారు పాస్‌బుక్ వచ్చిన రైతులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
Sorry, no posts matched your criteria.