India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD అంబర్‌పేట్‌లో మాజీ మంత్రి KTR పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నేత, సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. KTR వెంట ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్ ఉన్నారు. BRS పార్టీ తెలంగాణ ప్రజలదని, దానిని గెలిపించి పార్లమెంట్‌లో తెలంగాణ గొంతుక వినిపించేలా చేయాలని పిలుపునిచ్చారు.

మోర్తాడ్ మండలంలోని వడ్యాట్ రోడ్డు వద్ద ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. గుర్తు తెలియని దుండగులు గుడి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు. అమ్మవారి బంగారు ముక్కుపుడక, బొట్టు బిల్ల , హుండీలోని డబ్బులు సుమారు రూ.6వేలు దొంగలించినట్లు వెల్లడించారు. పోలీసుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
✏WNPT: కాంగ్రెస్ పార్టీలో చేరిన 8 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు
✏MLC ఎన్నిక.. చెల్లుబాటు ఓట్లను బట్టి గెలుపు నిర్దారణ:MBNR కలెక్టర్
✏నేను బహుజన ద్రోహిని కాదు:RS ప్రవీణ్ కుమార్
✏ఉమ్మడి జిల్లాలో ఘనంగా ఈస్టర్ వేడుకలు.. పాల్గొన్న MLAలు
✏MBNR:రేపటి నుంచి తైబజార్ రద్దు
✏ఇఫ్తార్ విందులో పాల్గొన్న.. స్థానిక MLAలు,MP అభ్యర్థులు
✏కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తాం:BSP
ఉమ్మడి పాలమూరులో భానుడు మండుతున్నాడు. దీంతో వేసవిలో తాగునీటి కోసం మట్టి కుండలను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మట్టి కుండల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సైతం సూచిస్తుండటంతో పేద, ధనిక తేడా లేకుండా వీటికి గిరాకీ పెరిగింది. సైజును బట్టి రూ.160 నుండి రూ.400 వరకు ధరలు పలుకుతున్నాయి. పట్టణంలో పలు ప్రాంతాల్లో మట్టి కుండలను విక్రయిస్తున్నారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సంగెం శ్రీరాంపూర్‌లో ఉరేసుకొని వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. సంగెం శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన నల్లూరి గంగాధర్(34) కొన్ని నెలల నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన అతడు.. ఈరోజు ఇంట్లోని దూలానికి చున్నీతో ఉరేసుకున్నాడు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYD కాచిగూడ డివిజన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లాయన్నారు. కార్పొరేటర్ కన్నె ఉమా రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లలో ఈరోజు మధ్యాహ్నం ఉష్ణోగ్రత వివరాలు.. సదాశివపేట 41.1, కొండాపూర్ 41.0, ధూల్మిట్ట 40.8, నిజాంపేట 40.7,చేగుంట, పటాన్‌చెరు, సిద్దిపేట 40.6, దౌల్తాబాద్ 40.5, పాశమైలారం, పాతూర్, నారాయణఖేడ్ 40.2, దామరంచ 40.1 సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ, ఓటుకు నోటు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసపూరితంగా ప్రవర్తించారని అన్నారు. పాలమూరు బిడ్డగా న్యాయం చేయాల్సిన వ్యక్తి ద్రోహం చేశాడని వాపోయారు. రానున్న రోజుల్లో పాలమూరు ప్రజలు రేవంత్ రెడ్డికి సరైన గుణపాఠం నేర్పుతారని అన్నారు.
Sorry, no posts matched your criteria.