Telangana

News September 6, 2024

BREAKING..HYD: గవర్నమెంట్ ఆఫీసులోనే రైతు ఆత్మహత్య

image

రుణమాఫీ కాలేదని అగ్రికల్చర్ ఆఫీస్‌లోనే రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. రైతు సురేందర్ రెడ్డి (52) ఇవాళ ఉదయం అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలోని చెట్టుకు తాడుతో ఉరేసుకొని మృతి చెందాడు. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News September 6, 2024

ఆదిలాబాద్: 28న ఓటర్ తుది జాబిత విడుదల

image

రానున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 28న ఓటర్ తుది జాబితాను విడుదల చేయనున్నట్లు డీపీఓ శ్రీలత తెలిపారు. ఈ నెల 13న వార్డుల వారీగా ఓటర్ జాబితా ముసాయిదా ప్రదర్శన, 14 నుంచి 21 వరకూ అభ్యంతరాల స్వీకరణ, 18, 19 తేదీల్లో రాజకీయ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. 26న ఓటర్ జాబితాపై వచ్చిన అభ్యంతరాలు స్వీకరించి 28న తుది జాబిత విడుదల చేస్తామని వెల్లడించారు.

News September 6, 2024

విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే హ్యాకథాన్

image

ఉద్యోగాల సాధనకు, ఇంజినీరింగ్ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు హ్యాకథాన్ దోహదపడుతుందని టీసీఎస్ కన్సల్టెంట్ దిబికర్ పాణిగ్రాహి అన్నారు. నర్సాపూర్లోని బీవీఆర్ ఐటీ కళాశాలలో జాతీయస్థాయి 24 గంటల డీమార్ట్ హ్యాకథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోడింగ్ నైపుణ్యాలను ప్రామాణికంగా అంచనా వేయడానికి వచ్చిన కొత్త సాంకేతికతే హ్యాకథాన్ అన్నారు. వ్యవసాయ, ఆరోగ్య, విద్య రంగాల్లో ఉపయోగపడుతుందన్నారు.

News September 6, 2024

వీపనగండ్ల: చోరీ కేసులో తండ్రీకొడుక్కి జైలు శిక్ష

image

చోరీ కేసులో తండ్రీకొడుక్కి వనపర్తి జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది. SI నందికర్ వివరాలు.. పెద్దకొత్తపల్లి మం. కల్వకోలుకు చెందిన తండ్రీకొడుకులు వెంకటస్వామి, గోపాలకృష్ణ 2020లో వీపనగండ్ల మం. తూంకుంటకు చెందిన ఎల్లమ్మ పొలం పనులకు వెళ్తుండగా మెడలోంచి బంగారం గొలుసు ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు కాగా నేరం రుజువు కావడంతో ఇద్దరికి 2 ఏళ్లు జైలు, రూ.200 చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 

News September 6, 2024

భద్రాచలం ఎమ్మెల్యేపై నమోదైన కేసు కొట్టివేత  

image

భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావుకు ప్రథమ శ్రేణి కోర్టులో ఊరట లభించింది. 2018 ఎన్నికల సమయంలో ఆయనపై నమోదైన కేసును కోర్టు కొట్టేసింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన వెంకట్రావు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లకు నగదు పంపిణీ చేయించారని కేసు నమోదైంది. వెంకట్రావుపై పట్టణ పోలీసులు ఏ-2గా చార్జిషీట్ ఫైల్ చేసి కోర్టులో కేసు వేశారు.

News September 6, 2024

ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్: చిన్నారెడ్డి

image

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఇక.. ఇవాల్టి నుంచే విద్యాసంస్థలో ఉచిత విద్యుత్ అమలులోకి వస్తుందని, జీవో కూడా విడుదల చేశామని వెల్లడించారు. విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

News September 6, 2024

సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంగా నీరజ్ అగ్రవాల్ బాధ్యతలు

image

దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా నీరజ్ అగ్రవాల్ గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఆర్ఎస్ఈ) 1987 బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుత నియామకానికి ముందు ఆయన దక్షిణ మధ్య రైల్వే నిర్మాణ విభాగంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు.

HYD: పకడ్బందీగా ఓటరు జాబితా ప్రక్షాళన: సుదర్శన్‌రెడ్డి

image

బీఎల్‌వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబరు 29న, తుది జాబితాను జనవరి 6న ప్రచురిస్తామని వెల్లడించారు. గురువారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఓటరు జాబితా ప్రక్షాళనపై రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.