India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD అత్తాపూర్‌లో స్నేహితుల మధ్య వివాదం చెలరేగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సయ్యద్ ముస్తఫా అలీ అనే యువకుడిపై అతడి ఫ్రెండ్స్ అమాన్, అఫాన్ కలిసి దాడి చేశారు. బీర్ బాటిల్‌తో తల పగలగొట్టి, అంతటితో ఆగకుండా కత్తితో ఛాతిలో పొడిచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రజలు దయచేసి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, సేవ చేస్తానని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామారెడ్డి అన్నారు. ఈరోజు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్‌గా సేవ చేసి, మంచి పేరు తెచ్చుకున్నానని, ప్రజా సేవలో ఒక అవకాశం కల్పించాలని కోరారు. 11 ఏళ్లు మెదక్ జిల్లా గడ్డ మీదనే పనిచేశానని, ఇది తన అదృష్టమన్నారు. ఉమ్మడి జిల్లా పీడీగా, జాయింట్ కలెక్టర్‌గా పనిచేశానని తెలిపారు.
బెల్లంపల్లి COE విద్యార్థులు 14 మంది ప్రతిష్ఠాత్మకమైన COEలో సీట్లు సాధించినట్లు ప్రిన్సిపల్ సైదులు తెలిపారు. ప్రీమియర్(స్టేట్) COEలైన గౌలిదొడ్డి, చిలుకూరు, షేక్‌పేట్, అల్గనూర్, ఇబ్రహీం పట్నం COEల్లో 14మంది విద్యార్థులు సీట్లు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో మిగిలిన COEల్లో మరిన్ని సీట్లు సాధిస్తామన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా హైదరాబాద్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.25,66,380 నగదు, రూ.56,39,223 విలువ గల ఇతర వస్తువులను వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు పట్టుకుని సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. ఫ్లయింగ్, ఎస్ఎస్‌టీ బృందాలతో పాటు పోలీస్ శాఖ ముమ్మర తనిఖీలతో పెద్ద మొత్తంలో నగదు, ఇతర వస్తువులు పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా హైదరాబాద్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.25,66,380 నగదు, రూ.56,39,223 విలువ గల ఇతర వస్తువులను వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు పట్టుకుని సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. ఫ్లయింగ్, ఎస్ఎస్‌టీ బృందాలతో పాటు పోలీస్ శాఖ ముమ్మర తనిఖీలతో పెద్ద మొత్తంలో నగదు, ఇతర వస్తువులు పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న తరుణంలో పదకొండవ ఆదివారం మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జానపదుల జాతరకు పెట్టింది పేరు కొమురవెల్లి మల్లన్న జాతర.. పట్నాలు, బోనాలు, డోలు చప్పుళ్లు, ఢమరుక నాథాలు, శివసత్తుల శిగాలు, పోతరాజుల విన్యాసాలు జాతరలో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టారు.
నేను బహుజన ద్రోహిని కాదని RS ప్రవీణ్ కుమార్ అన్నారు. నేడు గద్వాల బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిగిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొంతమంది నన్ను బహుజన ద్రోహిని అని అంటున్నారు. నేను నిజంగా బహుజన ద్రోహినే అయితే ఎన్నో పదవులను అనుభవించే వాడిని. బహుజన జాతికి సేవ చేసేందుకే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చా’ అని RSP క్లారిటి ఇచ్చారు.
పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణ శివారులోని దివ్యబాల హైస్కూల్లో ఏప్రిల్ 3 నుంచి 11 వరకు స్పాట్ వాల్యుయేషన్ జరగనుంది. 9రోజుల వ్యవధిలో 1,48,000 జవాబు పత్రాలను దిద్దనున్నారు. పత్రాలను దిద్దేందుకు 600 అసిస్టెంట్ ఎగ్జామినర్లను , 200 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. ప్రతిరోజు ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్కు 40 పేపర్లు దిద్దేందుకు ఇవ్వనున్నారు.
జిల్లాలో ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌తో పాటు ఖమ్మంరూరల్, కూసుమంచి, మధిర, సత్తుపల్లి, వైరా, కల్లూరు, కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, ఇల్లెందులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి 47,102 డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయగా రూ.227.34కోట్ల ఆదాయం వచ్చింది. ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోనే అత్యధికంగా రూ.108.65 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం.
నిజాంసాగర్‌లోని నవోదయలో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశానికి జనవరి 20న పరీక్ష నిర్వహించారు. cbseit.in వెబ్ సైట్‌లో రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ సత్యవతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
Sorry, no posts matched your criteria.