India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భార్య చూస్తుండగానే చెరువులో మునిగి భర్త మృతి చెందిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాచుపల్లి పెట్రోల్ బంకు సమీపంలో హన్మంత్, కల్పన దంపతులు ఉంటున్నారు. శనివారం వారు భైరుని చెరువుకి వెళ్లారు. కల్పన ఒడ్డున నిల్చోగా.. హన్మంత్ స్నానానికి నీటిలోకి దిగి ఎంతకీ తిరిగి రాలేదు. సాయంత్రం మృతదేహం లభ్యమైంది.

జగిత్యాల పట్టణంలో జోరుగా హైటెక్ వ్యభిచారం కొనసాగుతుంది. అందమైన యువతులు, మహిళల ఫొటోలను దళారులు వాట్సాప్ స్టేటస్గా పెట్టి యువతను ఆకర్షిస్తున్నారు. కేవలం తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఈ హైటెక్ వ్యభిచారం నడిపిస్తున్నట్లు సమాచారం. పోలీస్ అధికారులు ఇలాంటి దళారులపై నిఘా పెట్టినట్లు తెలిపారు. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన సిర్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ కథనం ప్రకారం.. బిలాస్పూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న రైలులో ఝార్ఖండ్ రాష్ట్రం గర్వ జిల్లా తెనర్కు చెందిన దిలీప్ కుమార్ సింగ్ ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
అన్ని రంగాలతో పాటు వైద్యం కూడా వ్యాపారంగా మారింది. వైద్యులు ఆస్పత్రిని ఏర్పాటు చేసి నిర్వహించేవారు. సిద్దిపేటలో మాత్రం మేనేజ్‌మెంట్‌కు వైద్యం సంబంధం లేకున్నా ఆస్పత్రిని ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను తీసుకొచ్చి కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 158 ఆస్పత్రులు ఉంటే.. అందులో సగం వరకు వైద్యంతో సంబంధంలేని వారే నిర్వాహకులుగా ఉన్నారు. కాసుల కోసం అనవసర టెస్టులు, స్కానింగ్‌లు చేస్తున్నారు.
ఎన్నికల విధులు పూర్తి అవగాహనతో నిర్వర్తించినప్పుడే ఎలాంటి పొరపాట్లు జరగవని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. బంజారాభవన్‌లో శనివారం సెక్టర్ ఆఫీసర్లు, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్స్‌కు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు వేసేలా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్చాపుర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. నర్సంపేట పట్టణానికి చెందిన ప్రభాకర్, శామ్యూల్ శనివారం రాత్రి బైక్‌పై వరంగల్‌కు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఎడ్ల బండిని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు ఆటంకం కలిగింది. తిరుమలాయపాలెం మండలంలో ఓపెన్ కాలువతోపాటు సొరంగ మార్గం ఏర్పాటు చేస్తున్న క్రమంలో సమీపంలో వాగు ఉండటంతో భూగర్భ జలాలు పెద్ద మొత్తంలో నిర్మాణ కాలువలోకి ఉబికి వస్తున్నాయి. ఆ నీటితో టన్నెల్ నిండింది. దీంతో పనులకు ఆంటంకం కలుగుతోంది.
రోడ్డుప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. దేవరకొండ మండలం మైనంపల్లి స్టేజి వద్ద శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. చందంపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు బైక్‌పై వెళుతున్నాడు. ఆటో ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అశోక్ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.