Telangana

News July 21, 2024

ఆర్మూర్ ఎమ్మెల్యే లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం

image

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సుల లేఖను పరిగణనలోకి తీసుకోవాలని 15 రోజుల క్రితం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ లేఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని దేవదాయ శాఖకు సూచించినట్లు ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు.

News July 21, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైరల్ ఫియర్

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యాధులు ముసుకురుకుంటున్నాయి. కురుస్తున్న వర్షాలతో పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం పడకేసింది. డ్రైనేజీలు, వీధుల్లో మురుగు పేరుకుపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమలతో సీజనల్‌ వ్యాధులు ప్రబలి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఎక్కడ చూసినా ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. జ్వరాల బారిన పడి ప్రజలు ఆసుపత్రులపాలవుతున్నారు.

News July 21, 2024

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

image

భద్రాచలం వద్ద రాత్రి 9 గంటలకు గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరుకుంది. ఎగువనున్న ప్రాజెక్టులో నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో గోదావరి నీటిమట్టం గంటకు పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. మరో నాలుగు అడుగులు నీటిమట్టం పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

News July 21, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ సైదాపూర్ మండలంలో పాముకాటుతో యువతీ మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం. @ వేములవాడ సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ. @ భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే. @ కరీంనగర్ లో గోరింటాకు వేడుక.

News July 21, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని TOP న్యూస్

image

◆ ఆసిఫాబాద్ : ప్రమాదపు అంచున అడ ప్రాజెక్టు
◆ నిర్మల్ : సొంత ఇంట్లోనే చోరీ.. భర్త అరెస్ట్
◆ సిర్పూర్ : అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి
◆ ఆదిలాబాద్ : ఎనిమిది మంది పేకటారాయుళ్లు అరెస్ట్
◆ దహెగం : వాగులో వ్యక్తి మృతదేహం లభ్యం
◆ బెజ్జూర్ : భారీ వర్షాలతో 10 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
◆ ఉట్నూర్ : చిన్నారికి జ్వరం ప్రమాదకరంగా వాగు దాటుతూ
◆ నిర్మల్ : గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యం
★ భారీ వర్ష సూచన

News July 21, 2024

కడెం ప్రాజెక్టు అప్డేట్.. 10 వేల క్యూసెక్కుల నీటి విడుదల

image

కడెం ప్రాజెక్టు ద్వారా దిగువకు 10 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలలో వర్షాలు తగ్గడంతో కడెం ప్రాజెక్టులోకి ఆదివారం రాత్రి 10 గంటలకు 6,941 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టులోని రెండు గేట్ల ద్వారా కుడి, ఎడమ కాలువలతో పాటు దిగువ గోదావరిలోకి మొత్తం 10,545 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు తగ్గడంతో కడెం ప్రాజెక్టులోకి వచ్చే వరద నీరు తగ్గింది.

News July 21, 2024

ఆదిలాబాద్ ప్రజలకు కలెక్టర్ కీలక సూచనలు

image

జిల్లాలో గత రెండు రోజులుగా భారీ నుండి అతిభారీ వర్షాల కురుస్తున్న కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదల కారణంగా నష్టాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లాలోని చెరువు కట్టలు కుంటలు తెగిపోకుండ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకుండ చర్యలు తీసుకోవాలన్నారు.

News July 21, 2024

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌

image

కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పాతపాట పాడారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉత్తమ్‌ అవాకులు చెవాకులు పేలి.. తన అవగాహన రాహిత్యాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని ఆయన విమర్శించారు.

News July 21, 2024

సౌదీలో బేగంపేట వాసి మృతి

image

బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన రాగి రవి (55) అనే వ్యక్తి సౌదీలో ఈనెల 13న అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాగి రవి గత 16 ఏళ్లుగా సౌదీలో ఉంటున్నాడు. అక్కడ గొర్ల కాపరి, వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం స్వగ్రామానికి వచ్చి మళ్లీ తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన అనారోగ్యంతో మృతిచెందినట్లు అక్కడి ఆయన స్నేహితుల ద్వారా తెలిసింది.

News July 21, 2024

మాక్లూర్: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

image

జీవితంపై విరక్తితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మాక్లూర్ ఎస్ఐ సుదీర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాణిక్ భండార్ తండాకు చెందిన 20 ఏళ్ల యువతికి చిన్న నాటి నుంచి కళ్ళు సరిగ్గా కనిపించవని, మానసిక స్థితి కూడా సరిగ్గా లేదన్నారు. దీనితో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు.