India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరంలోని స్థానిక ఆధార్ సెంటర్లకు వెళ్లి మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. బ్యాంక్ సీడింగ్, డాక్యుమెంట్, అప్డేట్ ఆధార్, ఈ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ వంటి సేవలు పొందడం కోసం మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం ముఖ్యమన్నారు. రూ.50 చెల్లించి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చని, వెబ్‌లింక్ bhuvan-app3.nrsc.gov.in/aadhaar ద్వారా ఆధార్ సెంటర్లను చూసుకోండి.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన చైతన్యపురి PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NGKL జిల్లా అచ్చంపేట (M) చేదురుబావి తండాకు చెందిన వేణుశ్రీ శ్రీచైతన్య కాలేజీలో సెకండియర్ చదువుతోంది. శనివారం తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. స్నేహితులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కళాశాల యాజమాన్యం వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు యత్నించిందని తల్లిదండ్రులు ఆరోపించారు.
HYD నగరంలోని స్థానిక ఆధార్ సెంటర్లకు వెళ్లి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలని HYD ఆధార్ సెంటర్ అధికారులు చూపించారు. బ్యాంక్ సీడింగ్, డాక్యుమెంట్, అప్డేట్ ఆధార్, ఈ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ వంటి సేవలు పొందడం కోసం మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం ముఖ్యమన్నారు. రూ.50 చెల్లించి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చని, వెబ్‌లింక్ bhuvan-app3.nrsc.gov.in/aadhaar ద్వారా ఆధార్ సెంటర్లను చూసుకోండి.
సికింద్రాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం బోనం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ పూజారులు శాలువాతో సన్మానించి ప్రత్యేక పూజలు అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
గ్రేటర్ HYDలో వరదలు ముంచెత్తినప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు DRF ఆధ్వర్యంలో నూతన టెక్నాలజీ వాడనున్నారు. ఇందులో భాగంగానే ఫైర్ ఫైటింగ్ రోబోట్లు, సోనార్ స్కానర్, రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్, టెక్నాలజీ యూనిట్‌లను అందుబాటులోకి తేనున్నారు. ఈ టెక్నాలజీ సాయంతో ఆపదలో ఉన్నవారిని కాపడటమే కాకుండా క్లిష్ట పరిస్థితుల్లో సిబ్బందికి ప్రత్యామ్నాయంగా సహకరిస్తుంది.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు గడువు రేపటితో ముగియనున్నట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జులై 22 లోపు ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఫీజు చెల్లించాలని సూచించారు. మీసేవ, TG ఆన్‌లైన్ సెంటర్‌లలో ఫీజు చెల్లించవచ్చన్నారు. PG రెండో సంవత్సర పరీక్షలు ఆగస్టు 20 నుంచి, PG మొదటి సంవత్సరం పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
గ్రేటర్ HYDలో వరదలు ముంచెత్తినప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు DRF ఆధ్వర్యంలో నూతన టెక్నాలజీ వాడనున్నారు. ఇందులో భాగంగానే ఫైర్ ఫైటింగ్ రోబోట్లు, సోనార్ స్కానర్, రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్, టెక్నాలజీ యూనిట్‌లను అందుబాటులోకి తేనున్నారు. ఈ టెక్నాలజీ సాయంతో ఆపదలో ఉన్నవారిని కాపడటమే కాకుండా క్లిష్ట పరిస్థితుల్లో సిబ్బందికి ప్రత్యామ్నాయంగా సహకరిస్తుంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఇన్స్పైర్ అవార్డుల నామినేషన్ ప్రక్రియ కొరకు విద్యార్థులు నమోదుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు నామినేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదిలాబాద్ DEO ప్రణీత పేర్కొన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు ఐడియా కాంపిటీషన్ నిర్వహించాలని, ఐడియా బాక్సులు కూడా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎంపికైన ఆలోచనలకు రూ.10వేలు విద్యార్ధుల వ్యక్తిగత ఖాతాలో జమ చేయబడుతుందని తెలిపారు.
ఏటూరునాగారం మండలం దొడ్ల- మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపిలేని కుండపోత వర్షాలతో వాగుకు వరద పోటెత్తింది. దీంతో లోతట్టు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కాగా ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు. గతేడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు వాగు పొంగి 8 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. ఏ సమయంలో అయినా ఎలాంటి ప్రమాదం తలెత్తిన క్షణాలలో అక్కడకు చేరుకొనే విధంగా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉన్నదని సిబ్బందన్నారు. విపత్కర సమయాల్లో సహాయం కోసం పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 87126 57888, డయల్ 100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడతామన్నారు.
Sorry, no posts matched your criteria.