Telangana

News September 6, 2024

సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంగా నీరజ్ అగ్రవాల్ బాధ్యతలు 

image

దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా నీరజ్ అగ్రవాల్ గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఆర్ఎస్ఈ) 1987 బ్యాచ్‌కు చెందిన అధికారి. ప్రస్తుత నియామకానికి ముందు ఆయన దక్షిణ మధ్య రైల్వే నిర్మాణ విభాగంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు.

News September 6, 2024

HYD: పకడ్బందీగా ఓటరు జాబితా ప్రక్షాళన: సుదర్శన్‌రెడ్డి

image

బీఎల్‌వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబరు 29న, తుది జాబితాను జనవరి 6న ప్రచురిస్తామని వెల్లడించారు. గురువారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఓటరు జాబితా ప్రక్షాళనపై రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 6, 2024

HYD: పకడ్బందీగా ఓటరు జాబితా ప్రక్షాళన: సుదర్శన్‌రెడ్డి

image

బీఎల్‌వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబరు 29న, తుది జాబితాను జనవరి 6న ప్రచురిస్తామని వెల్లడించారు. గురువారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఓటరు జాబితా ప్రక్షాళనపై రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 6, 2024

కరీంనగర్: నిప్పంటించుకుని ఒకరి ఆత్మహత్య

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్ఎండి SI వివేక్ వివరాల ప్రకారం.. KNRలోని గణేశ్ నగర్‌లో నివాసం ఉంటున్న సత్తు రఘు(48) పట్టణంలోని ఓ హోటల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇంటి నుంచి బయలుదేరి ఇందిరా నగర్ గ్రామ శివారులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

News September 6, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రులు పర్యటన
∆} ఖమ్మం వరద బాధితులకు నేటి నుంచి నగదు పంపిణీ
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} అశ్వరావుపేట లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యాటన
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కి సెలవు
∆} వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల, పొంగులేటి పర్యటన

News September 6, 2024

ఉపాధ్యాయులు సమాజ సంస్కర్తలు: మంత్రి జూపల్లి

image

ఉపాధ్యాయులు సమాజాన్ని సంస్కరించే వ్యక్తులు అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూల్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. మనిషి తనకు తాను సంస్కరించుకొని సమాజపురోభివృద్ధికి పాటుపడే విధంగా వ్యక్తులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు. విద్యార్థులలో నిత్యం ప్రేరణకలిగిస్తూ, వారి తల్లిదండ్రులలోనూ పరోక్షంగా ప్రేరణ కల్పించే విధంగా ఉపాధ్యాయుల బోధన ఉండాలని సూచించారు.

News September 6, 2024

ఆదిలాబాద్: పోలీసుల గుప్పిట్లో ఏజెన్సీ

image

జైనూర్‌లో జరిగిన ఘర్షణతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జైనూర్‌ను పూర్తిగా అదుపులోకి తీసుకొని కొత్తవారిని రానివ్వకుండా జాగ్రత్తపడుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మీదుగా వెళ్లే బస్సులను రద్దు చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అడిషనల్ DG మహేశ్ భగవత్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, SP గౌష్ ఆలం, SP శ్రీనివాసరావు, ఇతర అధికారులతో చర్చలు జరిపారు.

News September 6, 2024

NLG: డీసీసీబీ జీఎంపై సస్పెన్షన్ వేటు

image

ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార బ్యాంకు జీఎం నర్మదపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సహకార డైరెక్టర్, రిజిస్ట్రార్ ఉత్తర్వులను వెలువరించారు. ఖమ్మం జిల్లాలో బ్యాంకు రుణమాఫీ విషయంలో జరిగిన ఆరోపణలపై విధుల నుంచి తొలగించినట్లు తెలిసింది. రెండు నెలల క్రితం జీఎం నర్మద ఖమ్మం నుంచి నల్గొండకు బదిలీపై వచ్చిన విషయం తెలిసిందే.

News September 6, 2024

జమ్మికుంట మార్కెట్లో రికార్డు స్థాయిలో పత్తి ధర

image

ఉత్తర తెలంగాణలోని పేరు పొందిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.7,600 రికార్డు ధర పలికింది. మార్కెట్ యార్డుకు విడి పత్తి విక్రయానికి తీసుకువచ్చారు. ప్రైవేట్ ట్రేడర్స్ బహిరంగ వేలం పాట ద్వారా గరిష్ఠ ధర రూ.7,600 చొప్పున పత్తి కొనుగోళ్లు చేపట్టారు. కనిష్ఠంగా రూ.7300 పలికింది. పత్తికి అధిక ధర పలకడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 6, 2024

నేడు వరంగల్‌లో నిర్వహించాల్సిన జాబ్ మేళా వాయిదా

image

వరంగల్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నేడు నిర్వహించాల్సిన జాబ్ మేళా రద్దు అయినట్లు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జాబ్ మేళాను వాయిదా వేసినట్లు వారు తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో త్వరలో తెలుపుతాం అన్నారు.