Telangana

News March 30, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు 200 ఓట్ల మెజార్టీ..?

image

ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి 200 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థికి 200 ఓట్ల మెజార్టీ సాధ్యమేనా అనే చర్చ సాగుతుంది. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 800కు పైగా ఓట్లు ఉంటే కాంగ్రెస్‌కు 400 పైచిలుకు ఓట్లు ఉన్నాయి.

News March 30, 2024

కత్తిమీద సాములా మెదక్ MP స్థానం..!

image

మెదక్ పార్లమెంట్ బరిలో BRS తరఫున వెంకట్రామిరెడ్డి, BJP నుంచి రఘునందన్రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు తలపడనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా కావడంతో గులాబీ శ్రేణులు, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో హస్తం నేతలు, ఈసారైనా దక్కించుకోవాలని బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు. కామెంట్ చేయండి

News March 30, 2024

గద్వాల: గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: మల్లు రవి

image

లోక్ సభ ఎన్నికల్లో తన గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి పేర్కొన్నారు. గద్వాల కేఎస్ ఫంక్షన్ హాల్లో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు వంత పాడుతూ ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు.

News March 30, 2024

HYD: లంచం తీసుకుంటూ దొరికిన SI

image

మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ACB అధికారులు సోదాలు జరిపారు. రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా SI సైదులుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ స్థలం విషయంలో సుభాశ్ అనే వ్యక్తిని ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శనివారం ACB రైడ్స్ చేసింది. ఆయన ఇంట్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

News March 30, 2024

HYD: లంచం తీసుకుంటూ దొరికిన SI

image

మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ACB అధికారులు సోదాలు జరిపారు. రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా SI సైదులుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ స్థలం విషయంలో సుభాశ్ అనే వ్యక్తిని ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శనివారం ACB రైడ్స్ చేసింది. ఆయన ఇంట్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

News March 30, 2024

సుగుణక్క గెలుపునకు పూర్తి సహకారం: రేఖా నాయక్

image

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణక్క గెలుపునకు పూర్తిగా సహకరిస్తానని ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ అన్నారు. శనివారం పట్టణంలో ఆమెను రేఖా నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీగా సుగుణక్కను గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. ఆమెతో పాటు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, తదితరులు ఉన్నారు.

News March 30, 2024

NZB: హమ్మయ్యా.. పరీక్షలు ముగిశాయి

image

పదో తరగతి పరీక్షలు శనివారంతో ముగిశాయి. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఇన్నాళ్లు పుస్తకాలు పట్టుకొని చదివిన విద్యార్థులు హమ్మయ్యా.. పరీక్షలు ముగిశాయని సంబర పడ్డారు. కొంత మంది కేరింతలు కొడుతూ.. పేపర్లు చింపి గాల్లో ఎగరవేస్తూ సందడి చేశారు. పరీక్షలు ముగియడంతో మిత్రులకు వీడ్కోలు పలుకుతూ..వెళ్లారు.

News March 30, 2024

MBNR: గురుకుల కళాశాలలో 2,160 సీట్లు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బాలుర గురుకుల కళాశాలలు 12, బాలికల గురుకుల కళాశాలలు 13 వంతున మొత్తం 25 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఎసీ, ఎంఈసీ, వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బాలురకు 1,040, బాలికలకు 1,120 సీట్లు ఉన్నాయి. BCలకు 75%, SCలకు 15%, STలకు 5%, OC/EBCలకు 2%, అనాథలకు 3% సీట్లు కేటాయించారు.

News March 30, 2024

నిజామాబాద్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వనం

image

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు చెందిన మహిళలు, నిరుద్యోగ యువతులకు వివిధ రకాల ఉచిత శిక్షణల కోసం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ డైరక్టర్ సుంకం శ్రీనివాస్ తెలిపారు. తెల్ల రేషన్ కార్డు, 19 నుంచి 45 ఏళ్ల వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. శిక్షణ సమయంలో నెలపాటు వసతి, భోజనం, టూల్‌కిట్స్ ఉచితంగా అందిస్తామన్నారు.

News March 30, 2024

ఎర్రబెల్లి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

image

మాజీ మంత్రి ఎర్రబెల్లి కారును శనివారం పోలీసులు తనిఖీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్‌లో భాగంగా జాఫర్‌గడ్‌లో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అటుగా వెళ్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీ చేశారు. అధికారులకు ఆయన పూర్తి సహకారం అందించినట్లు పేర్కొన్నారు.