Telangana

News July 21, 2024

భద్రకాళి అమ్మవారికి 3.50 టన్నుల కూరగాయలతో అలంకరణ

image

భద్రకాళి అమ్మ వారి శాకంబరి ఉత్సవం ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 3.50టన్నుల కూరగాయలు, 400కిలోల పండ్లు, 200కిలోల ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించనున్నారు. నేడు శ్రీభద్రకాళి అమ్మవారి శాకంబరి విశ్వరూప దర్శనం ఉంటుందని కార్యనిర్వహణ అధికారిణి శేషుభారతి, ప్రధానార్చకుడు శేషు తెలిపారు.

News July 21, 2024

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

image

జేగురుకొండ అడవుల్లో శనివారం జరిగిన ఎన్ కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. జేగురుకొండ అడవు ల్లోని సింగవరం, తుమర్ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో డీఆర్డీ బలగాలు కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో ఒక తుపాకీ, ఇతర వస్తువులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చనిపోయిన మావోయిస్టును గుర్తించాల్సి ఉందన్నారు.

News July 21, 2024

హనుమకొండ: 26 నుంచి బీ-ఫార్మసీ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీ-ఫార్మసీ మొదటి, ఏడో సెమిస్టర్ షెడ్యూల్‌ను శనివారం కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్. నరసింహాచారి విడుదల చేశారు. ఈ నెల 26న పేపర్ 1, 27న పేపర్ 2, 30న పేపర్ 3, 31న పేపర్ 4 పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని తెలిపారు.

News July 21, 2024

తాలుపేరు ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తివేత

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని ఉన్న తాలి పేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రాజెక్టుకు ఉన్న 25 గేట్లు మొత్తం ఎత్తి 55,232 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 52,897 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని అధికారులు వెల్లడించారు. ఛత్తీస్ ఘడ్ దండకారణ్యం నుంచి వరదనీరు భారీగా వస్తున్నట్లు వెల్లడించారు.

News July 21, 2024

HYD: వరద నివారణ చర్యల్లో యంత్రాంగం

image

అధికార యంత్రాంగమంతా వరద నివారణ చర్యల్లో ఉందని, 24 గంటలు అత్యవసర బృందాలు పని చేస్తున్నాయని GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య, రోడ్లపై నీరు నిలవడం, చెట్లు కూలడం తదితర ఇబ్బందులపై ఆమె అధికారులతో మాట్లాడారు. జోనల్ సర్కిల్ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. తరచుగా నీరు నిలిచే ప్రాంతాల్లో 238 స్టాటిక్ బృందాలు రోజంతా అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు.

HYD: రూ.5కే టిఫిన్..!

image

గ్రేటర్ HYDలో ప్రస్తుతం 320కి పైగా అన్నపూర్ణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. రోజూ మధ్యాహ్నం రూ.5కే భోజనం అందిస్తున్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం టిఫిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తోడుగా మరో 50 కేంద్రాలను జీహెచ్ఎంసీ పరిధిలో అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు.

News July 21, 2024

37 అడుగులకు చేరిన గోదావరి

image

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు 37 అడుగులకు చేరుకున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలియజేశారు. ఎగువనుంచి వరద ఉద్ధృతి అధికంగా ఉండడంతో గోదావరిలోని వరదనీరు వచ్చి చేరుతుంది. దీంతో క్రమేపీ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఈ మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

News July 21, 2024

HYD: రూ.5కే టిఫిన్..!

image

గ్రేటర్ HYDలో ప్రస్తుతం 320కి పైగా అన్నపూర్ణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. రోజూ మధ్యాహ్నం రూ.5కే భోజనం అందిస్తున్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం టిఫిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తోడుగా మరో 50 కేంద్రాలను జీహెచ్ఎంసీ పరిధిలో అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు.

News July 21, 2024

HYD: నిండుకుండలా హుస్సేన్ సాగర్

image

నగరంలో కురుస్తోన్న ఎడతెరిపిలేని వానతో హుస్సేన్ సాగర్‌కు అన్ని వైపుల నుంచి శనివారం వరద పెరిగింది. 1,517 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, మత్తడి నుంచి 998 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నట్లు GHMC తెలిపింది. భారీగా దిగువకు దూకుతున్న నీటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 514.75 మీ కాగా, సాయంత్రం 6 గంటల సమయానికి 513.23 మీ నీటిమట్టం నమోదైందని అధికారులు తెలిపారు.