India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు 37 అడుగులకు చేరుకున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలియజేశారు. ఎగువనుంచి వరద ఉద్ధృతి అధికంగా ఉండడంతో గోదావరిలోని వరదనీరు వచ్చి చేరుతుంది. దీంతో క్రమేపీ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఈ మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.
గ్రేటర్ HYDలో ప్రస్తుతం 320కి పైగా అన్నపూర్ణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. రోజూ మధ్యాహ్నం రూ.5కే భోజనం అందిస్తున్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం టిఫిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తోడుగా మరో 50 కేంద్రాలను జీహెచ్ఎంసీ పరిధిలో అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు.
నగరంలో కురుస్తోన్న ఎడతెరిపిలేని వానతో హుస్సేన్ సాగర్‌కు అన్ని వైపుల నుంచి శనివారం వరద పెరిగింది. 1,517 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, మత్తడి నుంచి 998 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తున్నట్లు GHMC తెలిపింది. భారీగా దిగువకు దూకుతున్న నీటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 514.75 మీ కాగా, సాయంత్రం 6 గంటల సమయానికి 513.23 మీ నీటిమట్టం నమోదైందని అధికారులు తెలిపారు.
ఆపిల్ ఫోన్ దక్కించుకునేందుకు ఓవ్యక్తి ఏకంగా హత్య చేయబోయిన ఘటన MBNRలో జరిగింది. పోలీసుల వివరాలు.. వీరన్నపేటకు చెందిన సయ్యద్‌మస్తాన్, టీడీగుట్ట ఫైర్‌స్టేషన్‌కు చెందిన అక్తర్ ఫ్రెండ్స్. ఈనెల 12న అక్తర్ ఫోన్‌ను ముస్తాన్ తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఫోన్ తీసుకునేందుకు ముస్తాన్ ఇంటికెళ్లగా కత్తితో పొడిచాడు. అక్తర్‌ను ముళ్లపొదల్లో వేయడానికి బైక్‌పై తీసుకెళ్లి భయంతో క్లాక్ టవర్ వద్ద వదిలి పరారయ్యాడు.
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో 22వ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా అధికారులు వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 3,703 మంది మల్టీపర్పస్ ఉద్యోగుల వేతనాల కోసం రూ. 24.89 కోట్ల నిధులు విడుదలయ్యాయి. నిధులను విడుదల చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాకు రూ. 11,75,72,000, సంగారెడ్డి జిల్లాకు రూ. 8,09,97,000, మెదక్ జిల్లాకు రూ. 5,03,97,500 విడుదలయ్యాయి.
నార్కట్‌పల్లి మండల ఎంపీడీవో కార్యాలయ సూపరిటెండెంట్ కోమటి ప్రదీప్ గుండెపోటుతో మరణించారు. బదిలీ ప్రక్రియలో భాగంగా కౌన్సెలింగ్ కోసం జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్లి అనంతరం హైదరాబాదులో నివాసానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ప్రదీప్ వాంతులు చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారని సన్నిహితులు చెప్పారు.
జిల్లాలో చిన్నారుల కిడ్నాప్‌లు కలకలం రేపుతున్నాయి. తాజాగా NZB GGHలో మూడేళ్ల బాలుడు కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. కాగా జనవరి 30న మాలపల్లికి చెందిన ఏడేళ్ల బాలుడిని ఎత్తుకెళ్లి HYDలో విక్రయించేందుకు చూశారు. ఫిబ్రవరిలో ఆర్మూర్ బస్టాండ్‌లో ఓ మహిళ ఏడేళ్ల బాలుడిని, అదే నెల 4న నగర శివారులో ఓ దంపతులు రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారు. అయితే ఈ కేసులను పోలీసులు ఛేదించి చిన్నారులను కాపాడారు.
బిజినేపల్లి మండలం వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26వ సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష 18, జనవరి, 2025న నిర్వహిస్తామని తెలిపారు.
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం వెలుగు చూసింది. భార్య స్వప్నతో పాటు 10 నెలల కుమార్తెను గణేశ్ అనే వ్యక్తి హతమార్చాడు. అనంతరం అల్వాల్‌లోని రైల్వే ట్రాక్ వద్ద పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలను గాంధీ మార్చురికీ పోలీసులు తరలించారు. మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. కాగా భార్యపై అనుమానంతోనే గణేశ్ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.