India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వివిధ చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వైరా ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుండగా, లంకాసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పోస్తోంది. సత్తుపల్లి నియోజకవర్గంలో దాదాపు అన్ని చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. జలవనరులశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1,054 చెరువులు, చెక్ డ్యామ్లు ఉండగా శనివారం వరకు 385 చెరువులు, చెక్ డ్యాంలు నిండాయి.
సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో దారుణం వెలుగు చూసింది. భార్య స్వప్నతో పాటు 10 నెలల కుమార్తెను గణేశ్ అనే వ్యక్తి హతమార్చాడు. అనంతరం అల్వాల్‌లోని రైల్వే ట్రాక్ వద్ద పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలను గాంధీ మార్చురికీ పోలీసులు తరలించారు. మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. కాగా భార్యపై అనుమానంతోనే గణేశ్ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
క్షేత్రస్థాయి పర్యటనలతో కలెక్టర్ నారాయణరెడ్డి జోరు పెంచారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలు, NLGలోని పలు శాఖల కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ఏళ్లుగా వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడిన బాలసదనం, సఖి, శిశు గృహాల్లో మౌలిక సదుపాయాలకు గత కలెక్టర్ హరిచందన కృషి చేయగా.. ఆ సంప్రదాయాన్ని ప్రస్తుత కలెక్టర్ కొనసాగిస్తున్నారు.
జిల్లాలో ప్రాథమిక విద్యను బోధించేందుకు ఉపాధ్యాయుల కొరత నెలకొంది. కేవలం ఒక్క టీచర్ ఉన్న పాఠశాలలు 234 ఉన్నాయి. విద్యా రంగ పటిష్ఠతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ క్రమంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాయి. కానీ, ఉపాధ్యాయుల కొరత సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఏకోపాధ్యాయ పాఠశాలల విద్యార్థులు పటిష్ఠ బోధనకు దూరమవుతున్నారని వివిధ సర్వేలు తేల్చాయి.
పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందిన మహిళ మృతదేహాన్ని సంచిలో మూటకట్టి పడేసిన ఘటన ఈనెల 8న పారుపల్లిలో జరిగింది. కాగా, ఈ కేసును మంథని సీఐ వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో పోలీసులు ఛేదించారు. అప్పు నుంచి తప్పించుకోవడానికి అమ్ము రజితను ఆమె భర్త తిరుపతి గొంతు నులిమి చంపగా, జేసీబీ డ్రైవర్ రవి సంచిలో మూటకట్టి బావిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రులు చనిపోయారని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. హసనపర్తి మండలం పెగడపల్లికి గ్రామానికి చెందిన పిన్నింటి హరీశ్(30) తల్లిదండ్రులు కొంత కాలం క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి ఇంటిలో ఒక్కడే ఉంటూ మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈనెల 18న పురుగు మందు తాగాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కేసు నమోదైంది.
ఖమ్మం జిల్లాలో వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చేందుకు అధికంగా ఉన్న పాఠశాలల నుంచి సర్దుబాటు చేశారు. ఈ మేరకు 150 మంది ఉపాధ్యాయులను గుర్తించగా శనివారం జాబితాను ఉన్నతాధికారులకు పంపించినట్లు డీఈఓ సోమశేఖర్ శర్మ తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో ఆమోదం రాగానే వారిని అవసరమైన పాఠశాలలకు కేటాయించనుండగా సబ్జెక్టు టీచర్ల కొరత తీరుతుందని వెల్లడించారు.
మహబూబ్‌నగర్ పట్టణంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో కొనసాగుతున్న ఆన్ లైన్ డీఎస్సీ పరీక్షలకు శనివారం 475 మందికి గాను 405 మంది హాజరైనట్లు డీఈఓ రవీందర్ తెలిపారు. ఉదయం మధ్యాహ్నం రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని 70 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజురోజుకి రోడ్డు ప్రమాద ఘటనలు భయంకరంగా పెరుగుతున్నాయి. నిత్యం రోడ్డుప్రమాదాలలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలు అజాగ్రత్త, అతివేగం, మద్యపానం చేసి వాహనాలు నడపడమేనని పోలీసులు, అధికారులు భావిస్తున్నారు.
భారీ వర్షాల వల్ల ప్రజలు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా తడిసిన మోటార్లతో రైతులు జాగ్రత్త వహించాలని చెప్పారు. ప్రజలు ఇంటి సర్వీస్ వైర్లని కాని, వాటితో వేలాడే ఇనుప తీగలను కానీ బట్టలు ఆరేసుకునే తీగలకు దగ్గరలో విద్యుత్ వైర్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే విద్యుత్ అధికారులకు తెలపాలని కోరారు.
Sorry, no posts matched your criteria.