Telangana

News September 6, 2024

నాగార్జునసాగర్ సమాచారం

image

పూర్తి స్థాయి నీటిమట్టం: 590 అడుగులు
ఇన్ ఫ్లో: 54,917 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 38,361 క్యూసెక్కులు
విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా: 29,232 క్యూసెక్కులు
కుడికాల్వ ద్వారా: 8,529 క్యూసెక్కులు
ఎడమ కాల్వ ద్వారా: నిల్
ఏఎమ్మార్పీకి: నిల్
వరద కాల్వకు: 600 క్యూసెక్కులు

News September 6, 2024

యాదాద్రి క్షేత్రంలో ఇవాళ చండీ హోమం

image

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గంలకు మహా చండి హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

News September 6, 2024

మళ్లీ సాగు చేయండి: మంత్రి తుమ్మల

image

ఎర్రుపాలెం మండలం మీనవోలులోని వరద ముప్పు ప్రాంతాలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పంట పొలాలను పరిశీలించి నష్ట వివరాలను తెలుసుకున్నారు. వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. నష్టపోయిన పంటలను తిరిగి వేసుకోవాలని రైతులకు సూచించారు.

News September 6, 2024

మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

మహిళల భద్రత కోసమే షీ టీమ్ పని చేస్తుందని, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని SP గిరిధర్ హెచ్చరించారు. గురువారం సైబర్ సెక్యూరిటీ DSP రత్నం, షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లామెడికల్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి SP ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఆపద సమయంలో డయల్ 100, షీ టీమ్ జిల్లా నెంబరును 6303923211 సంప్రదించాలన్నారు.

News September 6, 2024

జనగాం: ఉపాధ్యాయ వృత్తి సవాల్ లాంటిది: కలెక్టర్

image

ఉపాధ్యాయ వృత్తి సవాల్ లాంటిదని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సహనం, ఓర్పు, సమన్వయంతో పనిచేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అయ్యేలా కృషి చేయాలన్నారు.

News September 6, 2024

HYD నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం.. జాగ్రత్త!

image

నగరంలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. నారాయణగూడ IPM బృందం 4 కేసుల్ని నిర్ధారించింది. మాదాపూర్‌లో నివాసం ఉంటున్న పశ్చిమబెంగాల్‌కి చెందిన వ్యక్తికి, టోలీచౌకికి చెందిన మరో వృద్ధుడు, హైదర్‌నగర్‌కు చెందిన మహిళ, జార్ఖండ్ నుంచి HYD వచ్చిన ఓ మహిళకు ఫ్లూ సోకినట్లు తేల్చింది. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ఒళ్లునొప్పులు, తలనొప్పి, వాంతులు లాంటి లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.

News September 6, 2024

9 నెలలుగా తెలంగాణలో స్వాతంత్రం లేదు: జీవన్ రెడ్డి

image

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్ట్‌ను నిజామాబాద్ BRS జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్ర‌జా పాల‌న అంటే ప్ర‌శ్నించే వాళ్ల గొంతు నొక్క‌డ‌మేనా..? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఆయన సూటిగా ప్ర‌శ్నించారు. 9 నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదన్నారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న దిలీప్‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

News September 6, 2024

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి: ఎంపీ వంశీకృష్ణ

image

మందమర్రి పట్టణంలోని ఇందూ గార్డెన్స్‌లో గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు.

News September 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
✒కల్వకుర్తి: తండ్రి మందలించాడని ఉరేసుకున్న బాలుడు
✒దేవరకద్ర MLAకు పితృవియోగం
✒పలుచోట్ల భారీ వర్షాలు
✒GDWL:విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి
✒పండుగలను శాంతియుతంగా జరుపుకోండి:CIలు
✒ప్రతి పోలింగ్ బూత్‌కు 200 సభ్యత్వాలు చేర్పించాలి:BJP
✒సీజనల్ వ్యాధులపై అవగాహన
✒మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
✒ఓటర్ల జాబితా పై ప్రత్యేక ఫోకస్

News September 5, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> WGL: రాయపర్తిలో దొంగల బీభత్సం
> BHPL: గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
> MLG: పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురి అరెస్ట్
> BHPL: చెరువులో పడి పశువుల కాపరి మృతి
> JN: ఎమ్మార్వో ఆఫీస్ ముందు పురుగు మందుతో మహిళా ఆందోళన
> MLG: జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం
> HNK: స్వగ్రామానికి చేరుకున్న మావోయిస్టు మృతదేహం
> WGL: బాలికను వేధించిన కేసులో యువకుడిపై పోక్సో కేసు