Telangana

News March 29, 2024

దేవరకొండ: వ్యక్తి ఖాతా నుండి ఏడు లక్షలు మాయం

image

బ్యాంక్ ఖాతా నుండి 7లక్షలు చోరీ జరిగిన ఘటన ముదిగొండ పంజాబ్ నేషనల్ బ్యాంకులో గురువారం జరిగింది. ముదిగొండ గ్రామానికి చెందిన మారుపాకల బాలయ్య అకౌంట్ నుండి 7లక్షలు డెబిట్ అయినట్టు మెసేజ్ రావడంతో బ్యాంకు వారిని సంప్రదిస్తే ఆన్‌లైన్ ఫ్రాడ్ జరిగిందని, పూర్తి వివరాలు చెప్పడం లేదన్నారు. 20 రోజుల క్రితం మరో వ్యక్తి అకౌంట్‌ నుండి రూ.70వేలు డ్రా అయ్యాయని, బ్యాంక్ అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

News March 29, 2024

MBNR: జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

image

CRPF జవాన్ విష్ణు మృతితో హన్వాడ మండలం వేపూర్‌ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోల్‌కతా సరిహద్దుల్లో విధి నిర్వహణలో చనిపోయినట్లు వచ్చిన సమాచారంతో విష్ణు సోదరుడు శేఖర్ మరో ఇద్దరితో కలిసి అక్కడికి వెళ్లినట్లు తెలిసింది. అయితే విష్ణు 18నెలల క్రితమే ఈ ఉద్యోగం సాధించాడని, ప్రొబేషన్ పూర్తికాగా ఇటీవలే పోలీసులు వ్యక్తిగత వివరాలపై విచారణ జరిపారని ఇంతలోనే ఇలా జరిగిందని వారు వాపోయారు.

News March 29, 2024

జగిత్యాల ఎమ్మెల్యేకు పితృ వియోగం

image

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి, సీనియర్ న్యాయవాది మాకునూరి హన్మంతరావు కొద్దిసేపటి క్రితం మరణించారు. పార్థివదేహాన్ని హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఎమ్మెల్యే గృహంలో ఉంచారు. కాగా, ఈరోజు రాత్రి 8 గంటలకు మోతే శ్మశానవాటిక(శంకర్ ఘాట్)లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పలువురు ప్రముఖులు పరామర్శించారు.

News March 29, 2024

సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన బండి సంజయ్

image

సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, కోరారు. విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని కోరారు. గత 27 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించి సమ్మె విరమింపచేసేలా కృషి చేయాలని లేఖలో పేర్కొన్నారు.

News March 29, 2024

భరత్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎల్లేని సుధాకర్

image

నాగర్ కర్నూల్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి భరత్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశం అభివృద్ధి పథంలో మరింత దూసుకెళ్లాలంటే మోదీని 3వ సారి ప్రధానిగా ఎన్నుకోవాలని, మోదీ తీసుకొనే అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలతో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అన్నారు.

News March 29, 2024

నెల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో మారిన రాజకీయాలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే BRS కీలక నేతలు పార్టీ వీడటంతో KCRకి ఊహించని షాకులు తగులుతున్నాయి. మాజీ MLA ఆరూరి రమేష్, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌లు BJPలో చేరగా.. వరంగల్ ఎంపీ దయాకర్, DCCB ఛైర్మన్ మార్నెని రవీందర్, పలువురు MPPలు కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు MLA కడియం, ఆయన కుమార్తె కావ్యలు సైతం పార్టీని వీడుతుండటంతో BRSకు కోలుకోని దెబ్బ తగిలింది.

News March 29, 2024

HYD: రేపే KTR పాదయాత్ర..!

image

పార్లమెంట్ ఎన్నికలపై BRS అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. సభలు, ర్యాలీలతో పాటు ఈసారి పాదయాత్ర చేసేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30వ తేదీ శనివారం సా.5 గంటలకు KTR పాదయాత్ర HYD అంబర్‌పేట్‌లో జరగనుందని MLA కాలేరు వెంకటేశ్ తెలిపారు. BRS శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని MLA పిలుపునిచ్చారు. సత్తా చాటేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలని అన్నారు.

News March 29, 2024

NZB: కుక్క కాటుతో వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుక్కకాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. నందిపేట లక్కంపల్లి సెజ్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహేశ్(36)ను ఈ నెల 10న విధుల్లో ఉన్న సమయంలో కుక్క కరిచింది. నందిపేట PHCలో టీకాలు ఇప్పించుకున్నాడు. అనంతరం తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స నిమిత్తం ఇవాళ మృతి చెందాడు.

News March 29, 2024

HYD: రేపే KTR పాదయాత్ర..!

image

పార్లమెంట్ ఎన్నికలపై BRS అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. సభలు, ర్యాలీలతో పాటు ఈసారి పాదయాత్ర చేసేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30వ తేదీ శనివారం సా.5 గంటలకు KTR పాదయాత్ర HYD అంబర్‌పేట్‌లో జరగనుందని MLA కాలేరు వెంకటేశ్ తెలిపారు. BRS శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని MLA పిలుపునిచ్చారు. సత్తా చాటేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలని అన్నారు.

News March 29, 2024

NLG: పార్లమెంట్ ఎన్నికల్లో ఇక హోరాహోరీగా పోరు!

image

ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశారు. గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ప్రారంభించాలని ఆయా పార్టీల అభ్యర్థులు వ్యూహాలు పన్నుతున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో గ్రామాలు, మండలాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది.