Telangana

News July 21, 2024

HYD: ఉజ్జయిని మహంకాళి అరుదైన ఫొటో

image

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి‌ అమ్మవారి ఆషాఢమాస బోనాలు‌ అంగరంగ వైభవంగా‌ జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము‌ నుంచే మహిళలు‌ బోనాలతో‌ ఆలయానికి చేరుకుంటున్నారు. తల్లి దర్శనం కోసం సాధారణ భక్తులు క్యూ కట్టారు. మోండా మార్కెట్‌ నుంచి‌ మహంకాళి‌ టెంపుల్‌ వరకు అంతా సందడి‌గా మారింది. ఇటువంటి పర్వదినం రోజున 1850 నాటి అమ్మవారి అరుదైన ఫొటో‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.

News July 21, 2024

ADB: ముంభై పోలీసులమంటూ వైద్యురాలికి టోకరా

image

ఈనెల 12న ADB రిమ్స్ వైద్యురాలికి తాము ముంబై పోలీసులమని చెబుతూ ఫోన్ వచ్చింది. ‘మీ ఐడీపై నేరాలు నమోదయ్యాయి’ అని చెప్పడంతో భయంతో వారి మాటలు నమ్మిన ఆమె రూ.3.40 లక్షలు బదిలీ చేశారు. ఆ తర్వాత ఆ నంబర్‌కు ఆమె ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రూ.లక్ష హోల్డ్ చేయగా శనివారం మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

News July 21, 2024

NLG: ఫిర్యాదుల విభాగాలు ఏర్పాటు చేయాలి: జిల్లా కలెక్టర్

image

రుణమాఫీకి సంబంధించి రైతుల సమస్యలను పరిష్కరించేందుకుగాను ప్రజావాణి కార్యక్రమం నిర్వహించే అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన వివిధ అంశాలపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News July 21, 2024

ఖమ్మం: ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ, మునిసిపల్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ అధికారులకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News July 21, 2024

ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తాం: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవో ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. బదిలీలకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. సమావేశంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ, కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.

News July 21, 2024

ములుగు: లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అందుబాటులో ఉండాలి: మంత్రి సీతక్క

image

జిల్లాలోని నూతన ప్రాంతాల్లో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడూ గోదావరి వరద పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందస్తు ఏర్పాటు చేసిందని తెలిపారు. వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీతక్క పిలుపునిచ్చారు.

News July 21, 2024

పోచారం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీరు

image

నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయని అయిన పోచారం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లింగంపేట, గుండారం పెద్ద వాగుల ద్వారా ప్రాజెక్టులోకి స్వల్ప వరద ప్రవాహం కొనసాగుతుందని నీటిపారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్ నిండుతుందని రైతులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.

News July 21, 2024

ఎస్సారెస్పీకి పెరుగుతున్న వరద

image

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 15,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 489 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కెపాసిటీ 80.5 టీఎంసీలకు ప్రాజెక్టులో 18.443 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సరస్వతి కెనాల్‌కు 10 క్యూసెక్కుల, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

News July 20, 2024

HYD: అర్ధాంగి లేదనే బాధతో మృతిచెందిన భర్త

image

ఆలు మగలవి ఒక జీవితానికి చాలని ప్రేమలని ఓ కవి అన్నారు. అర్ధాంగిని కోల్పోయిన బాధను జీర్ణించుకోలేని ఓ భర్త మనోవేదనతో తనువు చాలించిన విషాద ఘటన ఇది. పద్మారావు‌నగర్ స్కందగిరి‌లో కొంతకాలంగా జిల్లా లక్ష్మణ్(80) నీలవేణి (70) కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. గత నెల 22న అనారోగ్యంతో నీలవేణి చనిపోయారు. దీంతో మనోవేదనకు గురైన భర్త శనివారం తనువు చాలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

News July 20, 2024

HYD: అర్ధాంగి లేదనే బాధతో మృతిచెందిన భర్త

image

ఆలు మగలవి ఒక జీవితానికి చాలని ప్రేమలని ఓ కవి అన్నారు. అర్ధాంగిని కోల్పోయిన బాధను జీర్ణించుకోలేని ఓ భర్త మనోవేదనతో తనువు చాలించిన విషాద ఘటన ఇది. సికింద్రాబాద్‌లోని పద్మారావు‌నగర్, స్కందగిరి‌లో కొంతకాలంగా జిల్లా లక్ష్మణ్(80) నీలవేణి (70) కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. గత నెల 22న అనారోగ్యంతో నీలవేణి చనిపోయారు. దీంతో మనోవేదనకు గురైన భర్త శనివారం తనువు చాలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.