India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పార్టీ మారుతున్నట్లు వస్తున్న వదంతులపై స్పందించారు. తాను బీఆర్ఎస్‌ని వీడుతున్నట్లు ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారడం లేదని, కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని కవిత అన్నారు. తనపై నమ్మకంతోనే మళ్లీ మహబూబాబాద్ ఎంపీ టికెట్ కేసీఆర్ కేటాయించారని చెప్పారు.
ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఏప్రిల్ 2న మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల భవనంలో నిర్వహించనున్నారు. అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే పటిష్ఠ బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏప్రిల్ 4 నాటికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రక్రియ ముగియనుంది.
రంజాన్ నేపథ్యంలో పాతబస్తీలో అత్తర్లఅమ్మకాలు జోరందుకున్నాయి. పాతబస్తీ అనగానే మొదటగా గుర్తొచ్చేది వీటి పరిమళాలే. ఇక్కడ దాదాపు 500 రకాలకుపైగా అత్తర్లు లభిస్తున్నాయి. ఇక్కడి దుకాణాల్లో సహజ సిద్ధంగా తయారు చేసిన అత్తర్లతో పాటు సింథటిక్ అత్తర్లు లభిస్తున్నాయి. 10 మి.లీ రూ.160 నుంచి రూ.4000 ధర పలికే అత్తర్లు ఈ పండగ సీజన్లో వెనువెంటనే అమ్ముడవుతున్నాయని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు.
రంజాన్ నేపథ్యంలో పాతబస్తీలో అత్తర్ల
అమ్మకాలు జోరందుకున్నాయి. పాతబస్తీ అనగానే మొదటగా గుర్తొచ్చేది వీటి పరిమళాలే. ఇక్కడ దాదాపు 500 రకాలకుపైగా అత్తర్లు లభిస్తున్నాయి. ఇక్కడి దుకాణాల్లో సహజ సిద్ధంగా తయారు చేసిన అత్తర్లతో పాటు సింథటిక్ అత్తర్లు లభిస్తున్నాయి. 10 మి.లీ రూ.160 నుంచి రూ.4000 ధర పలికే అత్తర్లు ఈ పండగ సీజన్లో వెనువెంటనే అమ్ముడవుతున్నాయని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు.
HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల BRS శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు మాజీ సీఎం KCR ఫోకస్ పెట్టారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓడిపోయినా, కొందరు కీలక నేతలు పార్టీని మోసం చేసి వెళ్లినా సరే BRSను గెలిపిస్తామని ఇటీవల ఆ పార్టీ MLAలు అన్నారు. మరి KCR సభతో BRS పుంజుకుంటుందా? మీ కామెంట్?
HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల BRS శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు మాజీ సీఎం KCR ఫోకస్ పెట్టారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓడిపోయినా, కొందరు కీలక నేతలు పార్టీని మోసం చేసి వెళ్లినా సరే BRSను గెలిపిస్తామని ఇటీవల ఆ పార్టీ MLAలు అన్నారు. మరి KCR సభతో BRS పుంజుకుంటుందా? మీ కామెంట్?
వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఆ స్థానం అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. ఈ స్థానం నుంచి పలువురు పోటీ పడుతుండగా టికెట్ ఎవరికి వస్తుందో అని ఆసక్తి నెలకొంది. సీనియర్ నాయకుడు దొమ్మాటి సాంబయ్య, పరంజ్యోతి, BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్, అలాగే త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్న కడియం శ్రీహరి కూతురు కావ్య సైతం పోటీలో ఉన్నట్లు సమాచారం.
ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం..జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన కళ్యాణ్ అనే యువకుడు గురువారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లాడు. గ్రామ శివారులోని పాడుబడ్డ కోళ్ల ఫారంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాయికల్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మన్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఎలక్షన్ రెడ్డిలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గత మూడు నాలుగు రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఇరువురికి పిలుపు వచ్చింది. వీరితో పాటు మరికొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో ఓటర్లు మొదటి, రెండు, మూడో ప్రాధాన్యత ఓట్లను వేయాల్సి ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటు వేయకుండా రెండు, మూడో ప్రాధాన్యత ఓటు వేసినా ఆ ఓటు చెల్లదు. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకు గానూ.. 1,437 ఓట్లు పోలయ్యాయి. మ్యాజిక్ ఫిగర్ 720 ఓట్లు. మొదటి ప్రాధాన్యత ఓటుగా 720 ఓట్లు ఎవరికి పోల్ అయితే వారిదే విజయం.
Sorry, no posts matched your criteria.