Telangana

News July 20, 2024

తూప్రాన్: పౌల్ట్రీ రైతు ఆత్మహత్య

image

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం పౌల్ట్రీ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్రెడ్డిపల్లికి చెందిన గార్ల ఆంజనేయులు (40) పౌల్ట్రీ, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య మౌనిక, ముగ్గురు సంతానం ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 20, 2024

భద్రాద్రి కొత్తగూడెం: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి: జిల్లా ఎస్పీ

image

భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అన్ని ప్రదేశాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేయాలన్నారు.

News July 20, 2024

తూప్రాన్: పౌల్ట్రీ రైతు ఆత్మహత్య

image

తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం పౌల్ట్రీ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుండ్రెడ్డిపల్లికి చెందిన గార్ల ఆంజనేయులు (40) పౌల్ట్రీ, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఈరోజు సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య మౌనిక, ముగ్గురు సంతానం ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 20, 2024

భీమిని: మద్యం మత్తులో తల్లిపై బ్లేడ్‌తో దాడి..ఆత్మహత్యాయత్నం

image

భీమిని మండల కేంద్రంలో రాంటెంకి శ్రీకాంత్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో తల్లి పోషక్కను బ్లేడ్‌తో చేతిపై గాయపర్చగా, అన్న శంకర్‌ను ఇనుపరాడ్‌తో కొట్టి తాను బ్లేడ్‌తో కోసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శ్రీకాంత్‌ను ఆసుపత్రికి తరలించే క్రమంలో హోంగార్డు అశోక్ పై దాడి చేసి బ్లేడ్‌తో గొంతు కోశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News July 20, 2024

దంతాలపల్లి మండలంలో కేజీబీవీ ఏర్పాటు

image

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కెజిబివి) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులను జారీచేశారు. ఉత్తర్వులకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచి 6, 7 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో అడ్మిషన్లను ప్రారంభించినట్లు డీఈఓ రామారావు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 20, 2024

భద్రాచలం: లోతట్టు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

image

భద్రాచలం నుండి 5 లక్షల 89 వేల 743 క్యూసెక్కుల వరద నీరు విడుదల అవుతున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దని చెప్పారు. ఏదేని అత్యవసర సేవలకు 24 గంటలు పనిచేయు విధంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

News July 20, 2024

NLG: కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే

image

రాజ్ భవన్ ముందు కేటీఆర్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు గవర్నర్‌ను కలవడానికి సిగ్గుండాలి అన్నారు. రాజ్యాంగాన్ని ఖననం చేసింది కల్వకుంట్ల కుటుంబం కాదా అని మండిపడ్డారు. తెలంగాణలో పదేళ్లలో ప్రతిపక్షం లేకుండా చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.

News July 20, 2024

NZB: ఏడాదిన్నరలో రోడ్డు ప్రమాదాల్లో 550 మంది మృతి

image

NZB జిల్లాలో గడిచిన ఏడాదిన్నరలోనే రోడ్డు ప్రమాదాలలో 550 మంది ప్రాణాలు కోల్పోయారని CP కల్మేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటుబెల్టు ధరించకపోవడం, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ టేక్, సెల్ ఫోన్ డ్రైవింగ్, సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం, రాంగ్ సైడ్ వెళ్లడం, సిగ్నల్స్ జంప్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.

News July 20, 2024

సికింద్రాబాద్‌లో ఆమ్రపాలి కాట ఇన్‌స్పెక్షన్

image

రేపు జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట ఏర్పాట్లను పరిశీలించారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంతో పాటు పలు దేవాలయాలకు సంబంధించిన రూట్‌లపై ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. శానిటేషన్, మొబైల్ టాయిలెట్స్, తదితర అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు ఫీల్డ్‌లో అందుబాటులో ఉండాలన్నారు.