India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రూ.3 కోట్ల విలువైన వజ్రాన్ని రూ.30 లక్షలకే విక్రయిస్తామని ప్రజలను నమ్మిస్తున్న ముఠాను HYD పాతబస్తీ హబీబ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.సౌత్‌వెస్ట్ DCP ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాలు.. ముంబైకి చెందిన బాలచంద్ర తులేరే(48), పాతబస్తీకి చెందిన ముస్తాబా అహ్మద్‌ఖాన్, సాజిద్ అలీతో కలిసి నకిలీ వజ్రం విక్రయించేందుకు గురువారం మల్లేపల్లికి వచ్చారు.స్థానికుల సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు.
నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్‌లో బుధవారం రైలు కింద పడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వారు ఇద్దరు నిజామాబాద్ నగరానికి చెందిన నందిని(20), శ్రీకాంత్ గా పోలీసులు గుర్తించారు. ఇరువురి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులు తమ ప్రేమను కాదంటారని భావించి బాసరకు చేరుకున్నారు. రాత్రి 8.30లకు రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు.
కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నెల 31న నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు పేర్లు వినిపించగా.. కొత్తగా తీన్మార్ మల్లన్న పేరు తెరమీదకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ KNR, సిరిసిల్ల, సిద్దిపేట, HNK డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిసింది. బరిలో నిలిచేదెవరో కామెంట్?
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగియగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య నువ్వా, నేనా అన్నట్లు ఎన్నికల యుద్ధం నడిచించి. అయితే లెక్క ప్రకారం వెయ్యి మందికి పైగా ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌కు ఉండగా.. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు పోలింగ్ సరళిని బట్టి రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఖమ్మం హెడ్ పోస్టాఫీస్‌లో నిత్యం రూ.1.50 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. పొదుపు పథకాలు, డిపాజిట్లు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, తపాలా జీవిత బీమా, మనియార్డర్లు , స్పీడ్ పోస్టులు, పార్సిళ్ల సేవలతో పాటు పాస్‌పోర్టు సేవలు, ఆధార్ సేవలు, స్టాంపుల విక్రయాలు వంటి వాటి ద్వారా ఈ లావాదేవీలు నమోదవుతున్నాయి. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
నల్గొండ, భువనగిరి లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేశాయి. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా రఘువీర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశ్, బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ బరిలో ఉన్నారు. వీరంతా ప్రచారంలో నిమగ్నం కానున్నారు.
గ్రేటర్ HYDలో కాంగ్రెస్ బలోపేతానికి ఆ పార్టీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరారు. ఉమ్మడి RR జిల్లాలోని అనేక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను సైతం కాంగ్రెస్ హస్తగతం చేసుకోగా ఈనెల 30న GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా మరికొందరు కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరనున్నారు. దీంతో MIM సహకారంతో GHMCని తమ చేతిలోకి తీసుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది.
గ్రేటర్ HYDలో కాంగ్రెస్ బలోపేతానికి ఆ పార్టీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరారు. ఉమ్మడి RR జిల్లాలోని అనేక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను సైతం కాంగ్రెస్ హస్తగతం చేసుకోగా ఈనెల 30న GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా మరికొందరు కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరనున్నారు. దీంతో MIM సహకారంతో GHMCని తమ చేతిలోకి తీసుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది.
జగిత్యాల జిల్లాలో 2023 – 24 సీజన్‌లో 1,18,824 హెక్టార్ల వరిసాగు జరిగిందని దీనికి గాను 565241 mts ల వరిధాన్యం కొనుగోలు కొరకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష గురువారం తెలిపారు. ఈ యాసంగి సీజన్లో వరి ధరలు గ్రేడ్ ఎ 2203, కామన్ ధరలు 2183గా ఉన్నాయన్నారు. ఈ సీజన్‌కు గాను ఐకెపి 133, పీఎసీఎస్ 282, మెప్మా 1, మొత్తం 416 వరి కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించినట్టు ఆమె తెలిపారు.
ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. లోక్ సభ అభ్యర్థులు నిబంధనలను ఉల్లంఘిస్తే గుర్తించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాలను నియమించింది. ప్రత్యేకబృందానికి కేటాయించిన వాహనానికి సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఉంది. ఈ బృందం రాజకీయ పార్టీల కార్యక్రమాలు, అభ్యర్థుల ర్యాలీలు జరిగే చోటుకు వెళితే చాలు అవన్నీ కెమెరాలో రికార్డయి అధికారులకు సమాచారం పోతుంది.
Sorry, no posts matched your criteria.