India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర ప్రభుత్వం స్వార్థ రాజకీయాలకు EDని ఉపయోగించుకుంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్ధి RS ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఏ మాత్రం ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్ చేశారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించాలన్నారు.
తాడ్వాయి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏటూరు నాగారం వైపు వెళ్లే జాతీయ రహదారిపై తాడ్వాయి దాటిన అనంతరం పెద్ద మోరి మూలమలుపు వద్ద బైకు గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతిచెందగా.. మరోవ్యక్తికి తీవ్ర గాయాలపరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలకు 2023-24 విద్యా సంవత్సరానికి చివరి పని దినం ఈ నెల 30 (శనివారం)గా పేర్కొంటూ ఇంటర్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా ఇంటర్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 31 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల వేదికను సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 6వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సభకు అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నట్లు తెలిపారు. అదే సభలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతోందని చెప్పారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. అయితే క్రాస్ ఓటింగ్ భయం ప్రతిపక్ష పార్టీని కంగారు పెడుతోంది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓడిపోతే కారు పార్టీకి మరో షాక్ తగిలినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. గెలుపుపై ఇరు పార్టీల నాయకులు ధీమాతో ఉన్నారు.
కొడంగల్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 6న తుక్కుగూడలో నిర్వహించే బహిరంగ సభకు రాహుల్ గాంధీ రానున్నారని, జాతీయ స్థాయిలో 5 గ్యారంటీలను ప్రకటిస్తారని వెల్లడించారు. సభా కార్యక్రమానికి నియోజకవర్గంలో నుంచి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్‌లో జరిగింది. ఎస్ఐ ముజాహిద్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడకి చెందిన శివయ్య(48) పాల వ్యాపారం చేస్తూ జీవించేవాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, మనస్తాపం చెంది గురువారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
పెద్ద కొడప్గల్ ఎస్సై కోనారెడ్డి, సిబ్బందిపై దాడికి పాల్పడిన దుండగులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బిచ్కుంద ఎస్సై తెలిపారు. బేగంపూర్ గేటు వద్ద మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఎస్సై కోనారెడ్డి, సిబ్బందిపై కాస్లాబాద్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మద్యం తాగి వచ్చి గొడవకు దిగి, దాడికి పాల్పడినట్లు వెల్లడించారు.
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. నిన్న జరిగిన సీఈసీ సమావేశంలో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తారని అందరూ భావించిన అది జరగలేదు. అభ్యర్థి ప్రకటనపై ఎందుకు ఆలస్యం జరుగుతుందో అర్థం కాకుండా ఉందని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే BRS, BJP అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారంలో వారు నిమగ్నమయ్యారని, త్వరగా అభ్యర్థిని ప్రకటించాలని కోరుతున్నారు.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫొటోలు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.